
Men’s Health: పురుషులు ఆరోగ్యంగా ఉండేందుకు పోషకాహారం ఎంతో అవసరం. అప్పుడే వారు ఆరోగ్యంగా బలంగా ఉంటారు. శరీరంలో మిటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు, మినరల్స్ లోపిస్తే ఏ పని చేతకాదు. అంతేకాదు ఆడవారి కంటే మగవారే బలహీనంగా శక్తి హీనంగా కనిపిస్తారు. ముఖ్యంగా పురుషులే ఎక్కువగా ఒత్తిడికి, ఆందోళనకు గురవుతూ ఉంటారట. అలాంటి వారు ఆరోగ్యంగా ఉండేందుకు బలమైన ఆహారం ఎంతో అవసరం. ముఖ్యంగా ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అంగస్తంభ లోపం: పురుషులకు వయసు మీద పడుతున్న కొద్దీ వృద్ధాప్య ఛాయలు వస్తుండటం చాలా కామన్. వీటితో పాటుగా అంగస్తంభన సమస్య కూడా తలెత్తుతుంది. ఇది డేంజర్ జబ్బు కాకపోయినా.. మగవారిని ఆందోళనకు గురిచేస్తుంది. ఈ సమస్య కారణంగా తమ లైఫ్ ను మనస్ఫూర్తిగా ఆస్వాదించలేకపోతుంటారు. దీని కారణంగా చాలా మంది పురుషులు డిప్రెషన్ లోకి వెళ్లిపోతున్నారట.
గుండె సమస్యలు: మహిళల కంటే మగవారికే ఎక్కువగా గుండె సంబంధిత వ్యాధులు సోకుతుంటాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆడవారికంటే మగవారే గుండె పోటుతో ఎక్కువగా చనిపోతున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఎందుకంటే వీరి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు విపరీతంగా పెరిగిపోయి.. గుండె జబ్బులు వస్తున్నాయట. ఈ సమస్య బారిన పడకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు పరుషులు తమ Blood pressure ను నియంత్రణలో ఉంచుకోవాల్సి ఉంటుంది.
ప్రోస్టేట్ క్యాన్సర్: వృద్ధాప్యంలో మగవారు ఎక్కువగా ప్రొస్టేట్ కు సంబంధించిన రోగాల బారిన పడే ప్రమాదముంది. చాలా మంది మగవారిలో ఈ Prostate gland పెద్దగా అయ్యి అనేక సమస్యలకు దారితీస్తుంది. అంతేకాదు ఎంతో మంది మగవారు Prostate cancer బారిన పడుతున్నారట. ఈ ముప్పు నుంచి బయటపడాలంటే రెగ్యులర్ గా డాక్టర్లను కలవాలి. నివారణా మార్గాలను క్రమం తప్పకుండా పాటించాలి.
ఊపిరితిత్తుల క్యాన్సర్: ఈ ఊపిరితిత్తుల క్యాన్సర్ స్మోకింగ్ చేయడం వల్లే ఎక్కువగా వస్తుంది. అందులోనూ ఈ స్మోకింగ్ ఆడవారికంటే మగవారికే ఎక్కువ అలవాటు . మీకు తెలుసా.. కేవలం స్మోక్ చేయడం వల్లే 90 శాతం ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయట. కాబట్టి ఈ ప్రమాదకారి బారిన పడుకుండా ఉండాలంటే స్మోక్ చేయడం వెంటనే మానుకోండి.
టెస్టోస్టెరాన్ హార్మోన్ పెరుగుదల: పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ పెరిగినా.. తగ్గినా నష్టం తప్ప లాభం ఉండదు. ఎందుకంటే ఈ హార్మోన్ తగ్గితే లైంఘిక సమస్యలు తలెత్తుతాయి. అంతేకాదు దీనివల్ల వారి లైంఘిక జీవితం సాఫీగా సాగదు. స్పెర్మ్ కౌంట్ పూర్తిగా తగ్గుతుంది.