నొప్పిగా ఉందని ఆస్పత్రికి వెళితే.. పురుషాంగం కత్తిరించేశారు

By ramya NFirst Published Apr 8, 2019, 4:56 PM IST
Highlights

అంగ స్తంభన సమస్యతో ఓ వ్యక్తి ఆస్పత్రికి వెళితే.. వైద్యులు ఏకంగా పురుషాంగానే కత్తిరించేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలో చోటుచేసుకుంది. 

అంగ స్తంభన సమస్యతో ఓ వ్యక్తి ఆస్పత్రికి వెళితే.. వైద్యులు ఏకంగా పురుషాంగానే కత్తిరించేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలో చోటుచేసుకుంది. అయితే.. పూర్తిగా కత్తిరించలేదు కానీ.. ఆ ప్రాంతంలోని కీలకభాగాన్ని మాత్రం తీసేసారు. అలా చేయకపోతే.. ఆయన ప్రాణాలకు ప్రమాదం వాటిల్లేదని.. అందుకే తీసేసినట్లు వైద్యులు చెప్పారు. ఇంతకీ అతనికి వచ్చిన సమస్య ఏంటో తెలుసా...? రెండు రోజుల పాటు అంగం స్తంభించిపోవడం.

లక్నోకి చెందిన 52ఏళ్ల వ్యక్తికి సడెన్ గా అంగం స్తంభించింది. రెండు రోజులపాటు అది అలానే ఉండిపోయింది. అంతేకాదు.. ఆ ప్రాంతంలో భరించలేని నొప్పి రావడం ప్రారంభమైంది. తట్టుకోలేక వెంటనే వైద్యలను సంప్రదించాడు. అది చాలా అరుదైన సమస్య కావడంతో వైద్యులు కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీకి తరలించారు. 

ప్రైపిజం అనే అరుదైన సమస్య వల్ల పురుషాగంలోని సిరల్లో రక్తప్రవాహానికి ఆటంకం ఏర్పడుతుంది. దాని వల్ల పురుషాంగం పైభాగంలో గ్యాంగ్రెనే  అనే నల్లని పుండు ఏర్పడుతుంది. బాధితుడికి కూడా ఇదే సమస్య ఏర్పడింది. అతడి శిష్నం మొత్తం మృతకణజాలంతో నిండిపోయింది. దీంతో వైద్యులు ఆ భాగాన్ని తీసివేశారు. 

దీన్ని సికిల్ సెల్ వ్యాధి అని కూడా అంటారని బీజేఎం కేస్ రిపోర్ట్స్ వెల్లడించింది. ఇది ఏర్పడిన వ్యక్తులకు అంగం స్తంభించి విఫరీమైన నొప్పి ఏర్పడుతుందని పేర్కొంది. అనధికార-అధికార డ్రగ్స్, వయాగ్రా, అంగ స్తంభనకు ఉపయోగించే ఇతర పదార్థాల మూలంగా ఈ వ్యాధి ఏర్పడుతుందని తెలిపింది.

ఈ సమస్య ఎవరికైనా వచ్చే అవకాశం ఉందని.. కాబట్టి అబ్బాయిలు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

click me!