శృంగారంలో ఎక్కువ సేపు పాల్గొనడానికి.. మూడ్ త్వరగా రావడానికి చాలా మంది వయాగ్రా వాడుతుంటారు. అయితే.. ఓ వ్యక్తి ఈ వయాగ్రా వాడటం అలవాటుగా మార్చుకున్నాడు.
శృంగారంలో ఎక్కువ సేపు పాల్గొనడానికి.. మూడ్ త్వరగా రావడానికి చాలా మంది వయాగ్రా వాడుతుంటారు. అయితే.. ఓ వ్యక్తి ఈ వయాగ్రా వాడటం అలవాటుగా మార్చుకున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే దానికి బానిసగా మారాడు. కాగా.. అంగస్థంభన సమస్యకు చెక్ పెడదామని చేసుకున్న అలవాటు కాస్త.. కంటి చూపుకే ఎసరు తెచ్చిపెట్టింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. అంస్తంభన సమస్యతో బాధపడుతున్న అతను వయాగ్రాకు అలవాటు పడ్డాడు. అది ఓవర్ డోస్ కావడంతో అతని కళ్లలోని రెటీనాపై ప్రభావం పడింది. అది క్రమేనా దృష్టి లోపం ఏర్పడి రంగులను గుర్తుపట్టలేని పరిస్థితి ఏర్పడి. అతనికి ప్రస్తుతం ఎర్ర రంగు తప్ప మరేదీ కనిపించడం లేదు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. తిరిగి మాములు పరిస్థితికి వస్తారో లేదో డాక్టర్లు కూడా చెప్పలేకపోతున్నారు.
దీనిపై వైద్యులు మాట్లాడుతూ..చాలా మంది ఏదైనా ఒకదానిని కొద్దిగా తీసుకోవడం మొదలుపెడితే.. కొంచెం తీసుకుంటేనే ఇంత బాగుందంటే.. ఎక్కువ తీసుకంటే ఎంకెంత బాగుంటుందో అని అనుకొని.. ఇలాంటి పరిణామాలు ఎదుర్కొంటూ ఉంటారని డాక్టర్లు చెప్పారు.
ఏదైనా మితంగా తీసుకుంటే ఎలాంటి సమస్యలు రావని.. అలా కాకుండా అతి చేస్తే సమస్యలు తప్పవని హెచ్చరించారు. వయాగ్రా కూడా ఎవరు పడితే వారు వాడకూడదని డాక్టర్ల సలహా మేరకే వాడాలని సూచించారు.