Face Glow: ఇలా చేస్తే.. 40 ఏళ్లలోనూ 20 ఏళ్ల వారిలా అందంగా కనిపిస్తారు!

Published : Jun 01, 2025, 05:19 PM IST
Face Glow: ఇలా చేస్తే.. 40 ఏళ్లలోనూ 20 ఏళ్ల వారిలా అందంగా కనిపిస్తారు!

సారాంశం

40 ఏళ్లు దాటిన తర్వాత చర్మంపై ముడతలు రావడం సహజం. కానీ కొన్ని మంచి అలవాట్లతో తిరిగి యవ్వనంగా కనిపించవచ్చు. మరి యవ్వనమైన చర్మం కోసం ఏం చేయాలో ఇక్కడ చూద్దాం.

 

40 ఏళ్లు దాటిన తర్వాత ముఖంపై ముడతలు రావడం, కాంతి తగ్గిపోవడం, చర్మం వదులుగా మారడం వంటివి జరుగుతుంటాయి. వీటిని తగ్గించుకునేందుకు చాలామంది రకరకాల ప్రాడక్టులు వాడుతుంటారు. కానీ అవన్నీ అవసరం లేదంటున్నారు నిపుణులు. ఆరోగ్యకరమైన అలవాట్లతో 40 దాటినా చర్మాన్ని యవ్వనంగా, కాంతివంతంగా ఉంచుకోవచ్చట. అవేంటో ఇక్కడ చూద్దాం.

గోరువెచ్చని నీళ్లు తాగండి

ప్రతిరోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు తాగడం శరీర ఆరోగ్యానికే కాదు.. చర్మ ఆరోగ్యానికి కూడా మంచిది. గోరువెచ్చని నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు ముఖానికి సహజ కాంతి వస్తుంది.

సరిపడా నిద్ర

నిద్రలేమి చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. నిద్ర సరిగా లేకపోవడం వల్ల అలసటతో పాటు చర్మంపై ముడతలు కనిపిస్తాయి. 7 నుంచి 8 గంటల గాఢనిద్ర చర్మాన్ని బాగుచేసి, ముఖాన్ని తాజాగా ఉంచుతుంది.

ఫేస్ యోగా, మసాజ్

ఫేస్ యోగా, మసాజ్ ముఖ కండరాలను బిగుతుగా ఉంచి, రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. చర్మానికి కాంతినిచ్చి, వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తాయి. రోజుకు 5-10 నిమిషాల ఫేస్ యోగా మంచి ఫలితాలను ఇస్తుంది.

యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారం

ఆకుకూరలు, పండ్లు (ముఖ్యంగా విటమిన్ సి ఉన్నవి), గింజలు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలున్న ఆహారం.. చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతుంది. నారింజ, బీట్రూట్, పుచ్చకాయ, బాదం వంటివి తినడం మంచిది.

మాయిశ్చరైజర్

సాధారణంగా వయసు పెరిగేకొద్దీ చర్మం పొడిబారుతుంటుంది. కాబట్టి స్కిన్ టోన్ కి తగ్గ మాయిశ్చరైజర్ వాడండి. ఇది చర్మాన్ని పొడిబారకుండా కాపాడుతుంది. 

ఒత్తిడికి దూరంగా ఉండండి

మానసిక ఒత్తిడి చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. రోజుకు 10-15 నిమిషాల ధ్యానం, యోగా, వ్యాయామాలు మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. ఇవి చర్మంపై మంచి ప్రభావం చూపిస్తాయి.

నిపుణుల ప్రకారం 

చర్మ సౌందర్యానికి ఖరీదైన ఉత్పత్తులు వాడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. మంచి జీవనశైలి, ఆరోగ్యకరమైన ఆహారం, సరిపడా నిద్ర, ఒత్తిడి నియంత్రణతో చర్మం ఆరోగ్యాన్నికాపాడుకోవచ్చని సూచిస్తున్నారు.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Wife Vs Girl Friend Psychology : ఎవరిని హ్యాండిల్ చేయడం కష్టం.. గర్ల్‌ఫ్రెండ్‌ నా, భార్యనా?
Fatty Liver: కొంచెం తిన్నా కడుపు ఉబ్బుతోందా.? ఫ్యాటీ లివ‌ర్ కావొచ్చు, అల‌ర్ట్ అవ్వండి