ఈ ఏడాది మహాశివరాత్రి ఎప్పుడు? శుభముహూర్తం, పూజా విధానం మీకోసం..

Published : Feb 12, 2023, 09:48 AM IST
ఈ ఏడాది మహాశివరాత్రి ఎప్పుడు? శుభముహూర్తం, పూజా విధానం మీకోసం..

సారాంశం

mahashivratri 2023: ఈ ఏడాది మహాశివ రాత్రి తేదీపై ప్రజలకు అయోమయం నెలకొంది. కొందరు ఫిబ్రవరి 18న అంటే.. ఇంకొందరు ఫిబ్రవరి 19 న శివరాత్రి అని అంటున్నారు. ఇంతకీ శివరాత్రి ఏ తేదీన అంటే.. 

mahashivratri 2023: హిందూ పంచాంగం ప్రకారం.. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్షం చతుర్దశి రోజున మహాశివరాత్రి పండుగను జరుపుకుంటారు. శివపార్వతుల వివాహం ఈ రోజే జరిగిందని  నమ్ముతారు. అంతేకాకదు ఈ రోజునే శివుని 12 జ్యోతిర్లింగాలు భూమిపై ఉద్భవించాయని పండితులు చెబుతారు. కాగా ఈ సారి శివరాత్రి తేదీపై ప్రజలకు అయోమయం నెలకొంది. కొంతమంది ఫిబ్రవరి 18న అంటే ఇంకొంతమంది ఫిబ్రవరి 19 నే  శివరాత్రి అంటున్నారు. 

మహారాత్రిని ఎప్పుడు జరుపుకుంటారు? తేదీ, సమయం ఎప్పుడు? 

హిందూ క్యాలెండర్ ప్రకారం.. మహాశివరాత్రి పండుగ ఫిబ్రవరి 18, శనివారం రాత్రి 8.03 గంటలకు ప్రారంభమై ఫిబ్రవరి 19 న అంటే ఆదివారం సాయంత్రం 04.19 గంటలకు ముగుస్తుంది. కాబట్టి ఈ పండుగను ఫిబ్రవరి 18న మాత్రమే జరుపుకోవాలని పూజారులు చెబుతున్నారు. 

త్రిగ్రహి యోగం

ఈ సంవత్సరం మహాశివరాత్రి పండుగ చాలా ప్రత్యేకమైనది. ఈ సారి మహాశివరాత్రి నాడు త్రిగ్రహి యోగం ఏర్పడబోతోంది. అయితే ఈ ఏడాది జనవరి 17 న శని కుంభరాశిలోకి ప్రవేశించాడు. ఇప్పుడు ఫిబ్రవరి 13న గ్రహాల రారాజు అయిన సూర్యుడు కకూడా ఈ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఫిబ్రవరి 18న శని, సూర్యుడితో పాటుగా చంద్రుడు కూడా కుంభ రాశిలో ఉంటాడు. కుంభరాశిలో శని, సూర్య చంద్రులు కలిసి త్రిగ్రహి యోగాన్ని ఏర్పరుస్తారు. 

మహాశిరాత్రి పూజా విధి

మహాశివరాత్రి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి. శుభ్రమైన దుస్తులు ధరించి నిష్టగా ఉపవాసం ఉండాలి. ఆ తర్వాత దగ్గర్లో ఉన్న శివాలయానికి వెళ్లి శివుడిని పూజించాలి. పచ్చి పాలు, చెరకు రసం లేదా స్వచ్ఛమైన నెయ్యితో శివలింగానికి అభిషేకం చేయాలలి. ఆ తర్వాత జాజికాయ, తామర, పండ్లు, పువ్వులు, స్వీట్లు మొదలైన వాటిని మహాదేవుడికి సమర్పించండి.ఆ తర్వాత  శివ చాలీసాను పఠించండి. 

మహాశివరాత్రి రోజున ఏం చేయకూడదు

మహాశివరాత్రి రోజున శివలింగానికి మర్చిపోయి కూడా తులసి ఆకులను సమర్పించకూడదు. ముఖ్యంగా ధ్యానం చేయకూడదు. ఆహారాన్ని తీసుకోకూడదు. విరిగిన బియ్యాన్ని శివుడికి సమర్పించకూడదు. శివుడికి గానీ శివలింగానికి గానీ కుంకుమను సమర్పించకూడదు. ఈ రోజును కోపగించుకోకూడదు. అసభ్యకరమైన పదాలను మాట్లాడకూడదు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Software Employees: ఎలాంటి చెడు అలవాట్లు లేకున్నా ఈ తీవ్ర వ్యాధికి గురవుతున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు
ఇవి రాస్తే.. తలలో చుండ్రు మాయం