మన కిచెన్ లోనే పెయిన్ కిల్లర్స్

By ramya neerukondaFirst Published Jan 10, 2019, 3:05 PM IST
Highlights

సహజంగా కిచెన్ లో లభించే కొన్ని పదార్థాలతో.. నొప్పులకు స్వస్తి పలకొచ్చు అంటున్నారు నిపుణులు. మరి అవేంటో మనమూ తెలుసుకుందామా...

మనిషి అన్నాక.. ఏదో ఒక నొప్పి రావడం సహజం. చిన్న నొప్పి అయితే.. భరించేస్తాం. భరించలేని నొప్పి అయితే.. వెంటనే పెయిన్ కిల్లర్స్ ని ఆప్షన్ గా చేసుకుంటాం. అయితే.. మనం తీసుకునే పెయిన్ కిల్లర్స్ ఎంత వరకు సురక్షితం.  చాలా రకాల పెయిన్ కిల్లర్స్ వాడొద్దని వైద్యులు హెచ్చరిస్తూనే ఉన్నా కూడా మనలో చాలా మంది వాటిని వాడుతూనే ఉన్నాం. వాటి వల్ల భవిష్యత్తులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో అనే భయం మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. అయితే.. అలాంటివి ఏమీలేకుండా... సహజంగా కిచెన్ లో లభించే కొన్ని పదార్థాలతో.. నొప్పులకు స్వస్తి పలకొచ్చు అంటున్నారు నిపుణులు. మరి అవేంటో మనమూ తెలుసుకుందామా...

పెరుగు.. తాజా పెరుగు తీసుకుంటే.. కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి లాంటి వాటి నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. పెరుగులో ఆరోగ్యకరమైన ప్రోబియోటిక్స్ ఉంటాయి. అవి  జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.

పుదీనా.. కండరాలనొప్పి, కండరాల నొప్పి, పళ్లనొప్పి, తలనొప్పి, నరాల నొప్పులు తగ్గాలంటే పుదీనా మంచి ఉపాయం. పుదీనా ఆకులు నమలాలి. అరుగుదల మెరుగుపడుతుంది. మైండ్‌ని చల్లబరుస్తుంది. అందులో ఉండే వైద్య గుణాలు కండరాలను, నరాలను రిలాక్స్ చేస్తుంది. రాత్రి నిద్రపోయే ముందు పుదీనా ఆకులను గోరువెచ్చని నీటిలో పది పన్నెండు వేసుకొని, తెల్లవారుజామున ఆ నీటిని తాగితే మంచిది. 

అల్లం..అల్లంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కండరాల నొప్పిని, ఆర్థరైటిస్‌ను, కడుపునొప్పి, ఛాతీ, నెలసరి నొప్పులను తగ్గిస్తుంది. కొద్దిగా అల్లం ముక్క నమిలితే గ్యాస్టిక్ సమస్య నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. అల్లం చాయ తాగితే మైగ్రెయిన్ తలనొప్పి తగ్గుతుంది. ఊపిరితిత్తుల ట్రాక్ ఇన్‌ఫెక్షన్, బ్రాంకైటిస్, దగ్గును తగ్గిస్తుంది. 

పసుపు..దీర్ఘకాలికంగా ఉన్న నొప్పుల్ని కూడా తగ్గించగలిగే గుణం దీనికి ఉంటుంది. అందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు జాయింట్లు, కండరాల నొప్పుల్ని తగ్గించగలదు. పసుపు, అలోవేరా జెల్‌ను మిశ్రమంగా చేసి దురద, నొప్పి వున్న చోట రాస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది. నోటి అల్సర్స్‌కి పసుపు, కొబ్బరినూనె పేస్ట్ రాస్తే తగ్గుతాయి. 

click me!