పొట్ట దగ్గర కొవ్వు తగ్గించే అద్భుతమైన ఆహారాలు ఇవే..

By ramya neerukondaFirst Published Jan 8, 2019, 4:12 PM IST
Highlights

కొన్ని రకాల ఆహారాలు.. కొవ్వును తగ్గించడంలో ముందు వరసలో ఉంటాయి అంటున్నారు ఆహార నిపుణులు. మరి అవేంటో మనమూ ఓసారి చూసేద్దామా...
 

బెల్లీ ఫ్యాట్ సమస్యతో బాధపడేవారి సంఖ్య ఈ కాలంలో చాలా మంది ఉన్నారు. ఏది తిన్నా చాలు.. కొవ్వు అంతా పొట్ట, నడుము దగ్గర చేరిపోతుంటుంది. వాకింగ్ లాంటివి చేసినా కూడా ప్రతిఫలం పెద్దగా ఉండదు. అయితే.. కొన్ని రకాల ఆహారాలు.. కొవ్వును తగ్గించడంలో ముందు వరసలో ఉంటాయి అంటున్నారు ఆహార నిపుణులు. మరి అవేంటో మనమూ ఓసారి చూసేద్దామా...

1.ఉసిరికాయలు.. వీటిని నిత్యం తీసుకుంటే అధిక బరువు సులభంగా తగ్గుతుంది. అలాగే పొట్ట దగ్గరి కొవ్వు కూడా కరుగుతుంది. బరువు తగ్గించడంలో ఉసిరి అమోఘంగా పనిచేస్తుంది. నిత్యం ఉదయాన్నే పరగడుపునే ఉసిరి కాయ రసాన్ని తాగితే ఫలితం ఉంటుంది. 
2. జీలకర్ర...గుప్పెడు జీలకర్రను నీటిలో వేసి బాగా మరిగించి కషాయంలా చేసుకుని జీలకర్ర నీటిని రోజూ తాగాలి. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. అధిక కొవ్వును కరిగిస్తుంది. 
3. మెంతులు...మెంతులు ఆకలిని తగ్గిస్తాయి. బరువు తగ్గేందుకు సహాయ పడుతాయి. రాత్రి పూట గుప్పెడు మెంతులను నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగి మెంతులను తినాలి. ప్రతి రోజూ పరగడుపునే ఇలా చేస్తే చాలా త్వరగా కొవ్వు కరిగిపోతుంది. అధిక బరువు తగ్గుతారు. మన శరీర 
4. దాల్చిన చెక్క...మెటబాలిజాన్ని పెంచే గుణాలు దాల్చిన చెక్కలో ఉన్నాయి. దాల్చిన చెక్క పొడిని వేడి నీటిలో కలిపి తాగితే శరీర మెటబాలిజం పెరుగుతుంది. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. పొట్ట దగ్గరి కొవ్వును కరిగించడంలో దాల్చిన చెక్క అమోఘంగా పనిచేస్తుంది. 
 

click me!