భోజనం తర్వాత చేయకూడని పనులు ఇవే...

By ramya neerukondaFirst Published Jan 5, 2019, 4:03 PM IST
Highlights

చాలా మంది భోజనం చేసిన తర్వాత కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. వాటి కారణంగా ఎంత మంచి ఫుడ్ తిన్నా కూడా.. అది వంట పట్టదట. 

ఆరోగ్యంగా ఉండాలంటే.. పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటే చాలని చాలా మంది భావిస్తుంటారు.  అయితే.. కేవలం పోషకాహారం తింటే సరిపోదు.. కొన్ని రకాల నియమాలను కూడా పాటించాలంటున్నారు నిపుణులు. చాలా మంది భోజనం చేసిన తర్వాత కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. వాటి కారణంగా ఎంత మంచి ఫుడ్ తిన్నా కూడా.. అది వంట పట్టదట. మరి భోజనం తర్వాత చేయకూడని పనులేంటో మనమూ ఓ లుక్కేద్దామా...

చాలా మందికి భోజనం చేసిన వెంటనే పండ్లు తినే అలవాటు ఉంటుంది.  ఆ అలవాటు ఏ మాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. దీనివల్ల పొట్ట పెరుగుతుందట. భోజనానికీ, పండ్ల మధ్య టైమ్ గ్యాప్ కనీసం రెండు గంటలైనా ఉండాలంటున్నారు. ఇంకొందరు వేళా పాళా లేకుండా టీ తాగేస్తుంటారు. భోజనం తర్వాత మాత్రం తాగకూడదు అంటున్నారు నిపుణులు.

టీపొడిలో ఉండే ఆమ్లాలు..ఆహారంలో ఉండే మాంసకృత్తులు శరీరం వినియోగించుకోకుండా అడ్డుకుంటాయట. అందుకే భోజనం తర్వాత టీకి కాస్త దూరంగా ఉండాలి.  ఇంకొందరికి భోజనం చేసిన తర్వాత స్నానం చేసే అలవాటు ఉంటుంది. దీనివల్ల జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. 

అంతేకాదు.. భోజనం చేసిన వెంటనే కూడా వాకింగ్ చేయకూడదు. కనీసం గంట గ్యాప్ ఇచ్చి చేస్తే చాలా మంచిది. భోజనం చేసిన వెంటనే నిద్ర పోవడం కూడా మంచిది కాదట. 

click me!