కాఫీతో నిద్ర కరువా..?

By ramya neerukondaFirst Published Aug 30, 2018, 4:00 PM IST
Highlights

రోజుకు రెండుకప్పులకు మించి కాఫీ తాగే వారిలో 30 సంవత్సరాల తరువాత నిద్రలేమి సమస్య ఏర్పడుతుందన్న విషయం తాజా అధ్యయనంలో తేలింది. 
 

ఉదయం లేవగానే.. గొంతులో కాఫీ పడనిదే చాలా మందికి తెల్లారదు.  ఒక్కసారి కాదు.. రోజుకి నాలుగైదు కప్పులు కాఫీలు లాగించేవారు చాలా మందే ఉంటారు. అయితే.. కాఫీ వల్ల నిజంగా ప్రయోజనాలు ఉన్నాయా.. లేదా నష్టాలు ఉన్నాయా అన్న విషయంలో క్లారిటీ లేదు. ఎందుకంటే కొన్ని పరిశోధనల్లో కాఫీ తాగితే మంచిదని, మరికొన్ని పరిశోధనల్లో కాఫీ తాగడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయని తేలాయి

తాజాగా.. దక్షిణకొరియా యూనివర్సిటీ వారి అధ్యయనం ప్రకారం కాఫీతో నిద్ర కరవు అవుతుందని తేలింది.  మెదడులో పీనియల్‌ (pineal )గ్రంథి మెలొటినిన్‌ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్లలో హెచ్చుతగ్గులే నిద్రలేమికీ కారణం అవుతుంటాయి. రోజుకు రెండుకప్పులకు మించి కాఫీ తాగే వారిలో 30 సంవత్సరాల తరువాత నిద్రలేమి సమస్య ఏర్పడుతుందన్న విషయం తాజా అధ్యయనంలో తేలింది. 

కాఫీ తాగడం వలన పీనియల్‌ గ్రంథి క్రమేపీ చిన్నదిగా మారుతుందనీ, దాంతో దీని నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్‌ శాతం కూడా తగ్గిపోతుందనీ, ఇదే నిద్రలేమికి కారణమవుతుందని అధ్యయనకారులు చెబుతున్నారు. సుమారు 162 మంది ఆహారపు అలవాట్లను, వారు రోజు మొత్తంలో ఎన్నిసార్లు కాఫీ తాగుతారన్న విషయాలు దీర్ఘకాలం పాటు పరిశీలించారు. ప్రతిరోజూ రెండు కప్పుల కన్నా ఎక్కువ కాఫీ తాగే వారి మెదడును ఎంఆర్‌ఐ స్కాను చేయగా ఈ గ్రంథి చిన్నగా మారిన విషయాన్ని అధ్యయనకారులు గుర్తించారు. వీరు రోజు మొత్తంలో నిద్రపోయే సమయం తగ్గిపోవడానికి  గ్రంథి పరిమాణమే కారణమని వారు స్పష్టం చేస్తున్నారు. 
 

click me!