టాయ్ లెట్ సీట్ కన్నా ఎక్కువ క్రిములు స్మార్ట్ ఫోన్ కే

By ramya neerukondaFirst Published 22, Aug 2018, 4:34 PM IST
Highlights

టాయిలెట్ల కన్నా మీ స్మార్ట్‌ఫోన్‌పైనే ఎక్కువగా క్రిములు, మురికి ఉంటాయట. ఇంగ్లాండ్‌కు చెందిన ఇన్సూరెన్స్‌2గో అనే సంస్థ నిర్వహించిన అధ్యయనంలో బయటపడింది ఈ విషయం.

టాయ్ లెట్ కి వెళ్లిరాగానే...అందరూ తమ చేతులను హ్యాండ్ వాష్ లతో శుభ్రం చేసుకుంటారు. ఎందుకో తెలుసా.. టాయ్ లెట్ లో మన కంటికి కనిపించని.. లక్షలాది క్రిములు ఉంటాయి. అందుకే వాటి నుంచి జబ్బులు రాకుండా ఉండేందుకు ఇలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఒకే ఇది బాగానే ఉంది. మరి స్మార్ట్ ఫోన్ పట్టుకున్న ప్రతిసారి మీ చేతులు కడుక్కుంటున్నారా..? ఫోన్ ఏమీ టాయ్ లెట్ కాదు కదా.. అని అనుకుంటున్నారా? టాయ్ లెట్ కన్నా ఎక్కువ ప్రమాదకరం స్మార్ట్ ఫోన్లు. 

టాయిలెట్ల కన్నా మీ స్మార్ట్‌ఫోన్‌పైనే ఎక్కువగా క్రిములు, మురికి ఉంటాయట. ఇంగ్లాండ్‌కు చెందిన ఇన్సూరెన్స్‌2గో అనే సంస్థ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. టాయిలెట్లన్నా రోజూ క్లీన్ చేస్తారు కానీ... అసలు మీ స్మార్ట్‌ఫోన్‌ని మీరు పట్టించుకుంటే కదా. ఫోన్ వాడేవారిలో 35 శాతం మంది అసలు స్మార్ట్‌ఫోన్‌ని శుభ్రమే చేయరని ఆ సంస్థ నిర్వహించిన సర్వేలో బయటపడింది. స్మార్ట్‌ఫోన్లపై మురికి, బ్యాక్టీరియా, బూజు ఏ స్థాయిలో ఉందో పరీక్షించేందుకు ఐఫోన్ 6, సాంసంగ్ గెలాక్సీ 8, గూగుల్ పిక్సెల్ ఫోన్లను తీసుకున్నారు పరిశోధకులు.

ఒక్కో ఫోన్‌పై 84 సీఎఫ్‌యూ బ్యాక్టీరియాలు కనిపించాయి. అదే టాయిలెట్, ఫ్లష్‌లో ఉండేది 24 సీఎఫ్‌యూనే. ఆఫీసులో కంప్యూటర్ కీబర్డ్, మౌజ్‌పై ఐదు ఉంటాయి. స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు సగటున 30 సీఎఫ్‌యూ, లాక్ బటన్‌పై 23.8 సీఎఫ్‌యూ, హోమ్ బటన్‌పై 10.6 బ్యాక్టీరియాలు ఉంటాయి.

Last Updated 9, Sep 2018, 11:01 AM IST