అంగం స్తంభించడం.. గుండె నొప్పికి సంకేతమా..?

By ramya neerukondaFirst Published Aug 28, 2018, 11:35 AM IST
Highlights

 శృంగార భావనలను ముందుగా మెదడు ప్రేరేపిస్తుంది. అవి అక్కడి నుంచి వెన్నుపాములోని నాడుల ద్వారా అంగానికి చేరుకుంటాయి. వెంటనే అక్కడి సున్నిత కండరాలు విశ్రాంతి భావనలోకి రావటం.. రక్తం లోపలికి వచ్చి చేరిపోవటం జరుగుతుంది. 

పురుషుల్లో అంగస్తంభన సమస్యలు ప్రస్తుత కాలంలో ఎక్కువయ్యాయనే చెప్పవచ్చు. అయితే.. ఈ అంగ స్తంభనను అంత తేలికగా తీసుకోకూడదు అంటున్నారు నిపుణులు. ఇది మున్ముందు రానున్న గుండె నొప్పికి తొలి సంకేతంగా భావించాలంటున్నారు. 

గుండె నుంచి రక్త ప్రసరణ జరిగా జరగకపోతేనే అంగ స్తంభన సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇవాల్టి రోజున అంగ స్తంభన లోపాన్ని.. మున్ముందు రాబోయే గుండె, రక్తనాళాల వ్యాధులకు ఒక ముందస్తు సంకేతంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే మన దేశంలో అధిక సంఖ్యలో గుండె జబ్బు బాధితులున్నారు. దీన్ని బట్టి స్తంభన లోపం ఎంత ఎక్కువగా ఉందో మనం గ్రహించవచ్చు. 

చిన్న వయసులోనే గుండెపోటుకు గురవుతున్న వారి సంఖ్య మన దేశంలోనే ఎక్కువ. ఇది ఒక్క రోజులోనో అప్పటికప్పుడో పుట్టుకొచ్చేది కాదు. దీనికి చాలాకాలం ముందు నుంచే గుండె జబ్బు మొదలై ఉంటుంది. వారిలో అంగస్తంభన లోపం కూడా అంతకు ముందే ఆరంభమై ఉండొచ్చు. కాబట్టి- కనీసం దాన్ని గుర్తించి పరీక్షలు చేయించుకున్నా.. గుండె జబ్బుల ముప్పు నుంచి ముందుగానే బయటపడటానికి వీలుండేదని చెప్పుకోవచ్చు.

అంగం సూక్ష్మమైన రక్తనాళాలతో నిండిన సున్నితమైన అవయవం. దీని మధ్యలో రెండు గొట్టాల వంటి సున్నిత స్పాంజి వంటి కండర నిర్మాణాలు (కార్పోరా కావర్నోజా) ఉంటాయి. ఇవి ఎప్పుడూ సంకోచించి ఉంటాయి. శృంగార భావనలు కలిగినప్పుడు.. అంగంలోని ఈ సున్నితమైన కండరాలు విశ్రాంతిగా.. వదులుగా తయారవుతాయి. దీంతో వీటిలోకి రక్త ప్రవాహం పెరిగిపోయి అంగం స్తంభిస్తుంది.

 శృంగార భావనలను ముందుగా మెదడు ప్రేరేపిస్తుంది. అవి అక్కడి నుంచి వెన్నుపాములోని నాడుల ద్వారా అంగానికి చేరుకుంటాయి. వెంటనే అక్కడి సున్నిత కండరాలు విశ్రాంతి భావనలోకి రావటం.. రక్తం లోపలికి వచ్చి చేరిపోవటం జరుగుతుంది. ఇక ఆ రక్తం తిరిగి బయటకు వెళ్లిపోకుండా సిరలకు ఉండే కవాటాలు మూసుకుంటాయి. దీంతో రక్తం లోపలే ఉండి... స్తంభన నిలబడుతుంది. ఒకసారి శృంగార వాంఛ పూర్తయినా, స్ఖలనమైనా.. ఆ ప్రేరేపణలు తగ్గి.. ఆ కవాటాలు తెరుచుకుని.. రక్తం వెనక్కి వెళ్లిపోతుంది. స్తంభన తగ్గి.. అంగం సాధారణ స్థితికి వస్తుంది. అందుకే అంగస్తంభనలో నాడులు, రక్తనాళాలదే కీలక పాత్ర.

కాబట్టి స్తంభన సమస్యలు మొదలైతే.. వెంటనే డాక్టర్ ని సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. 

click me!
Last Updated Sep 9, 2018, 11:38 AM IST
click me!