International No Diet Day 2022: ఈ రోజు నో డైట్ రూల్స్.. బరువు గురించి ఆలోచించకుండా తినొచ్చు.. కానీ..?

Published : May 06, 2022, 02:27 PM ISTUpdated : May 06, 2022, 02:30 PM IST
International No Diet Day 2022: ఈ రోజు నో డైట్ రూల్స్..  బరువు గురించి ఆలోచించకుండా తినొచ్చు.. కానీ..?

సారాంశం

International No Diet Day 2022: ప్రతి ఏడాది అంతర్జాతీయ నో డైట్ డేను జరుపుకుంటారు. ఈ రోజు ప్రత్యేకత ఏంటీ? ఈ రోజు డైట్ కు నో చెప్పడాకి ప్రత్యేకంగా ఒక రోజు ఎందుకందో  తెలుసుకుందాం.   

International No Diet Day 2022: అంతర్జాతీయ నో డైట్ డేను ప్రతి సంవత్సరం మే 6 న జరుపుకుంటాం. ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించడానికి , చెడు ఆహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రమాదాల గురించి అవగాహన కల్పించడానికి నో డైట్ డేను జరుపుకుంటారు. ఇక ఈ నో డైట్ రోజున మనకు నచ్చిన ఆహారాన్ని తినొచ్చు. మన ఇష్టా ఇష్టాలను వదులుకోవాల్సిన అవసరం లేదు. కానీ అనారోగ్యం పాలు చేసే ఆహారాలు తీసుకుంటేనే అసలుకే మోసం జరుగుతుంది. మరి ఈ నో డైట్ రోజున స్థూలకాయాన్ని తగ్గించుకోవడానికి ఎలాంటి డైట్ ను ప్లాన్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఒకేసారి ఎక్కువగా తినకండి.. చాలా మంది తిన్నప్పుడే ఎక్కువ మొత్తంలో తీసుకుంటారు. కానీ ఒకేసారి ఎక్కువ మొత్తంలో తింటే అధిక బరువు, ఊబకాయం బారిన పడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అందుకే ఒకే సారి ఎక్కువ సార్లు తినకుండా కొద్ది కొద్దిగా రెండు మూడుసార్లు తినండి. ఇలా తింటే ఫ్యాట్ కూడా పెరిగే అవకాశం ఉండదు. 

ఇలా తినండి.. నిద్రలేవగానే పరిగడుపున గ్లాస్ నీళ్లను తాగాలి. ఒకేసారి కాకుండా నెమ్మదిగా సిప్ చేస్తూ తాగితే చాలా మంచిది. నీళ్లు మీ కడుపును క్లీన్ చేస్తాయి. అంతేకాదు నీళ్లను ఎక్కువ మొత్తంలో తాగడం వల్ల మన శరీరంలో ఉండే ట్యాక్సిన్స్ తొలగిపోతాయి. ఆ తర్వాత బ్రష్ చేసుకుని లెమన్ టీ లేదా గ్రీన్ టీ తాగొచ్చు. కానీ పరిగడుపున ఎట్టి పరిస్థితిలో టీ తాగకూడదు. దీనివల్ల ఎసిడిటీ, గ్యాస్ వంటి ఉదర సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 

ఇకపోతే ఖచ్చితంగా సీజనల్ పండ్లను ఖచ్చితంగా తినాలి. ముఖ్యంగా సిట్రస్ ఫ్రూట్స్ ను ఎక్కువగా తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అలాగే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. 

ఈ ఎండకాలంలో నీటిశాతం ఎక్కువగా ఉండే పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా పుచ్చకాయ, దోసకాయ, ద్రాక్షల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల బాడీ హైడ్రేటెడ్ గా ఉండటంతో పాటుగా ట్యాక్సిన్స్ కూడా బయటకు పంపుతాయి.

ఇక మధ్యాహ్నం సమయంలో భోజనంలో పప్పులు, పెరుగు, రెండు చపాతీలు, కూరగాయలతో తింటే మంచిది. ఇక రాత్రిపూట మసాలా ఫుడ్స్ ను తీసుకోకుండా చపాతీలు, పప్పు, సొరకాయలను తీసుకుంటే మీ ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదు. ఫ్యాట్ లేని పాలు తీసుకోవడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Garuda Puranam: జీవితంలో ఈ పనులు చేయకపోతే భయంకర శిక్షలు తప్పవంటున్న గరుడ పురాణం
Health: చాయ్‌తో వీటిని క‌లిపి తింటున్నారా.? తీవ్ర స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు