BedSheets: బెడ్ షీట్లను వాష్ చేయడానికి బద్దకమైతే.. ఆ సమస్యలు తప్పవంటున్న తాజా సర్వే..

Published : May 01, 2022, 12:19 PM ISTUpdated : May 01, 2022, 12:20 PM IST
BedSheets: బెడ్ షీట్లను వాష్ చేయడానికి బద్దకమైతే.. ఆ సమస్యలు తప్పవంటున్న తాజా సర్వే..

సారాంశం

BedSheets: మనం ఎంత పరిశుభ్రంగా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటామన్న సంగతి అందరికీ తెలుసు. కానీ చాలా మంది పరిశుభ్రతను మాత్రం పాటించరు. ముఖ్యంగా బెడ్ షీట్లను శుభ్రంగా ఉంచుకోకపోతే అలర్జీలు, చర్మంపై దద్దుర్లు, ఆస్తమా వంటి సమస్యలు వస్తాయని స్లీప్ సైన్స్ కోచ్ డేనియల్ నోయిడ్ చెబుతున్నారు. 

BedSheets: మీరు ప్రతిరోజూ మీ బెడ్ షీట్ క్లీన్ చేస్తున్నారా? అయితే ఎన్ని రోజులకోసారి బెడ్ షీట్ ను మార్చుతున్నారు? ఇదేం ప్రశ్న అంటారేమో.. ఈ విషయాలపై ఓ అధ్యయనం పలు ఆసక్తికరమైన విషయాలను వెళ్లడించింది. తాజాగా యూకేలో 2,250 మందిపై ఈ అధ్యయనం నిర్వహించారు పరిశోధకులు. 

సర్వేలో వెల్లడైన షాకింగ్ విషయాలు..  పెళ్లికానీ పురుషుల్లో దాదాపుగా సగం మంది నాలుగు నెలల వరకు కూడా తమ బెడ్ షీట్లను శుభ్రం చేసుకోవడం లేదని అధ్యయనంలో వెళ్లడైంది. బెడ్ షీట్లు మాసిపోయినా కానీ అలాగే వాటిని యూజ్ చేస్తున్నారట. కానీ ఈ అలవాటు అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. 

62 శాతం పెళ్లికాని మహిళలు ప్రతి రెండు వారాలకు ఒకసారి తమ బెడ్ షీట్లను శుభ్రం చేసుకుంటున్నారని అధ్యయనంలో వెల్లడైంది. ఏదేమైనా ఈ అధ్యయనంలో పాల్గొన్న జంటలు ప్రతి మూడు వారాలకోసారి తమ బెడ్ షీట్లను శుభ్రం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. 

బెడ్ షీట్లను వారానికి ఒకసారి లేదా రెండు వారాలకు ఒకసారన్నా తప్పనిసరిగా క్లీన్ చేసుకోవాలని చెబుతున్నారు. ఈ విషయాలన్నీ పిజునా లినెన్స్ (పరుపు కంపెనీ) నిర్వహించిన అధ్యయనంలో తేలింది. 

ఒకవేళ బెడ్ షీట్ ను వారానికి ఒకసారి క్లీన్ చేసుకోలేనట్టైతే వాటికి దుమ్ము దూళీ, వైరస్ లు పట్టుకుంటాయి. అంతేకాదు ఇది ముందే వేసవి కాలం మన చెమట కూడా వాటికి పట్టుకుంటుంది. దీంతో బెడ్ షీట్లు దుర్వాసన వస్తాయి. వీటితో పాటుగా సూక్ష్మజీవులు కూడా బెడ్ షీట్లోకి ప్రవేశిస్తాయి. వీటివల్ల చర్మం అసౌకర్యంగా అనిపించడం, చర్మంపై దద్దుర్లు ఏర్పడుతాయి. ఈ అధ్యయనంలో పాల్గొన్న 18 శాతం మంది రాత్రిపూట స్నానం చేయడం వల్లే బెడ్ షీట్లను శుభ్రం చేసుకోవడం లేదని తేలింది. 

బెడ్ షీట్లను పరిశుభ్రంగా ఉంచుకోకపోతే ఎన్నో చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తేలింది.  అలర్జీలు, ఆస్తమా, చర్మంపై దద్దుర్లు వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే పరిశుభ్రంగా ఉండటం ఎంతో అవసరం. 

PREV
click me!

Recommended Stories

Parijatham plant: కుండీలోనే పారిజాతం మొక్కను ఇలా సులువుగా పెంచేయండి
కళ్లు జిగేల్‌మనేలా పచ్చల గాజులు