కలలో ఈ మూడు కనిపించాయా? మీకు మంచి రాబోతున్నట్లే...

Published : Dec 27, 2024, 07:29 PM IST
కలలో ఈ మూడు కనిపించాయా? మీకు మంచి రాబోతున్నట్లే...

సారాంశం

కలలు రావడం సర్వసాధారణమైన విషయం. మనలో ప్రతీ ఒక్కరికీ నిత్యం ఏదో ఒక కల వస్తూనే ఉంటుంది. అయితే మన ప్రమేయం లేకుండా వచ్చే కలలకు ఎన్నో అర్థాలు ఉన్నాయని మీకు తెలుసా.? మనకు కలలో వచ్చే కొన్ని అంశాలు మనకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయని పండితులు చెబుతున్నారు. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..   

కలలు.. ప్రతీ ఒక్కరికీ వస్తాయి. ఊహ తెలిసిన సమయం నుంచి ప్రతీ ఒక్కరికీ కలలు వస్తూనే ఉంటాయి. రాత్రుళ్లు మన ప్రమేయం లేకుండా వచ్చే కలలు మన వాస్తవిక జీవితాన్ని ప్రభావితం చేస్తాయని పండితులతో పాటు శాస్త్రం సైతం చెబుతోంది. స్వప్న శాస్త్రంలోనూ ఇందుకు సంబంధించిన వివరాలను స్పష్టంగా పేర్కొన్నారు. అయితే మనకు వచ్చే కలలో కొన్ని భయాన్ని కలిగిస్తే మరికొన్ని మంచి అనుభూతిని అందిస్తుంటాయి. ఇలాంటి ప్రతీ కలకు ఒక్కో అర్థ ఉంటుంది. అయితే మనకు వచ్చే చెడు కలలన్నీ చెడకు సంకేతం కావని పండితులు చెబుతున్నారు. 

అదృష్టాన్ని తెచ్చి పెట్టే కలలు.. 

మనకు వచ్చే కొన్ని కలలు మన ఆర్థిక పరిస్థితిని ప్రతిబింబిస్తాయని నిపుణులు అంటున్నారు. రాత్రి పడుకునే సమయంలో మనకు కినిపించే కొన్ని అంశాలు నిజ జీవితంలో మన వ్యక్తిగత అంశాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని అంటున్నారు. అయితే కొన్ని కలలు మనకు నచ్చినవి కాకపోయినా మనకు మంచి చేసేవే ఉంటాయని అంటున్నారు. స్వప్నశాస్త్రం ప్రకారంలో కలలో వచ్చే కొన్ని కలలు మనకు అదృష్టాన్ని తెచ్చి పెడుతాయని పండితులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

కొత్త నోట్లు కనిపిస్తే..

కలలో ఎవరికైనా కొత్త నోట్లు కనిపిస్తే అది చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. మీరు చాలా కాలంగా ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలకు త్వరలోనే ఒక పరిష్కారం లభించనుందని అర్థం చేసుకోవాఇల. ఇక కలలో నాణేలు కనిపించినా శుభప్రదంగా చెప్పొచ్చని అంటున్నారు. ముఖ్యంగా బంగారు నాణేలు కనిపిస్తే మరింత మంచిదని అంటున్నారు. ఇలా మీరు చేస్తున్న ఉద్యోగంలో లేదా వ్యాపారంలో వృద్ధి లభించనుందని పండితులు అంటున్నారు. ఇక కలలో ఇలాంటి అంశాలు కనిపిస్తే అప్పులు తీరబోతున్నాయని అర్థం చేసుకోవాలి. 

లక్ష్మీ దేవిని చూస్తే.. 

ఒకవేళ కలలో లక్ష్మీ దేవీ కనిపిస్తే అది కూడా మంచి కలగా భావించాలని వాస్తు, స్వప్న శాస్త్రంలో పేర్కొన్నారు. ఇలాంటి కల వస్తే మీ జీవితంలో గత కొన్ని రోజులుగా ఎదుర్కొంటున్న సమస్యలన్నీ తీరబోయే సమయం ఆసన్నమైందని అర్థం చేసుకోవాలి. కేవలం ఆర్థికపరమైన సమస్యలు మాత్రమే కాకుండా ఇతర మానసిక, కుటుంబ సంబంధిత సమస్యలు సైతం దూరంకాబోతున్నట్లు అర్థం చేసుకోవాలని చెబుతున్నారు. 

అన్నీ పోగొట్టుకున్నట్లు వస్తే. 

సాధారణంగా అన్నీ పోగొట్లుకున్నట్లు కనిపిస్తే నెగిటివ్‌గా భావిస్తుంటాం. నిజానికి ఇది మంచికి సంకేతంగా భావించాలని పండితులు అంటున్నారు. స్వప్న శాస్త్రంలో పేర్కొన్న వివరాల ప్రకారం కలలో సర్వసం కోల్పోయినట్లు కనిపిస్తే మీ ఆర్థిక పరిస్థితి త్వరలోనే మెరుగుపడనున్నట్లు అర్థం చేసుకోవాలని చెబుతున్నారు. త్వరలోనే మీ ఆర్థిక ఇబ్బందులన్నీ దూరమై ధనవంతులు కాబోతున్నారని అర్థం చేసుకోవాలి. 

గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు పండితులు, స్వప్నశాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Gold Locket: మెడలో చందమామలాంటి గోల్డ్ పెండెంట్ డిజైన్లు
నారింజ తొక్కలు ఎన్ని రకాలుగా ఉపయోగపడతాయో తెలుసా?