
దేశంలో క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ప్రకారం, ప్రతి ఐదుగురిలో ముగ్గురు క్యాన్సర్ కారణంగానే చనిపోతున్నారు. 2022 నుంచి చేసిన సర్వేలో క్యాన్సర్ మరణాల రేటు 64.7 శాతం నుంచి 109.6 శాతానికి పెరిగిందని తేలింది. 2050 నాటికి ఇది ప్రమాదకర స్థాయికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఐసీఎంఆర్ సర్వే ప్రకారం, పొగాకు వాడకం, కాలుష్యం వల్ల పురుషుల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్, నోటి క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్ల వల్ల కడుపు, పెద్దపేగు క్యాన్సర్ ముప్పు పెరుగుతోంది. పిల్లల్లో కూడా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. దీనికి కారణం అనారోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమ లేకపోవడమే అని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: ఇడ్లీలు తింటే క్యాన్సర్ వస్తుందా.? వెలుగులోకి సంచలన విషయాలు..
క్యాన్సర్ ప్రమాదం పెరగడానికి ప్రధాన కారణాలు:
పొగాకు, కాలుష్యం: ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్లకు ప్రధాన కారణం.
ఆహారం: ప్రాసెస్ చేసిన ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్స్‌లో ఉండే రసాయనాలు క్యాన్సర్ రిస్క్ పెంచుతాయి.
శారీరక శ్రమ లేకపోవడం: రెగ్యులర్‌గా వ్యాయామం చేయకపోవడం వల్ల క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది.
జంతువులకు హార్మోన్ ఇంజెక్షన్లు: మాంసం రుచి పెంచడానికి జంతువులకు హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తారు. ఇది మనుషుల శరీరంలో హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది.
క్యాన్సర్ రిస్క్ తగ్గించడానికి ఏం చేయాలి:
ఆరోగ్యకరమైన ఆహారం: సమతుల్య ఆహారం తీసుకోండి, ప్రాసెస్ చేసిన ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్స్‌ను తగ్గించండి.
రెగ్యులర్ వ్యాయామం: రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయండి.
పొగాకు, కాలుష్యాన్ని దూరం పెట్టండి: ధూమపానం మానేయండి, కాలుష్యం లేని ప్రదేశంలో ఉండటానికి ప్రయత్నించండి.
రెగ్యులర్ స్క్రీనింగ్: 30 ఏళ్ల తర్వాత రెగ్యులర్‌గా స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోండి.
ఎలాంటి స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవాలి:
మహిళల కోసం:
ప్రతి నెల రొమ్ము పరీక్ష.
ప్రతి సంవత్సరం మామోగ్రామ్ టెస్ట్.
పాప్ టెస్ట్.
పురుషుల కోసం:
పీఎస్ఏ టెస్ట్ (ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ టెస్ట్).
పిల్లల కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
పిల్లలకు సమతుల్య ఆహారం తినిపించండి, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉంచండి.
పిల్లలను రెగ్యులర్‌గా శారీరక శ్రమ చేసేలా ప్రోత్సహించండి.
క్యాన్సర్ రిస్క్ తగ్గించడానికి జీవనశైలి మార్పులు, రెగ్యులర్ స్క్రీనింగ్ చాలా ముఖ్యం అని పరిశోధకులు అంటున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం, రెగ్యులర్ వ్యాయామం, పొగాకు, కాలుష్యాన్ని దూరం పెట్టడం ద్వారా క్యాన్సర్ రిస్క్‌ను తగ్గించవచ్చు.