బరువు తగ్గడానికి బ్లాక్ కాఫీ.. ఎలా తాగాలంటే?

By Shivaleela Rajamoni  |  First Published Jul 6, 2024, 3:28 PM IST

ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. బరువు తగ్గేందుకు రకరకాల చిట్కాలను కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే మీరు బ్లాక్ కాఫీని తాగుతూ కూడా ఈజీగా బరువు తగ్గొచ్చు. ఎలాగంటే?
 



ఈ రోజుల్లో బరువు పెరగడమనేది సర్వ సాధారణంగా మారిపోయింది. అధిక బరువు వ్యాధి ఏం కాదు. కానీ ఇది ఎన్నో వ్యాధులకు దారితీస్తుంది. అందుకే బరువు తగ్గేందుకు ఒక్కోక్కరు ఒక్కో పద్దతిని ఫాలో అవుతుంటారు. బరువు తగ్గడానికి కొంతమంది వ్యాయామం చేస్తుంటే, మరికొందరు డైటింగ్ చేస్తుంటారు. అయితే మీరు  బ్లాక్ కాఫీని  సరిగ్గా ఉపయోగించడం వల్ల కూడా మీ బరువును తగ్గించుకోవచ్చు తెలుసా? అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

పోషక విలువలు:  పాలు, పంచదార కలిపిన మిల్క్ టీ, మిల్క్ కాఫీ కంటే, బ్లాక్ కాఫీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ బ్లాక్ కాఫీలో ప్రోటీన్లు, విటమిన్-ఇ, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఫాస్పరస్, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవన్నీ మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. 

Latest Videos

శక్తిని పెంచుతుంది: బ్లాక్ కాఫీని తాగుతూ మనం ఎనర్జిటిక్ గా కూడా ఉండొచ్చు. బ్లాక్ తకాఫీలో కెఫిన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మనకు తక్షణ శక్తిని అందిస్తుంది. దీంతో మనం అప్పటికప్పుడు ఎనర్జిటిక్ గా అవుతాం. ఈ శక్తి కారణంగా మనకు ఆకలి తగ్గుతుంది. దీని వల్ల మీరు పదేపదే తినకుండా ఉంటారు. అలాగే మీ బరువు కూడా అదుపులో ఉంటుంది. 

బ్లాక్ కాఫీ ఎలా తయారు చేయాలి: బరువు తగ్గడానికి బ్లాక్ కాఫీని ఎలా తయారుచేయాలంటే.. ముందుగా 1 కప్పు కాచిన నీటిని తీసుకొని కాఫీ పౌడర్ ను కలపండి. అంతే బ్లాక్ కాఫీ రెడీ.

ఇలా కూడా బ్లాక్ కాఫీని తయారు చేసుకోవచ్చు:  ముందుగా 1 కప్పు నీటిని మరిగించి అందులో కాఫీ పొడిని వేసి కలపండి. ఆ తర్వాత కోకో పౌడర్, దాల్చిన చెక్క వేసి కలపండి. ఇది మరిగిన తర్వాత వడగట్టి తాగండి. అంతే.. మీరు బరువు తగ్గాలనుకుంటే మాత్రం బ్లాక్ కాఫీలో చక్కెర కానీ, పాలను కానీ అస్సలు కలపకూడదు. 

ఎప్పుడు తాగాలి: బరువు తగ్గాలనుకునే వారు బ్లాక్ కాఫీని ఖాళీ కడుపుతో అస్సలు తాగకూడదు. ఎందుకంటే ఇది తీవ్రమైన జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. బ్లాక్ కాఫీని బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత లేదా దానితో పాటు తాగొచ్చు. మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే? కేవలం బ్లాక్ కాఫీ తాగితేనే బరువు తగ్గరు. బరువు తగ్గాలంటే ప్రతిరోజూ వ్యాయామం చేయడంతో పాటుగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉండాలి. 

click me!