మీ ఇంట్లో నుంచి చెడు వాసన వస్తోందా? ఏం చేస్తే ఈ వాసన పోతుందో తెలుసా?

By Shivaleela Rajamoni  |  First Published Jul 6, 2024, 11:46 AM IST

వర్షాకాలంలో ఇంట్లో నుంచి ఒక రకమైన దుర్వాసన వస్తుంటుంది. దీనివల్ల ఇంట్లో ఒక్కక్షణం కూడా ఉండాలనిపించదు. ముఖ్యంగా వేరేవాళ్లకు. అందుకే ఈ వాసన పోవడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.


ఒక్కో ఇంట్లో ఒక్కోలాంటి వాసన వస్తుంది. ఇది అందరూ గమనిస్తారు. కానీ కొంతమంది ఇంట్లో దుర్వాసన వస్తుంటుంది. దీనివల్ల ఇంట్లో అస్సలు ఉండాలనిపించదు. నిజానికి ఇంట్లో దుర్వాసన రావడానికి కొన్ని వస్తువులే కారణం. కానీ దీనివల్ల ఇంట్లో ఉండటానికి అసౌకర్యంగా ఉంటుంది. అంతేకాదు ఇది దీర్ఘకాలికంగా శ్వాసకోశ అనారోగ్యానికి కూడా దారితీస్తుందని ఆరోగ్య నిపుణులుచెబుతున్నారు. ముఖ్యంగా 24 గంటలు దుర్వాసన వచ్చే ఇంట్లో ఎవ్వరూ ఉండాలనుకోరు. అందుకే ఇంట్లో నుంచి ఈ వాసన ఎందుకు వస్తుంది? ఇది పోవడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

ఇంట్లో చెడు వాసన రావడానికి కారణాలేంటి? 

Latest Videos

ఫ్రిజ్ లో బూజు, అచ్చు పట్టిన ఆహారం ఉండటం, ఇంట్లో తడి బట్టలు ఉండటం, పనిచేయని డ్రైనేజీ వ్యవస్థలు లేదా అధ్వాన్నంగా ఉండటం, కుక్క పూప్ ను గమనించక అలాగే వదిలేయడం వంటి వివిధ కారణాల వల్ల ఇంట్లో నుంచి చెడు వాసన వస్తుంది. 

ఇంట్లో చెడు వాసన పోవాలంటే ఏం చేయాలి? 

మీ ఇంట్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోతే దాన్ని రిపేర్ చేయించాలి. అలాగే తడిసిన బట్టలను బాగా ఆరబెట్టాటి. మీ కుక్కకు అవుట్ డోర్ పూప్ ట్రైనింగ్ ఇవ్వాలి. అయినా ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుంటే మాత్రం ఈ చిట్కాలను ఫాలో అవ్వండి. 

రెగ్యులర్ గా వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. గదిలోని ప్రతి మూలలో సరైన వెంటిలేషన్ ఉంటేమీ గది లోని గాలి బయటకు సమర్థవంతంగా పోతుంది. ఇందుకోసం వెంటిలేషన్ ఫ్యాన్ ఆన్ చేయండి. లేదా మీరు ఇంట్లో ఉన్నప్పుడు కిటికీలను తెరిచే ఉంచండి. దీనివల్ల కొద్దిసేపటికి మీ రూం మొత్తం ఫ్రెష్ గాలితో నిండిపోతుంది. దీంతో దుర్వాసన తగ్గుతుంది. 

ఎయిర్ ప్యూరిఫైయర్ 

ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా మీ ఇంటికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇద గాలి నుంచి తేమ, అలెర్జీ కారకాలు, అచ్చు వాసనను తొలగించడానికి బాగా సహాయపడుతుంది. ఇది ఖర్చుతో కూడుకున్నదే అయినా.. ఇది మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. తేమ, తేమ వాసనతో ఎక్కువగా ప్రభావితమయ్యే గదుల్లో దీనిని ప్రత్యేకంగా ఉపయోగించండి.

ఎయిర్ ఫ్రెష్నర్ 

టాయిలెట్లలో ఎయిర్ ఫ్రెషనర్లను ఉపయోగించిన కూడా మీరు  చెడు వాసనను తొలగించొచ్చు. ఇవి చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. దీన్ని ఒక గంట పాటు అలాగే ఉంచితే దీని మ్యాజిక్ మీకు తెలిసిపోతుంది. 

బేకింగ్ సోడా

బేకింగ్ సోడా మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. దీన్ని కడగడానికి, శుభ్రం చేయడానికి లేదా ఇంట్లో నుంచి చెడు వాసనను పోగొట్టడానికి ఇది అద్భుతమైన డియోడరైజర్ గా పనిచేస్తుంది. మీ ఇంట్లో దుర్వాసనకు కారణం చెత్త బుట్టే అయితే 50 గ్రాముల బేకింగ్ సోడాను తీసుకుని దానిపై చల్లండి. కొన్ని నిమిషాల  తర్వాత వేడి నీళ్లతో కడిగేసుకుంటే వాసన అస్సలు రాదు. 
 

click me!