ఫ్రిజ్ లో పెట్టేస్తే పాలు ఎన్ని రోజులైనా పాడవకుండా నిల్వ ఉంటాయి. మరి ఫ్రిజ్ లేనివారు పాలను ఎలా నిల్వ చేస్తే ఎక్కువ సేపు నిల్వ ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఫ్రిజ్ వల్ల ఎన్నో ఆహార పదార్థాలు చాలా రోజుల వరకు ఫ్రెష్ గా, పాడవకుండా నిల్వ ఉంటాయి. అందుకే చాలా మంది ఆహారాలను, పానీయాలను ఫ్రిజ్ లో పెట్టేస్తుంటారు. కానీ అదే ఫ్రిజ్ పనిచేయకపోయినా, ఇంట్లో ఫ్రిజ్ లేకపోయినా.. ఆహారాలన్నీ ఒకటి రెండు రోజుల్లో బయటపారేయాల్సి వస్తుంది. ముఖ్యంగా పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండనే ఉండవు. ఫ్రిజ్ లో అయితే ఇవి చాలా రోజుల వరకు పాడకుండా ఉంటాయి. మరి ఫ్రిజ్ లో కాకుండా.. బయట పాలను ఎలా నిల్వ చేస్తే పాడవకుండా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
తక్కువ మంట: చాలా మంది పాలను పెద్ద మంట మీద మరిగిస్తుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. పాలను ఎప్పుడైనా సరే తక్కువ మంట మీద వేడి చేసి మరిగించాలి. పాలు మరిగిన తర్వాత తక్కువ మంట మీద మూడు నాలుగు నిమిషాలు ఉడికించాలి. దీంతో పాలలో ఉండే చెడు బ్యాక్టీరియాలు చనిపోతాయి.
undefined
చల్లని ప్రదేశంలో: పాలను ఎప్పుడూ కూడా వంటరూం లో పెట్టకూడదు. ఎందుకంటే వంట చేయడం వల్ల కిచెన్ వేడిగా ఉంటుంది. పాలు నిల్వ ఉండాలంటే మాత్రం వాటిని ఇంట్లో ఒక చల్లని మూలలో ఉంచాలి. ఈ పాలపై ప్రత్యక్ష వెలుతురు, సూర్యరశ్మి పడకూడదు. ఇలా చేయడం వల్ల పాలు ఎక్కువ సేపు నిల్వ ఉంటాయి.
పాలను వీలైతే మట్టి లేదా గాజు పాత్రలలో నిల్వ చేయండి. ఎందుకంటే ఈ పాత్రలు పాలను చల్లగా ఉంచడానికి సహాయపడతాయి. వీటిని ఏసీ లేదా కూలర్ లో దగ్గర ఉంచండి. ఇంట్లో చల్లని గాలి వల్ల గది చల్లగా మారితే దానిలో పాలను పెట్టి పై నుంచి ప్లేట్ పెట్టి దానిలో ఐస్ వేయండి. ఇలా చేయడం వల్ల పాలు చెడిపోకుండా చల్లగా ఉంటాయి.
అలాగే మీరు పాలను ఎక్కువ సేపు నిల్వ చేయడానికి పాల పాత్రను నీళ్లలో ఉంచండి. ఇది పాలను చల్లగా ఉంచుతుంది. లేదంటే మీరు పాల పాత్రను నీళ్లతో నానబెట్టిన వస్త్రంతో చుట్టండి. ఇది కూడా ఎక్కువ కాలం పాలు చెడిపోకుండా చూస్తుంది.