పొడవైన జుట్టుకోసం..ఇంట్లో బాదం నూనెను ఎలా తయారుచేయాలో తెలుసా?

బాదం నూనె మన జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. బాదం నూనె హెయిర్ ఫాల్ ను తగ్గించడమే కాకుండా.. జుట్టును నల్లగా చేస్తుంది. కాబట్టి ఇంట్లోనే ఈ నూనెను ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.


బాదం పప్పులు మన ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా.. దీని నూనె మన జుట్టుకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అవును బాదం నూనెను జుట్టుకు పెడితే జుట్టుకు సంబంధించిన ఎన్నో సమస్యలు నయమవుతాయి. జుట్టు రాలడం, వెంట్రుకలు తెగిపోవడం, నెత్తి పల్చబడటం, డ్రై హెయిర్, నిర్జీవమైన జుట్టు వంటి అన్ని సమస్యలు బాదం నూనెతో తగ్గిపోతాయి. అయితే మార్కెట్ లో ఈ బాదం నూనె ధర ఎక్కువగా ఉంటుంది. అదే మీరే ఇంట్లో తయారుచేస్తే తక్కువ ఖర్చుతోనే నూనెను తయారుచేస్తారు. అందుకే బాదం నూనెను ఇంట్లో ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

కావాల్సిన పదార్థాలు

Latest Videos

బాదం నూనెను తయారు చేయడానికి  పచ్చి బాదం పలుకులు, బ్లెండర్, చీజ్‌క్లాత్, గాజు పాత్ర, పాన్ అవసరమవుతాయి. 

తయారుచేసే విధానం

పచ్చి బాదంపప్పులను రాత్రంతా నీళ్లలో నానబెట్టండి. ఇలా చేయడం వల్ల నూనె సులభంగా బయటకు వస్తుంది. రాత్రంతా బాగా నానిన బాదం పప్పులను ఉదయాన్నే బయటకు తీసి శుభ్రమైన టవల్ లో వేసి ఆరబెట్టండి. వీటిని బ్లెండర్‌లో వేసి చిక్కటి పేస్ట్ లా చేయండి. 

ఇప్పుడు బాదం పేస్ట్ ను బాణలీలో వేసి తక్కువ మంటపై 10-15 నిమిషాల పాటు వేడి చేయండి. దీంతో నూనె బయటకు వస్తూనే ఉంటుంది. దీన్ని స్ట్రైనర్ ను ఉపయోగించి నూనెను తీయండి. ఈ నూనెను క్లీన్ గా ఉండే గాలి చొరబడని గాజు కూజాలో పోయండి. ఈ నూనెను చల్లని, చీకటి ప్రదేశంలో నిల్వ చేస్తే ఎక్కువ రోజులు వస్తుంది. 
 

click me!