తలలో దురద.. తగ్గాలంటే ఇలా చేయండి

By Shivaleela Rajamoni  |  First Published Jul 4, 2024, 3:38 PM IST

వానాకాలంలో తలలో దురద సమస్య చాలా మందికి ఉంటుంది. దీనివల్ల తల మొత్తం నొప్పి పెడుతుంది. మరి ఈ సమస్య తగ్గాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 


వర్షాకాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. దగ్గు, జలుబు, జ్వరంతో పాటుగా చర్మం, జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా ఎక్కువగా వస్తుంటాయి. ముఖ్యంగా ఈ సీజన్ లో జుట్టు రాలడం, చుండ్రుతో పాటుగా నెత్తిమీద విపరీతమైన దురద పెడుతుంటుంది. వాతావరణంలో తేమ పెరగడం వల్ల తలలో దురద మొదలవుతుంది. అలాగే వర్షపు చినుకులు నెత్తిమీద పడటం వల్ల కూడా దురద పెడుతుంది. మరి దీన్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

నిమ్మరసం: నిమ్మరసంలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. దీన్ని ఉపయోగించి మీరు తలలో దురదను తగ్గించుకోవచ్చు. ఇందుకోసం నిమ్మరసాన్ని దూది సహాయంతో తలకు అప్లై చేయండి. 15-20 నిమిషాల తర్వాత నీళ్లతో జుట్టును కడగండి. అయితే నిమ్మరసాన్ని తరచుగా జుట్టుకు అప్లై చేయకండి. ఎందుకంటే ఇది మీ వెంట్రుకలను పొడిబారేలా చేస్తుంది. 

Latest Videos

undefined

పెరుగు:  పెరుగు కేవలం మన ఆరోగ్యానికే కాదు మన జుట్టుకు కూడా మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. పెరుగు తలలో దురదను కూడా తగ్గిస్తుంది. పెరుగును మీరు డైరెక్ట్ గా అప్లై చేయొచ్చు. పుల్లని పెరుగు వెంట్రుకలను, నెత్తిని ఆరోగ్యంగా ఉంచడానికి బాగా సహాయపడుతుంది.

పెరుగు, నిమ్మరసం: మీరు తలలో దురదను తగ్గించుకోవడానికి పెరుగులో నిమ్మరసాన్ని మాత్రమే మిక్స్ చేసి తలకు అప్లై చేయొచ్చు. ఈ కాంబినేషన్ తలలో దురదను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అలాగే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. 

ఆపిల్ సైడర్ వెనిగర్: తలలో దురదను తగ్గించుకోవడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అరకప్పు ఆపిల్ సైడర్ వెనిగర్ లో ఒక కప్పు నీళ్లు కలిపి తలకు అప్లై చేయండి. ఇది దురదను చాలా వరకు తగ్గిస్తుంది. 

మాస్క్ : తలలో దురద సమస్య నుంచి ఉపశమనం పొందడానికి పెరుగుతో చేసిన హెయిర్ మాస్క్ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం పెరుగులో నిమ్మరసం, తేనె మిక్స్ చేసి పేస్ట్ లా చేయండి. దీన్నినెత్తికి, మొత్తం వెంట్రుకలకు అప్లై చేయండి. 

మెంతి హెయిర్ మాస్క్:  తేమ వల్ల నెత్తిమీద విపరీతమైన దురద కలుగుతుంది. అయితే ఈ దురదను తగ్గించుకోవడానికి మీరు మెంతి హెయిర్  మాస్క్ ను వేసుకోవచ్చు. ఇందుకొసం మెంతులను రాత్రంతా నీళ్లలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం మందార ఆకులతో పాటుగా మెంతులను కలిపి గ్రైండ్ చేయండి.  ఈ పేస్ట్ ను జుట్టుకు అప్లై చేస్తే దురద తగ్గుతుంది. జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. 


 

click me!