టాల్కమ్ పౌడర్ తో ప్రాణాలు తీసే వ్యాధి .. వాడే ముందు ఇది తప్పక తెలుసుకోండి

By Shivaleela Rajamoni  |  First Published Jul 6, 2024, 9:45 AM IST

ఎండాకాలం వచ్చిందంటే చాలు.. పిల్లలకు స్నానం చేయించి ఎక్కడా గ్యాప్ లేకుండా టాల్కమ్ పౌడర్ ను వేస్తారు. ఇది పిల్లలకు చెమట పట్టకుండా చేస్తుంది. అలాగే శరీరాన్ని ఫ్రెష్ గా ఉంచుతుంది. ఇది అందరికీ తెలుసు. అందుకే దీన్ని ఎక్కువగా వాడుతుంటారు. కానీ ఇది ప్రాణాలకు అస్సలు మంచిది కాదు. దీన్ని వాడటం వల్ల క్యాన్సర్ వచ్చే రిస్క్ పెరుగుతుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి తెలుసా? 
 


టాల్కమ్ పౌడర్ తెలియని వారు ఉండరు. ముఖ్యంగా ఈ టాల్కమ్ పౌడర్ ను ఆడవాళ్లు బాగా ఉపయోగిస్తారు. వీళ్లతో పాటుగా చిన్న పిల్లలకు కూడా తల్లులు ఈ పౌడర్ ను ఎక్కువగా పూస్తారు. ఎందుకంటే ఈ పౌడర్ చిన్న పిల్లలకు చెమట కాయలు కాకుండా చేయడానికి, చెమట ఎక్కువ పట్టకుండా చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ పౌడర్ పిల్లల్ని చాలా సేపటి వరకు ఫ్రెష్ గా ఉంచుతుంది. అందుకే చాలా మంది ఆడవారు ఈ పౌడర్ ను విపరీతంగా వాడేస్తారు. కానీ ఎవ్వరికీ తెలియని విషయమేంటంటే? ఈ పౌడర్ లో క్యాన్సర్ ను కలిగించే కారకాలు ఉన్నాయి. 

పలు అధ్యయనాల ప్రకారం.. ఇలాంటి బ్యూటీ ప్రొడక్ట్స్ ను వాడితే అండాశయ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందని క్యాన్సర్ ప్రివెన్షన్ కమిటీ అభిప్రాయపడింది. మీకు తెలుసా? ప్రతి ఐదు మంది మహిళల్లో ఒకరు  ఈ టాల్కమ్ పౌడర్ ను ఉపయోగిస్తున్నారట. కానీ ఈ పౌడర్ స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థ ద్వారా గర్భాశయానికి చేరుతుంది. ఇది  గర్భాశయ క్యాన్సర్  రిస్క్ ను పెంచుతుంది. ఈ రిస్క్ ఇతరుల కంటే జననేంద్రియాలకు ఈ పౌడర్ ను వాడే మహిళలకే ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Latest Videos

టాల్కమ్ పౌడర్, క్యాన్సర్ కు సంబంధించి ఎన్నో పరిశోధనలు జరిగాయి. ఇవి అండాశయ క్యాన్సర్ కు సంబంధించినవి కూడా పరిగణించారు. జననేంద్రియాలకు ఈ టాల్కమ్ పౌడర్ ను వాడే మహిళలకు అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం  ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. స్నానం చేసిన తర్వాత జననేంద్రియాలకు టాల్కమ్ పౌడర్ అప్లై చేయడం వల్ల దీనిలో ఉండే హైడ్రాలిక్, మెగ్నీషియం, కార్సినోజెనిక్ అంశాలు చర్మ కణాలకు చేరుతాయి. ఇవి ఇవి క్యాన్సర్ కణితుల పెరుగుదలకు దోహదపడతాయని అధ్యయనం కనుగొంది. ఈ పరిశోధన క్యాన్సర్ ప్రివెన్షన్ రీసెర్చ్ జర్నల్ లో ప్రచురితమైంది.

జర్నల్ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీలో ప్రచురించబడిన పరిశోధన ప్రకారం.. జననేంద్రియాలలో టాల్కమ్ పౌడర్ ను అప్లై చేయడం అండాశయ క్యాన్సర్ తో ముడిపడి ఉందని కనుగొన్నారు. ఇది అండాశయాలు ఉత్పత్తి చేసే స్త్రీ అవయవాలలో ప్రారంభమవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పౌడర్ ను ఎక్కువగా లేదా ఎక్కువసేపు ఉపయోగించేవారికే ఈ  ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మీకు తెలుసా? ఈ అండాశయ క్యాన్సర్ ఎక్కువగా కటి, కడుపు వరకు వ్యాపించే వరకు గుర్తించబడదు. కాగా ఈ దశలో అండాశయ క్యాన్సర్ కు చికిత్స చేయడం చాలా కష్టం. అందులోనూ ఇది ప్రాణాంతకంగా మారుతుంది. 
 

click me!