gun license భారత్‌లో గన్ లైసెన్స్: అంత వీజీ కాదు గురూ!

గన్ లైసెన్స్: భారతదేశంలో గన్ లైసెన్స్ కోసం ఎలా అప్లై చేయాలి? ఇక్కడ గన్ లైసెన్స్ పొందడం అంత సులువు కాదు. కొన్ని రూల్స్ పాటించాల్సి ఉంటుంది.

How to get a gun license in india application process and rules in telugu

భారతదేశంలో గన్ లైసెన్స్: ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో ఆయుధ చట్టాలు కాస్త కఠినంగా ఉంటాయి. ఎవరికి పడితే వాళ్ళకి ఆయుధాలు ఉండటానికి పర్మిషన్ లేదు. కొన్ని షరతులకు ఒప్పుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ గన్​కు పర్మిషన్ ఇస్తుంది. మరి గన్ లైసెన్స్ కోసం ఎలా అప్లై చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. గన్ లైసెన్స్ తీసుకోవడం అంత ఈజీ కాదు. కొన్ని రూల్స్​కు కచ్చితంగా కట్టుబడి ఉండాలి. కేవలం సెల్ఫ్ డిఫెన్స్, స్పోర్ట్స్, పంటలను కాపాడుకోవడం వంటి ముఖ్యమైన కారణాల వల్ల మాత్రమే గన్ లైసెన్స్ ఇస్తారు. గన్ లైసెన్స్ పొందాలంటే కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ సబ్​మిట్ చేయాలి. ఆ తర్వాత ఎంక్వైరీ చేస్తారు. అవేంటో చూద్దాం రండి.

1.అప్లికేషన్ కోసం కావాల్సిన డాక్యుమెంట్స్**

Latest Videos

గన్ లైసెన్స్ తీసుకోవాలనుకునే వాళ్ళు కింద ఇచ్చిన డాక్యుమెంట్స్ సంబంధిత అధికారులకు సబ్​మిట్ చేయాలి. * ఐడెంటిటీ ప్రూఫ్ * ఇన్​కమ్ ట్యాక్స్ సర్టిఫికెట్ * అడ్రస్ ప్రూఫ్ * ఉద్యోగ వివరాలు * బ్యాంక్ అకౌంట్ స్టేట్​మెంట్ * ఆడిట్ రిపోర్ట్ * ఆస్తుల లిస్ట్ * మెంటల్ హెల్త్ సర్టిఫికెట్ * బెదిరింపులకు సంబంధించిన పోలీస్ ఎఫ్​ఐఆర్ కాపీ **

2. ఎంక్వైరీ ఎలా చేస్తారు?**

అప్లికేషన్ రిసీవ్ చేసుకున్న తర్వాత డిస్ట్రిక్ట్ ఆఫీస్ ఎంక్వైరీ చేస్తుంది. అప్లై చేసుకున్న వ్యక్తి గన్ ఎందుకు కొనాలనుకుంటున్నాడు? ఎలాంటి సమస్యలు ఉన్నాయి? అనే విషయాల గురించి డీటెయిల్డ్​గా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తారు. అంతేకాకుండా అతని మీద క్రిమినల్ లేదా సివిల్ కేసులు ఏమైనా ఉన్నాయా? ఉంటే గన్ లైసెన్స్ రిజెక్ట్ చేస్తారు.

**3. లైసెన్స్ ఎలా అప్డేట్ చేసుకోవాలి?**

గన్ లైసెన్స్ తీసుకున్న తర్వాత మూడు సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకోవాలి. లైసెన్స్ ఎక్స్​టెండ్ చేయడానికి పోలీస్ స్టేషన్ నుంచి గుడ్ కండక్ట్ సర్టిఫికెట్ తీసుకోవాలి. లైసెన్స్ వచ్చిన మూడు నెలల్లోపు గన్ కొనాలి. **4. ఎన్ని గన్స్, బుల్లెట్స్ వాడుకోవచ్చు?**

గన్ లైసెన్స్ ఉన్న వ్యక్తి మూడు గన్స్ వరకు కలిగి ఉండవచ్చు. బుల్లెట్స్ కొనడానికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. సంవత్సరానికి 100 బుల్లెట్స్ వరకు కొనడానికి పర్మిషన్ ఇస్తారు. గన్ లైసెన్స్ ఉన్న వ్యక్తి ఆయుధాన్ని, బుల్లెట్లను ఎప్పుడు వాడుతున్నాడు అనే దానిపై పూర్తి బాధ్యత తీసుకోవాలి.

**5. గన్ ఎలా సబ్​మిట్ చేయాలి?**

పర్మిట్ ఉన్న వ్యక్తి ఒక స్టేట్​లో మాత్రమే గన్ కలిగి ఉండగలడు. వేరే రాష్ట్రానికి వెళ్లేటప్పుడు పోలీసుల పర్మిషన్ తప్పనిసరి. ఒకవేళ ఫారెన్ వెళ్లాల్సి వస్తే గన్ సబ్​మిట్ చేయడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఎవరైతే శాశ్వతంగా గన్ సరెండర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు లైసెన్స్​ను పోలీస్ స్టేషన్​లో సబ్​మిట్ చేయాలి. ఆ తర్వాత సంబంధిత సర్టిఫికెట్ తీసుకోవాలి.

vuukle one pixel image
click me!