Heart Diseases Risk : హార్ట్ ప్రాబ్లమ్స్ ఇందుకే వస్తున్నాయట.. షాకింగ్ విషయాలను వెళ్లడించిన నిపుణులు

Published : Jan 15, 2022, 03:49 PM IST
Heart Diseases Risk : హార్ట్ ప్రాబ్లమ్స్ ఇందుకే వస్తున్నాయట.. షాకింగ్ విషయాలను వెళ్లడించిన నిపుణులు

సారాంశం

Heart Diseases Risk : వయసుతో సంబంధం లేకుండా చాలా మంది నేడు గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. మనం చేసే చిన్న చిన్న తప్పులే పెను ముప్పును తెస్తున్నాయి. అందులో ప్రమాదకరమైన హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రావొచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఇవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..?  

Heart Diseases Risk : నేటి ఆధునిక ప్రపంచం మనిసి జీవన శైలిని పూర్తిగా మార్చేసింది. పొద్దున లేచిన మొదలు పడుకునే వరకు ఎన్నో పనులతో సతమతమవుతూనే ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఉరుకుల పరుగుల జీవితం అంటే వీళ్లదేనని అర్థమవుతుంది. అవును మరి కొంతమందికి ప్రశాంతంగా కూర్చొని తినే టైం కూడా ఉండదు. సమయంతో పనిలేకుండా వాళ్ల పనిలో మునిగిపోతుంటారు. కనీసం పక్కవారితో మాట్లాడే సమయం కూడా దొరకదంటే అతిశయోక్తి కాదేమో. అంతెందుకు ఫుడ్ కూడా సరిగ్గా తినడానికి టైం లేని వాళ్లు చాలా మందే ఉన్నారు. ఏదో తిన్నామా అంటే తిన్నాము అనేలా ప్రవర్తిస్తున్నారు. అందులో కంప్యూటర్ల ముందు కూర్చొని వర్క్ చేసే వాళ్ల సంగతి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదేమో. 

ఎందుకంటే తిన్న వెంటనే కూర్చీలో కూలబడటం వర్క్ ను చేయడం. పొద్దంతా ఒకే ప్లేస్ లో కూర్చోవడం వల్ల స్థూలకాయం రావడం పక్కాగా జరుగుతుంది. అందులోనూ శారీరక శ్రమ కూడా చేయని వారున్నారు. ఊబకాయులే ఎక్కువగా గుండెకు సంబంధించిన అనేక వ్యాధులకు గురయ్యే ప్రమాదముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా పిజ్జాలు, బర్గర్లు, ఫాస్ట్ ఫుడ్ తీసుకునే వారు కూడా దీని బారిన పడే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండాలంటే రోజూ కచ్చితంగా సైక్లింగ్ చేయడంతో పాటుగా తాజా పండ్లు, బ్రెడ్, పస్తా, రైస్, కూరగాయనలు తమ రోజు వారి ఆహారంలో ఉండాలని సూచిస్తున్నారు. 

Smoking చేసే అవాటుంటే వెంటనే మానుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఇతరులకంటే స్మోకింగ్ చేసే వారిలోనే గుండె సంబంధింత జబ్బులు, ప్రమాదకరమైన క్యాన్సర్ వ్యాధి, ఇతర అనారోగ్య సమస్యలు దాడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. అలాగే స్మోకింగ్ చేయడం వల్ల నికోటిన్  రక్తనాళాలను చంపేయడంతో పాటుగా రక్తనాళాలాలో రక్తం గడ్డకట్టేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే దీనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇకపోతే ప్రతిరోజూ Yoga చేయడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఇది బీపీని అదుపులో ఉంచడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే Cholesterol levels ను కూడా తగ్గించుకుంటూ ఉండాలి. ఇలా చేస్తేనే గుండె కు సంబంధించిన రోగాలు రావు. వీటితో పాటుగా  Stress, anxiety ని ఎంత తగ్గించుకుంటే అంత ఆరోగ్యంగా ఉంటాము. 

శారీరక శ్రమ లేని వ్యక్తుల్లో  Cholesterol శాతం విపరీతంగా పెరుగుతుంది. ఈ Cholesterol అధికమవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు తొందరగా అటాక్ చేసే అవకాశముంది. వీరితో పాటుగా అధిక బరువుతో బాధపడేవారు కూడా గుండె జబ్బుల బారిన పడే ఛాన్సెస్ ఎక్కువ. డయాబెటీస్ సమస్య ఉన్నవారు కూడా దీని బారిన పడే అవకాశం లేకపోలేదు. అందుకే వీరు సరైన డైట్ ను పాటించాలి. మనం తీసుకునే ఫుడ్ కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ కు దారి తీయోచ్చని నిపుణులు వెళ్లడిస్తున్నారు. ఎక్కువగా నూనెలు, షుగర్,  Non Veg, అధిక కొవ్వు పదార్థాలు కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ కు దారితీయొచ్చని ఆరోగ్య నిపుణులు వెళ్లడిస్తున్నారు. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Kids Health: పిల్లలకు జలుబు, దగ్గు ఉన్నప్పుడు అరటిపండు, పెరుగు పెట్టొచ్చా? పెడితే ఏమవుతుంది?
అయిదు గ్రాముల్లో అదిరిపోయే సూయి ధాగా చెవి రింగులు