లావుగా ఉండే అమ్మాయిల్లో.. ఆ సామర్థ్యం తక్కువట

First Published 20, Jul 2018, 1:20 PM IST
Highlights

నార్వేలోని బెర్గెన్ యూనివర్శిటీకి చెందిన పలువురు శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు జరిపారు. దాదాపు 4,322 మంది మహిళలపై ఈ సర్వే జరిపినట్లు వారు చెబుతున్నారు. వారంతా 20ఏళ్ల వయసు దాటినవారు కావడం గమనార్హం.
 

సన్నజాజి లాంటి అమ్మాయిని పెళ్లిచేసుకున్నా.. పిల్లలు పుట్టాక చాలా మంది అమ్మాయిలు లావుగా అవుతుంటారు. భార్యలు లావుగా ఉండటం చాలా మంది భర్తలకు ఇష్టం ఉండదు. ఈ విషయం పక్కన పెడితే.. కొంతమంది పిల్లలు పుట్టకముందే లావుగా మారుతుంటారు. ఆ లావు బ్యాడ్ కొలిస్ట్రాల్ వల్ల వస్తే మాత్రం చాలా నష్టం అంటున్నారు నిపుణులు.

పిల్లలు పుట్టకముందే బ్యాడ్ కొలిస్ట్రాల్ కారణంగా లావుగా మారే అమ్మాయిల్లో తల్లి అయ్యే సామర్థ్యం తగ్గిపోతుందట. మహా అయితే.. ఒకరికి జన్మ ఇవ్వగలరట. అంతే.. ఇక రెండో సారి ప్రెగ్నెన్సీ రావడం మాత్రం చాలా కష్టం అంటున్నారు నిపుణులు. ఇక కొందరికైతే అసలు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ కావడం చాలా కష్టం అంటున్నారు నిపుణులు.

నార్వేలోని బెర్గెన్ యూనివర్శిటీకి చెందిన పలువురు శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు జరిపారు. దాదాపు 4,322 మంది మహిళలపై ఈ సర్వే జరిపినట్లు వారు చెబుతున్నారు. వారంతా 20ఏళ్ల వయసు దాటినవారు కావడం గమనార్హం.

వారిలో 1677మందికి అసలు సంతానం కలగలేదట. కేవలం 488మంది ఒకసంతానం కలిగి ఉండగా..2,157మంది ఇద్దరు అంతకన్నా ఎక్కువ మంది సంతానం కలిగి ఉన్నారు.

ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే.. అసలు సంతానం లేనివారంతా వారి వయసు మించి బరువు కలిగి ఉన్నారని సర్వేలో తేలింది. కాబట్టి సంతానం కావాలనుకునే అమ్మాయిలు మందుగానే బరువును అదుపులో ఉంచుకోవడం మంచిందటున్నారు నిపుణులు.

Last Updated 20, Jul 2018, 1:20 PM IST