గర్భిణీలు స్మోక్ చేస్తున్నారా..? కలిగే నష్టాలు ఇవే..

By telugu teamFirst Published Sep 23, 2019, 1:55 PM IST
Highlights

అంతేకాకుండా తల్లి ఎక్కువగా స్మోక్ చేయడం వల్ల కడుపులో ఉన్న బిడ్డకు ఆక్సీజన్ లెవల్స్ సరిగా అందకుండా పోయే ప్రమాదం ఉంది. సిగరెట్ పొగలో విషం ఉంటుంది. దీనిలో నికోటిన్ వంటి చాలా హానికరమైన పదార్ధాలు ఉంటాయి

చాలా మంది స్త్రీలకు పొగతాగే అలవాటు ఉంటుంది. ఆ అలవాటుని గర్భం ధరించిన సమయంలోనూ కంటిన్యూ చేస్తే మాత్రం చాలా దుష్ప్రయోజనాలను ఎదురుకోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రభావం కేవలం తల్లి మీద మాత్రమే కాదు.. కడుపులో ఉన్న బిడ్డపై కూడా చూపిస్తుందని హెచ్చరిస్తున్నారు.

సాధారణంగా స్మోకింగ్ ఎవరిపైన అయినా దుష్ప్రభావాన్ని  చూపిస్తుంది.అయితే కడుపుతో ఉన్నవారి మీద అయితే ఆ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. కడుపులో ఉన్న సమయంలోనే చిన్నారులకు కిడ్నీల సమస్య తలెత్తే అవకాశం ఉంది. అంతేకాకుండా కడుపులో ఉన్న బిడ్డ హార్మోన్ లెవల్స్ మారే అవకాశం ఉంది. తద్వారా బిడ్డ ఎదుగుదలలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

అంతేకాకుండా తల్లి ఎక్కువగా స్మోక్ చేయడం వల్ల కడుపులో ఉన్న బిడ్డకు ఆక్సీజన్ లెవల్స్ సరిగా అందకుండా పోయే ప్రమాదం ఉంది. సిగరెట్ పొగలో విషం ఉంటుంది. దీనిలో నికోటిన్ వంటి చాలా హానికరమైన పదార్ధాలు ఉంటాయి. ఈ పదార్ధాలు వ్యవస్థలో ఉండి శరీరానికి చాలా హానిని చేస్తాయి. ధూమపానం కారణంగా పెదాలు నల్లబడటం,పసుపు రంగు పళ్ళు,చెడు శ్వాస,అజీర్ణం, వికారం, ఆకలి మందగించటం,అనారోగ్య రీతిలో బరువు తగ్గటం, విశ్రాంతి లేకపోవటం, శ్వాసకోశ వ్యాధి,సైనసిటిస్,నోరు,పెదవులు మరియు ఊపిరితిత్తులు,గొంతు క్యాన్సర్ వంటి దుష్ప్రభావాలు ఉంటాయి.

గర్భిణీలు స్మోకింగ్ ఎక్కువగా చేస్తే.. చిన్నారులు పుట్టగానే చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ఆస్తమా, ఎలర్జీలు, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ లాంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఈ అలవాటు నుంచి బయటపడాలంటే చేయాల్సిన పనులు..

1.మీరు పొగతాగడం మానేయడంతోపాటు... మీ చుట్టుపక్కల వారిని కూడా తాగడం మానేయమని చెప్పాలి. కనీసం... మీకు సమీపంలో పొగతాడం మానేయమని చెప్పండి.
2.చాలా మంది డ్రైవింగ్ చేసే సమయంలో, ఒత్తిడి ఎక్కువగా ఉన్న సమయంలో పొగతాగుతుంటారు. ఈ అలవాటు నుంచి బయటపడాలంటే.. ముందుగా పొగతాగాలి అని అనిపించే పరిస్థితులను అదిగమించాలి. ఒత్తిడిగా అనిపించినప్పుడు పొగతాగడం కంటే.. వేరే ఇంకేదైనా పని చేయడం మంచిది.

3.పుస్తకాలు చదవడం, నడక అలవాటు చేసుకోవడం, వ్యాయామం చేయడం లాంటివి అలవాటు చేసుకోవాలి. వాటి ద్వారా దీని నుంచి బయటపడే అవకాశం ఉంది.
4.జనాలు పొగ ఎక్కువ తాగే ప్రాంతాలకు వెళ్లకుండా ఉండటం మంచిది. ఉదాహరణకు క్లబ్స్, పబ్స్, రెస్టారెంట్స్ లాంటివి. ఎందుకంటే.. ఎవరైనా స్మోక్ చేయడం చూస్తే.. మనకు కూడా చేయాలని అనిపించే అవకాశం ఉంది. 

click me!