వీటి కోనుగోళ్లు పడిపోవడం వల్ల దేశంలో మరో కొత్త సమస్య తలెత్తే అవకాశం ఉందని వారు భయపడుతుండటం గమనార్హం. కండోమ్స్ వాడకుండా శృంగారంలో పాల్గొంటే సుఖవ్యాధులు మరింత ప్రభలే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. దీనిపై నటుడు అక్వినో విడుదల చేసిన ఓ వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియో... తాను తన సెక్స్ పార్టనర్ తో శృంగారంలో పాల్గొనలేకపోతున్నానని... ఎందుకంటే ప్రస్తుతం తన వద్ద ఒక్క కండోమ్ మాత్రమే మిగిలి ఉందని ఆవేదన వ్యక్తం చేయడం విశేషం. ఈ వీడియోని ప్రముఖులు చాలా మంది షేర్ చేస్తున్నారు.
అవాంఛిత గర్భం, సురక్షిత శృంగారానికి కండోమ్ వినియోగించాలని వైద్యుల దగ్గర నుంచి ప్రభుత్వాలు కూడా సూచిస్తున్నాయి. అయితే... ఇప్పుడు కండోమ్ వినియోగించేవారి సంఖ్య పూర్తిగా తగ్గిపోతోందట. దానికి ఆర్థిక మాంద్యమే కారణమని తేలింది. దక్షిణ అమెరికా యొక్క శృంగార రాజధాని అయిన అర్జెంటీనాలో వీటి వినియోగం మరింత పడిపోయింది.
అర్జెంటీనాలో ఆర్థికమాంద్యం తలెత్తెంది. డాలర్ తో పోలిస్తే అర్జెంటీనా కరెన్సీ పెసో విలువ పడిపోయింది. దీంతో... ఆ దేశంలో అన్ని వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో... నిత్యవసర వస్తువుల దగ్గర నుంచి కనీసం కండోమ్ కూడా కొనలేని పరిస్థితి ఏర్పడింది అక్కడి ప్రజలు వాపోతున్నారు. దీని కారణంగానే ఆ దేశంలో కండోమ్, గర్భనిరోదక మాత్రల కొనుగోళ్లు పూర్తిగా పడిపోయాయని అక్కడి అధికారులు చెబుతున్నారు.
వీటి కోనుగోళ్లు పడిపోవడం వల్ల దేశంలో మరో కొత్త సమస్య తలెత్తే అవకాశం ఉందని వారు భయపడుతుండటం గమనార్హం. కండోమ్స్ వాడకుండా శృంగారంలో పాల్గొంటే సుఖవ్యాధులు మరింత ప్రభలే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. దీనిపై నటుడు అక్వినో విడుదల చేసిన ఓ వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియో... తాను తన సెక్స్ పార్టనర్ తో శృంగారంలో పాల్గొనలేకపోతున్నానని... ఎందుకంటే ప్రస్తుతం తన వద్ద ఒక్క కండోమ్ మాత్రమే మిగిలి ఉందని ఆవేదన వ్యక్తం చేయడం విశేషం. ఈ వీడియోని ప్రముఖులు చాలా మంది షేర్ చేస్తున్నారు.
దక్షిణ అమెరికా యొక్క 2వ ఆర్థిక వ్యవస్థ ఈ సంవత్సరం 2.6 శాతం కుదింపు తప్పదని అంటున్నారు.. మరియు 50 శాతంపై వార్షిక ద్రవ్యోల్బణంతో ముడిపడి ఉంది. ఇక, పెసో కరెన్సీ 2018 ప్రారంభం నుండి డాలర్‌తో పోలిస్తే దాని విలువలో మూడింట రెండు వంతులు కోల్పోయింది, దిగుమతులు మరియు వినియోగాన్ని దెబ్బతీసింది.
2018తో పోలిస్తే ఈ సంవత్సరం ప్రారంభం నుండి కండోమ్ అమ్మకాలు 8 శాతం తగ్గాయని పరిశ్రమ వర్గాలు అంచనా. ఒక్క ఈ నెలలోనే దాదాపు పావు శాతం కొనుగోళ్లు తగ్గినట్లు నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు గర్భనిరోధక మాత్రల అమ్మకాలు కూడా తగ్గాయి.. ఈ సంవత్సరంలో 6 శాతం తగ్గిపోయినట్టు ఫార్మసిస్ట్‌లు చెబుతున్నారు. ధరల పెరుగుదల ప్రభావంతో రోజురోజుకూ ఈ మాత్రలు వినియోగించే వారి సంఖ్య తగ్గుతోందని.. ఇలా ప్రతీ నెల గర్భనిరోధక మందులు తీసుకోవడం మానేసిన మహిళల సంఖ్య దాదాపు 1,44,000గా ఉందని చెప్పారు.
అయితే, ఇక్కడే ఓ ప్రమాదం పొంచిఉంది.. అటు కండోమ్‌ల అమ్మకాలు, వినియోగం పడిపోతే.. లైంగిక సంబంధిత వ్యాధులు పెరిగిపోతాయని ప్రజారోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిటారుగా ఉన్న ద్రవ్యోల్బణం గత రెండు నెలల్లో తన ఫార్మసీలో కండోమ్‌లు మరియు గర్భనిరోధక మాత్రల అమ్మకాలు వరసగా 20శాతం తగ్గడానికి కారణమయ్యాయని ఫార్మ నిపుణులు చెబుతున్నారు.