భార్యాభర్తల మధ్య అనుంబంధానికి ఓ వైవాహికేతర సంబంధం చిచ్చు పెట్టింది. చివరికి ప్రేయసి ముఖ్యమా, భార్య ముఖ్యమా అని తేల్చుకోవాల్సి వచ్చినప్పుడు అతనేం చేశాడనేది ఇక్కడ చదవండి
“నువ్వు ఎప్పుడూ ఎవర్నీ ప్రేమించలేదా?” అని అడిగింది వసుంధర
“చాలా మందిని ప్రేమించాను. నన్నెవరైనా ప్రేమించారో లేదో తెలియదు" అన్నాడు సీతారాం.
“అంత తెలియకుండా వుంటుందా?” అని అడిగింది ఆసక్తిగా.
ఇద్దరూ హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డు మీద పచ్చని తీవాచీలా ఉన్న పచ్చికపై కూర్చుని వున్నారు. అమెది చామనఛాయ. కానీ అణువణువునా ఆకర్షణ తొణికిసలాడుతుంది. అతను మాట్లాడలేదు.
“అమ్మాయిలతో సాన్నిహిత్యమే లేదా?” అందామె. “నీకు అంత ఆసక్తి ఎందుకు చెప్పు?” అన్నాడతను.
“నిన్ను చూస్తే అమ్మాయిలను ఇట్టే పడేసేవాడిలా కనిపిస్తావ్. ఎంతమంది అమ్మాయిలను పడేశావో తెలుసుకుందామని...”
“టీనేజ్లో మాత్రం ఓ అమ్మాయిని దేవదాసు పార్వతిని ప్రేమించినట్లుగా ప్రేమించాను” అని జేబులోంచి సిగరెట్ పాకెట్ తీసి అందులోంచి కింగ్ సైజ్ గోల్డప్లాను పెదవుల మధ్య పెట్టి అగ్గిపెట్టె తీసి అంటించాడు. పొగ పీల్చి వదిలాడు.
“నువ్వు సిగరెట్ తాగుతుంటే చాలా స్టయిల్గా వుంటుంది” అంది వసుంధర ఒక గడ్డిపరకను పీకి దాంతో అతని చేయి మీద రాయడం మొదలు పెడుతూ.
“ఈ సిగరెట్ ఆమె జ్ఞాపకార్థమే తాగుతున్నాను. కానీ నేను దేవదాసు కాలేదు. ఆమె పార్వతి కాదని తేలిపోయింది” అన్నాడు. .
“మరే అమ్మాయితోనూ ఆ తర్వాత ప్రేమలో పడలేదా?”
“అది ప్రేమో కాదో తెలీదు. అసలు నాకు ప్రేమ అనేదాని మీద లేదు. కానీ, ఓ అమ్మాయిని చాలా ఇష్టపడ్డాను. అంతే ఇష్టం నా
పమ అనేదాని మీద నమ్మకం నిత ఇష్టం నాకు మా మేడమ్ మీద కూడా ఏర్పడింది. నేను నిత్యం కనిపెట్టుకుని ఉంటున్న ఈ అమ్మాయిని ఆ వయి మోజులో పడి విస్మరించడం ఇప్పుడు గుర్తొస్తే బాధనిపిస్తుంది” అని ఓ నిట్టూర్పు విడిచాడు.
“ఏ అమ్మాయితోనూ సెక్సువల్ రిలేషన్స్ లేవా?” అడిగింది.
“లేవంటే నమ్ముతావా? మా ఆవిడతో తప్ప నాకు మరో స్త్రీతో ఇప్పటి వరకు సెక్సువల్ రిలేషన్ లేదు. పెట్టుకోకూడదని కూడా ఏం లేదు. కానీ, నాకు అక్కర్లేదు. నన్ను ప్రేమించి నా నుంచి ఏమీ ఆశించని స్త్రీ కావాలి” అన్నాడు.
“నీతో దగ్గరగా ఉన్న అమ్మాయిలనెప్పుడూ ట్రై చేయలేదా?” అని అడిగింది వసుంధర.
“చేద్దామని అనిపించేది. కానీ నేను వారి నుంచి సెక్స్ ను ఆశిస్తున్నానని తెలిసిపోతే నాకు ఎప్పటికీ దూరమవుతారేమోనని భయం ఉండేది. వారిని ఆ రకంగా దూరం చేసుకోవడం కన్నా, ఫ్రెండ్స్గా ఎల్లకాలం ఉండటం మంచిదనిపించేది” అని వివరించాడు.
“అయితే, నీతో జాగ్రత్తగా ఉండాలి” అంది.
తన ప్రేమ వ్యవహారాల గురించి, అమ్మాయిలతో సంబంధాల గురించి ఒక అమ్మాయి అడుగుతుంటే ఉత్సాహంగా ఉంది. ఈ విషయాలను అతను ఎన్నోసార్లు ఫ్రెండ్స్తో మందు తాగినప్పుడు చెప్పాడు. ఆ అమ్మాయిలకు తనంటే ఎంత అభిమానమో కూడా చెప్పాడు. వారెంత అందంగా వుంటారో, తనతో ఎంత సన్నిహితంగా ఉండేవారో పూసగుచ్చినట్లు చెప్పాడు. అప్పుడు కలగసంత ఆనందం ఒక అమ్మాయితో ఆ విషయాలు చెప్తూండడం వల్ల కలిగింది.
“మీ ఆవిడంటే నీకు చాలా ఇష్టమనుకుంటా” అంది అర్ధోక్తిగా.
“నన్ను ఇష్టపడి చేసుకుంది. నా పెళ్లి మీద ధ్యాస లేనప్పుడు మా పెద్దల ఒత్తిడితో ఆ అమ్మాయిని చూశాను. ఒక అమ్మాయిని చూసింతర్వాత బాగా లేదని, చేసుకోనని చెప్పడం మంచిది కాదనిపించింది. నేనిప్పుడు పెళ్లి చేసుకోనని మాత్రం చెప్పాను. అయినా వినలేదు. ఆమె నన్నే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టి కూర్చుందట. దాంతో ఆమె అన్నయ్యలు నన్ను వదలలేదు. నేను ఇష్టపడిననన్ను కాదన్నప్పుడు నన్ను ఇష్టపడిన అమ్మాయిని చేసుకోవాలనిపించింది" అంటూ చెప్పాడు.
“ఆమె నిన్ను ప్రేమించిందా? నువ్వు ఆమె ప్రేమించావా?” అడిగింది
“అది ప్రేమో కాదో తెలియదు. ఆమెను మా వాళ్లెవరూ పట్టించుకోరు. వాళ్ల అన్నయ్యలూ పట్టించుకోరు. నా ఇద్దరు పిల్లలతో పాటు ఆమెనూ ఒక పిల్లలా నేను పెంచుకుంటూ వస్తున్నా' అని సమాధానమిచ్చాడు. .
“సరే వెళ్తామా?” అంటూ లేచి చీర దులుపుకుంది. అతనూ లేచాడు. రోడ్డు మీదికి వచ్చి బైక్ స్టార్టు చేశాడు. ఆమె వెనక కూర్చుంది. ఆమె ఎత్తయిన వక్షోజాలు వీపును రాసుకుంటుంటే గిలిగింతలు పెట్టినట్లు ఉంది. మనసు ముందుకూ, వెనక్కూ ఊగిసలాడుతోంది. అతనికి 35 ఏళ్లుంటాయి. మీసాలు అక్కడక్కడా నెరిశాయి. ఆమెకు 37 ఏళ్ల దాకా ఉంటాయి. కానీ 30 యేళ్ల ప్రౌఢలా వుంటుంది. పెళ్లి కాలేదు. జుట్టుకు నల్లరంగు వేస్తుంది. మగవాళ్లను అట్టే ఆకర్షించగల అవయవ సంపద ఆమెది..
“సీతారాంకు నువ్వంటే ఎంత ప్రేమో అన్నాడు రాజీవ్. నువ్వెట్లా కనిపెట్టావని అడిగా. ఆ కళ్లలో నీ పట్ల ఆప్యాయత కనిపిస్తుంది అన్నాడు” అంది కుడిచేయి నడుం మీద వేస్తూ.
అతను ఈ లోకంలో లేడు. ఒక అమ్మాయి అంత ఫ్రీగా తనతో వుండటం ఇదే మొదటిసారి. చాలామంది అమ్మాయిలు అతనికి తెలుసు. అందులో కనీసం ఇద్దరు ముగ్గురి మీదనైనా అతనికి ఆసక్తి ఉంది. కానీ, ఎందుకో గానీ మిగతా వాళ్లతో కన్నా వీళ్లతోనే అతను
దూరంగా ఉండేవాడు. అతను మాట్లాడలేదు.
“నన్ను ప్రేమిస్తున్నావా?” అని అడిగింది. -
“ప్రేమ మీద నాకు నమ్మకం లేదు, కానీ నువ్వంటే నాకు ఇష్టం” అన్నాడు.
“ఇష్టం ప్రేమ కాదా?” అడిగింది. “అది నేను చెప్పలేను”
ఆమె వుండే గది వచ్చేసింది. మరో ఫ్రెండ్ తో పాటు ఆమె ఆ గదిలో వుంటోంది. బైక్ ఆపి వెళ్తానని చెప్పాడు సీతారాం.
“లోపలికి రాకూడదూ?” అంది | బైక్ ఆపి ఆమెతో పాటు లోపలికెళ్లాడు. తాళం తీసింది. ఆమె వెనుకే లోనికెళ్లాడు. “నాకు చాలా ఇష్టమైన వాళ్లను మాత్రమే లోపలికి పిలుస్తా, రాజీవ్, శంకర్, నానీ మాత్రమే నా గదికి వస్తారు” అంది. అతని గుండె ఎగిరి గంతేసింది.
“రాజీవ్, శంకర్ తెలుసు. కానీ ఎవరు?” అడిగాడు.
“అతను నాకు అత్యంత ఆప్తుడు. నన్ను కంటికి రెప్పలా కాపాడు తుంటాడు” అంది.
అతను ఆమె గదికి వెళ్లడం నిత్యకృత్యంగా మారింది. తాను ఆమె నుంచి ఏమి ఆశిస్తున్నాడో అతనికే స్పష్టంగా తెలియదు. అతనికి ఇతర స్త్రీల మీద ఆసక్తి ఉన్నప్పటికీ తన భార్యను కాదని సెక్సువల్ రిలేషన్స్ పెట్టుకునే దాకా వెళ్లలేదు. కానీ నానీ ఎవరో తెలుసుకోవాలనే ఆసక్తి అతనితో పెరిగింది. ఈ అమ్మాయి అంతగా ఇష్టపడే నానీ ఎలా ఉంటాడో చూడాలని అనిపించేది. ఆమె ప్రేమకథలు కొన్ని విన్నాక తాను ఆశిస్తున్న వ్యక్తిత్వానికి తన ఊహాప్రపంచంలో ఒక రూపం కల్పించి ఆరాధిస్తుందేమోనని అనుకోసాగాడు. ఆమె ప్రేమించిన పురుషులెవరికీ తాను ఆశిస్తున్న వ్యక్తిత్వం లేదేమో అని కూడా అనుకోసాగాడు.
“భార్యాభర్తల మధ్య ప్రేమలుండవు. వ్యాపార సంబంధాలే ఉంటాయి కదా!” అంది ఒకసారి స్త్రీవాదంపై చర్చ సందర్భంగా.
“చాలా మటుకు కావచ్చు” అన్నాడు.
“భద్రత కోసమే భార్యలు భర్తలను అంటిపెట్టుకొని ఉంటారు గానీ ప్రేమతో కాదు” అంది.
“అది సంపూర్ణ వాస్తం కాదేమో!” అన్నాడతను. “నీదంతా అబద్దం” అంది. “మా ఇంటికి ఓసారి రాకూడదూ?” అడిగాడు. “మీ ఆవిడ ఏమీ అనుకోదా?” అంది. “అనుకోవడానికేముంది?” అని ఎదురుప్రశ్న వేశాడు.
ఓ రోజు తనతో ఇంటికి తీసుకెళ్లాడు. రాత్రి భోజనం చేసేవరకు వసుంధర, సీతారాం భార్య శశికళతో కబుర్లు చెప్తూనే వుంది. వాళ్లిద్దరూ మంచి పండుగని అనిపించింది. అతనికి. నిజానికి శశికళ ఎవరితోనైనా ఇట్లా కలిసిపోగలదు. ముగ్గురూ పేకాట ఆడారు. ఎప్పుడో అర్థరాత్రి వసుంధరకు 2... పాటు బయటి గదిలో పరుపు వేసి పడుకోమని చెప్పి బెడ్రూంలోకి సీతారా తీసుకొని వెళ్లింది శశికళ. తెల్లారి అతను లేచి చూసేసరికి బయటి వరండాలో తిరుగుతూ కనిపించింది వసుంధర. కళ్లు జ్యోతుల్లా వున్నాయి. “నిద్ర పట్టలేదా?”, అని అడిగాడు. ఆమె మాట్లాడలేదు. అంతటితో సంభాషణ ఆపేశాడు. వెళానని బయల్దేరింది వసుంధర. ముఖం కడుక్కుని టీ తాగమని శశికళ బతిమిలాడి వినలేదు. హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వెళ్లిపోయింది.
ఆమె వెళ్లిపోయాక - “ఏమిటీ, ఈ అమ్మాయి అలా వెళ్లిపోయింది?” అని అడిగింది సీతారాంను అతని భార్య.
“ఏమో!” అన్నాడతను.
ఈ సంఘటన జరిగింతర్వాత వసుంధరలో అశాంతి పెరిగినట్లు అపించింది సీతారామ్కు. ఆఫీసుకెళ్లడం లేదు. అతను పెద్దగా పట్టించుకోలేదు. ఓ రోజు సాయంత్రం ఫోన్ చేసి “ఈ రోజు తప్పకుండా నా గదికి రా!” అని చెప్పింది వసుంధర. సీతారాం వెళ్లి చాలాసేపు కూర్చున్నాడు. ఇంతకు ముందు గలగల మాట్లాడే వసుంధర ఆ రోజు చాలా సమయం మౌనానికే కేటాయించింది.ఇక కూర్చునే ఓపిక లేక, ఇంట్లో తన కోసం శశికళ ఎదురు చూస్తుంటుందనే ఉద్దేశంతో “నే వెళ్తా” అని లేచాడు.
ఆమె అతని వైపు జాలిగా చూసి “రూమ్లో నాకు బోర్ గా వుంది. నా ఫ్రెండ్ కూడా లేదు. ఈ రోజు రానని చెప్పింది” అంది.
“మరి మా ఇంటికి రాకూడదూ?” అడిగాడు. “రాను”
“ఎందుకని?”
“మీ ఆవిడతో నువ్వు పడుకుంటావు. నాకు నిద్ర పట్టదు” అతను మాట్లాడలేదు.
“నన్ను నీ దగ్గర పడుకోనిస్తానంటే వస్తా” అని గలగలా నవ్వింది. జోక్ చేసిందనుకున్నాడు సీతారాం.
ఆమె లేచి నిలబడి అతనికి ఎదురుగా వచ్చి ఆమె పెదవులను అతని పెదవులకు ఆనించి గట్టిగా ముద్దు పెట్టుకుంది. అతను నిరుత్తరుడయ్యాడు. కాస్త వెనక్కి జరిగి - “సీతారామ్! నేనంటే నీకే ప్రేమ కదూ!” అంది.
అతను మాట్లాడలేదు. మళ్లీ ఆమె ముద్దు పెట్టుకుంది. ఈసారి వెంటనే వదలలేదు. అతని ప్రతి అణువును తడమసాగింది. సీతారాంకు ఒళ్లు బరువు దిగినట్లనిపించింది. ఎక్కడో తేలియాడుతున్నట్లనిపించింది. ఆమె అతడ్ని వదిలిపెట్టింది. అతను తన రెండు చేతులూ ఆమె నడుం చుట్టూ వేసి గట్టిగా పెదవులపై ముద్దు పెట్టుకున్నాడు. వెనక్కి జరిగి - “నే వెళ్తా” అన్నాడు.
“వద్దు”
“వెళ్లకపోతే ఎలా?” “మీ ఆవిడంటే నీకంత భయమా?” “నా కోసం ఎదురుచూస్తుంటుంది.” “నాతో వుండిపోరాదూ, ఈ ఒక్క రాత్రికి” “ఉండలేను”
“నీదంతా స్వార్థం. నువ్వు వెళ్లి మీ ఆవిడ ద్వారా కోరిక తీర్చుకుంటావు. నాకూ కోరికలుంటాయి కదా!”
“పెళ్లి చేసుకోకూడదూ?”
“రాజీవ్ కూడా ఇదే మాటంటాడు. మీ ఇద్దరికి నన్ను ఎప్పుడు వదిలించు కుందామా అని వున్నట్లుంది.”
“నే వెళ్తా” అని మరోసారి చెప్పి కదలబోయాడు. రెండు చేతులూ అతనికి అడ్డంగా పెట్టింది. అతను కూర్చున్నాడు. ఆమె అతడ్ని మెల్లమెల్లగా ఆక్రమించింది.
“నా కోసం ఈ మాత్రం చేయలేవా సీతారామ్?” అంద మత్తుగా. అతను లొంగిపోయాడు.
“నా కోసం ఈ మాత్రం త్యాగం చేయలేవూ?" అడిగింది.
“ఇందులో నా త్యాగం ఏం వుంది?” అన్నాడతను. ఆ రోజు అతను స్వర్గసౌఖ్యం అనుభవించాడు. అది మొదలు ఇంతకు ముందులా ఇద్దరి మధ్య వివిధ విషయాల మీద చర్చలు జరగడం లేదు. సంభాషణలు తగ్గాయి. ఇద్దరు కలిశారంటే ఇతర విషయాలన్నీ పక్కకు పోయి శారీరక సుఖమే ప్రధానమవుతోంది.
రాత్రి ఎనిమిది గంటలు. సీతారాం బెడ్ మీద కూర్చున్నాడు. వసుంధర మరో పక్క కూర్చుంది. అతను రాగానే మీద పడిపోయే వసుంధర అలా దూరం వుండటం అతనికి ఆశ్చర్యమేసింది. ఏమో జరిగి వుంటుందని అనుకున్నాడు “ఏమైంది?” అని అడిగాడు. ఆమె మాట్లాడలేదు. దాంతో దగ్గరకు వెళ్లి ముదు పెట్టుకోబోయాడు. విదిలించి కొట్టింది. గడ్డం పట్టుకొని “చెప్పకుంటే ఎలా తెలుస్తుంది?” అని అడిగాడు.
“నాతో కోరిక తీర్చుకోవడానికి మాత్రమే నువ్వు వస్తున్నావని అనిపిస్తోంది. అది అయిపోగానే వెంటనే వెళ్లిపోతున్నావు”
“నేను నీకు చాలాసార్లు చెప్పాను. నేను నా ఫ్యామిలీని వదిలిపెట్టి ఉండ లేనని, నీతో నాకు సెక్స్ అవసరం లేదని” అన్నాడు.
“అంతేనా? నేనేమీ కానా?”
“నీకు ఫ్రెండ్స్ ఉన్నారు. ఉద్యోగం ఉంది. నీ వ్యవహారాలు నీకున్నాయి. స్వతంత్ర అభిప్రాయాలున్నాయి. నేను నీతో వుంటానని ఎప్పుడూ చెప్పలేదు. నువ్వు అలా అనుకుంటావని నేను భావించలేదు”
“నీ కోరిక తీర్చుకుని వెళ్లిపోతున్నావు” “నన్నేం చేయమంటావు?” “ఇక్కడే వుండిపో!” “నా వల్ల కాదని చాలా సార్లు చెప్పా”
కావాల్సి వస్తోంది. ఒక స్వతంత్రంగా బతకగలిగే వసుంధరనే ఇలా అంటుంటే శశికళ పరిస్థితి ఎలా వుంటుందని అనుకున్నాడు. వసుంధరతో పరిచమయ్యాక సమా సంబంధాలు తెగిపోయినట్లుగా వుంది. మరో మనిషిని కలవడం లేదు. (సం ఎవరినీ కలవడం లేదు. ఎక్కడికి వెళ్లాలన్నా వసుంధరకు చెప్పాల్సి వని ఆమె పనులకు మాత్రం సీతారాం తప్పనిసరిగా అటెండ్ కావాల్సి వస్తోం రోజు తన ఫ్రెండ్ రాకేష్ ఇంట్లో ఫంక్షన్ వుంది. ఇద్దరం కలిసి వెళ్లి రానన్నందుకు పెద్ద గొడవ చేసింది.
“నీ ఫ్రెండ్ కదా నువ్వు వెళ్లు. నేనెందుకు?” అన్నాడతను. ఆమె వినలేదు. నానా రభస చేసింది. అయినా మొండిగాఅందుకు నిరాకరించాడు. ఆమె కూడా వెళ్లలేదు. అతని వల్ల తాను వెళ్లలేక పోయినందుకు వంసుధర పది రోజులు సాధించింది. తాను రాజీవ్ నో, మరెవరినో కలవాలని అనుకున్నప్పుడు సతీరాం అనుమతితో సంబంధం లేకుండా వెళ్లి పోయేది. సీతారాం ఇవేమీ పట్టించుకోలేదు. ఆమె జీవితం ఆమెదనుకున్నాడు. ఆమె నిలదీయడం ప్రారంభించేసరికి ఇవన్నీ గుర్తుకొచ్చాయి.
“నేను చచ్చిపోతా” అంటూ ఆవేశంగా వెళ్లి గ్యాస్ స్టా అంటించింది. ఆమెను ఆపి, శాంతపరచడం సీతారామ్కు గగనమే అయింది. తెల్లారింది. విపరీతంగా అలసిపోయినట్లు అనిపించింది. తన మీద తనకే అసహ్యం లాంటిది పుట్టింది సీతారామ్కు. తాను వెళ్లడానికి లేస్తే “నువ్వు వెళ్తే నేను చచ్చిపోతా” అని బెదిరించింది. అవేమీ లెక్క చేయకుండా అతను విసవిసా బయటకు వచ్చి ఇంటిదారి పట్టాడు.