
హోలీ.... ఈ పండగను ఇష్టపడని వారు ఎవరూ ఉండరేమో. ఈ రంగుల పండగను చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ సరదాగా గడపాలని కోరుకుంటారు. ఈ ఏడాది హోలీ పండగ... మార్చి 8వ తేదీన ప్రజలు జరుపుకోనున్నారు. అయితే... ఈ పండగను జరుపుకునే క్రమంలో... మహిళలు ఎలాంటి దుస్తులు ధరించాలో ఓసారి చూద్దాం...
ఈ రంగుల పండగ రోజున... సాంప్రదాయ కుర్తాస్ నుండి స్ట్రెయిట్ సూట్లు, చీరల వరకు ఎంచుకోవడానికి అనేక ఎంపికలు ఉన్నాయి. ధరించే దుస్తుల రూపు, మీరు పెట్టే వ్యయంపై మాత్రమే దృష్టి పెట్టడానికి బదులుగా, పరిగణించవలసిన కొన్ని అంశాలు ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం...
శైలి, సౌకర్యం
మీరు ఎంచుకోబోయే దుస్తులు స్టైలిష్‌గా ఉండటమే కాకుండా, అది కూడా సౌకర్యంగా ఉండాలి. పారదర్శకంగా.. మరీ ఒంటికి అతుక్కొని ఉన్న దుస్తులు నివారించాలి ఎందుకంటే అవి మీకు చాలా అసౌకర్యంగా అనిపించవచ్చు. కాబట్టి... ముందుగా కంఫర్ట్ గా ఉండే దుస్తులను ఎంచుకోవాలి.
సౌకర్యవంతమైన ఫాబ్రిక్
మీ స్టైల్ స్టేట్‌మెంట్‌ను ప్రదర్శించే మార్గంలో ఫాబ్రిక్‌కు తగిన శ్రద్ధ ఇవ్వాలి. హోలీ కోసం కాటన్ దుస్తులు ఈ సీజన్‌కు తగినవి. ఈ దుస్తులు రోజంతా మిమ్మల్ని చల్లగా ఉంచుతాయి. కాబట్టి... కాటన్ దుస్తులు ధరించడం ఉత్తమమైన మార్గం..
దుప్పట్టా...
మీరు ఎంచుకునే దుప్పట్టా రంగు విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. ముదురు రంగు దుప్పట్టా ఎంచుకోవాలి. అది కూడా ఎలాంటి డిజైన్ లాంటివి లేనివి ఎంచుకోవాలి. డిజైన్ ఏదైనా ఉంటే... వాటిలో రంగు ఇరుక్కుపోతుంది. అలా కాకుండా... ముదురు రంగు ప్లెయిన్ దుప్పట్టా ఎంచుకుంటే... మీ జుట్టు పాడవ్వకుండా తలకు అడ్డుపెట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది.