హోలీని జరుపుకోవడానికి వెనకున్న అసలు కథ ఇదే..! ఈ స్టోరీ మీకు తెలుసా..?

Published : Feb 27, 2023, 11:23 AM IST
హోలీని జరుపుకోవడానికి వెనకున్న అసలు కథ ఇదే..! ఈ స్టోరీ మీకు తెలుసా..?

సారాంశం

Holi 2023: ధనికుడు, పేదవాడు అంటు ఎలాంటి వివక్షలేకుండా అందరూ కలిసి సంతోషంగా జరుపుకునే పండుగ హోలీ. ఈ హోలీని కేవలం మనదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా జరుపుకుంటారు. అందుకే ఈ పండుగను సంతోషాల పండుగ అని కూడా అంటారు.   

Holi 2023:  హిందూ క్యాలెండర్ ప్రకారం.. ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున దేశవ్యాప్తంగా హోలీని సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ పండుగ వసంత కాలం ప్రారంభాన్ని సూచిస్తుంది. హోలీని ప్రధానంగా భారతదేశం, నేపాల్ లో బాగా జరుపుకుంటారు. ఈ పండుగను ‘క్వీన్ ఫెస్టివల్ ఆఫ్ ది ఇయర్’, ‘ఫెస్టివల్ ఆఫ్ కలర్స్’, ‘ఫెస్టివల్ ఆఫ్ లవ్’ అని కూడా అంటారు. ఈ పండుగ హిందువులకు ఎంతో ప్రత్యేకమైనది. ఈ పండుగ ఇతర దేశాలకు కూడా వ్యాపించింది. 

హోలీ చరిత్ర

ప్రాచీన కాలంలో భారతదేశంలో హిరణ్యకశ్యపుడు అనే రాక్షస రాజు ఉండేవాడు. అయితే ఇతను మహావిష్ణుమూర్తి చేతిలో హతమైన తన తమ్ముడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ఇందుకోసం ఈ రాక్షస రాజు ఏండ్ల తరబడి తపస్సు చేస్తాడు. ఎట్టకేలకు హిరణ్యకశ్యపునికి వరం లభించింది. దీంతో ఈ రాక్షస రాజు తనను తాను దేవుడిగా ప్రకటించుకుంటారు. ప్రజలందరినీ తనను దేవుడిలా ఆరాధించమని ఆదేశిస్తారు. అయితే ఈ రాక్షస రాజుకు ప్రహ్లాదుడు అనే చిన్న కొడుకు ఉన్నాడు.  ఇతను విష్ణుకు గొప్ప భక్తుడు. ఇతను తన తండ్రి ఆజ్ఞను ఎప్పుడూ పాటించలేదు. ఎంత చెప్పినా.. విష్ణుదేవుడిని తప్ప మరెవరినీ పూజించేవాడు కాదు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రాక్షస రాజు సొంత కొడుకు అని కూడా చూడకుండా చంపడానికి సిద్దపడతారు. అగ్నికి అతీతమైన తన సోదరి హోలికను ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని అగ్ని చితిపై కూర్చోమని చెప్తాడు. అయినా సరే అప్పుడు కూడా ప్రహ్లాదుడు విష్ణువును ఆరాధిస్తాడు. దీంతో చితిమంటలపై ఉన్నా ప్రహ్లాదుడికి మంటలు అంటుకోవు. కానీ హోలిక మాత్రం ఆ మంటల్లోనే కాలి బూడిద అవుతుంది. హోలికా ఓటమీ చెడు అంతా కాలి బూడిద కావడాన్ని సూచిస్తుంది. ఆ తర్వాత విష్ణు దేవుడు హిరణ్యకశ్యపుడిని వధిస్తాడు. కానీ నిజానికి హోళికా మరణం హోలీతో ముడిపడి ఉంది. అందుకే బీహార్ వంటి భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో చెడు అంతానికి గుర్తుగా హోలీకి ముందు రోజు భోగి మంటల రూపంలో చితిని వెలిగిస్తారు.

శీతాకాలనికి గుడ్ బై చెప్పేసి వసంత రుతువు ప్రారంభాన్ని హోలీ సూచిస్తుంది. కొన్ని పండుగలు వసంత పంటతో సంబంధం కలిగి ఉంటాయి. దుకాణాలన్నీ కొత్త పంటలతో నిండిపోతాయి. రైతులకు ఈ పండుగ ఆనందాన్ని తెస్తుంది. దీనివల్లే హోలీని  ‘వసంత మహోత్సవం’ లేదా ‘కామ మహోత్సవం ’ అని కూడా అంటారు. 

మీకు తెలుసా? హోలీ పురాతన హిందు పండుగలలో ఒకటి.  బహుషా ఇది క్రీస్తు పుట్టుకకు చాలా శతాబ్దాల ముందే ప్రారంభమైంది. అయితే ప్రాచీన భారతదేశంలోని దేవాలయాల గోడలపై హోలీకి సంబంధించిన శిల్పాలు ఉన్నాయి. వీటిలో ఒకటి ఒకప్పటి విజయనగర రాజధాని హంపిలో 16 వ శతాబ్దానికి చెందిన ఆలయం. ఈ ఆలయం గోడలమీద హోలీకి సంబంధించిన ఎన్నో దృశ్యాలు చెక్కబడి ఉన్నాయి.  

PREV
click me!

Recommended Stories

ఒక స్పూను శెనగపిండితో మచ్చల్లేని ముఖం
తక్కువ ధరకే వజ్రాల చెవిపోగులు, చూసేయండి