యోని నుంచి దుర్వాసన వస్తోందా? ఈ నూనెలతో చెక్ పెట్టండి..

Published : Feb 09, 2023, 04:22 PM IST
 యోని నుంచి దుర్వాసన వస్తోందా? ఈ నూనెలతో చెక్ పెట్టండి..

సారాంశం

కొంతమంది ఆడవారికి యోని నుంచి దుర్వాసన వస్తుంటుంది. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. అయితే కొన్ని నూనెలతో యోని నుంచి దుర్వాసన రావడాన్ని తగ్గించొచ్చు. అలాగే యోనిని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా ఇవి సహాయపడతాయి. 

యోని నుంచి వాసన రావడం సర్వ సాధారణ విషయం అని చాలా మంది చెప్తుంటారు. కానీ ఈ వాసన చిరాకు పెడుతుంది. నలుగురిలోకి వెళ్లినప్పుడు ఇబ్బందిని కలిగిస్తుంది. ఇది సర్వసాధారణ విషయమని దీని పట్టించుకోకుండా ఉండకూడదు. ఎందుకంటే ఇది ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. అయితే యోని వాసనను పోగొట్టడానికి, పరిశుభ్రతను మెరుగుపరచడానికి కొన్ని నూనెను బాగా సహాయపడతాయి. 

యోని వాసనకు కారణాలు

యోని నుంచి వాసన రావడం సర్వ సాధారణం. కానీ ఇది ఎప్పటికప్పుడు మారుతుంది. కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు. అయితే పీరియడ్స్, పరిశుభ్రత లేకపోవడం, క్రమం తప్పకుండా పరిశుభ్రత చిట్కాలను ఫాలో అవ్వడం, లైంగిక కార్యకలాపాలు, శారీరక కార్యకలాపాలు కూడా యోని వాసనకు దారితీస్తాయి. 

అయితే యోని దగ్గర ఉండే మైక్రోస్కోపిక్ మైక్రోబయోటా కారణంగా కూడా యోని దగ్గర డిఫరెంట్ స్మెల్ వస్తుంది. కొన్ని కొన్ని సార్లు ఈ వాసన కూడా రాదు. కానీ అక్కడ ఉండే బ్యాక్టీరియా సమతుల్యత దెబ్బతిన్నప్పుడు మీ శరీరంలో ప్రైవేట్ భాగాల నుంచి చెడు వాసన వస్తుంది. అయితే ఈ వాసనను పోగొట్టడానికి ఎలాంటి నూనెలు సహాయపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

టీ ట్రీ ఆయిల్

ఈ నూనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇవి ఎన్నో సాధారణ అనారోగ్యాల సమస్యలను తగ్గించడానికి ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. 3-4 చుక్కల టీ ట్రీ ఆయిల్ ను తీసుకుని ఒక కప్పు పోసి గోరువెచ్చని చేయండి. ఈ నీళ్లతో మీ యోని వెలుపల ప్రాంతాన్ని కడగండి. ఇది ఈస్ట్ ఇన్ఫెక్షన్లను నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది. మీకు ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే ఈ నూనెను వారానికి ఒకసారి ఉపయోగించండి.

లావెండర్ ఆయిల్

లావెండర్ ఆయిల్ మంచి సువాసనను కలిగి ఉంటుంది. ఈ నూనె బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు చెక్ పెడుతుంది. అలాగే యోని డియోడరైజర్ గా కూడా పనిచేస్తుంది. 200 మి.లీ నీటిలో 1-10 చుక్కల లావెండర్ ఆయిల్ ను కలిపి స్నానం చేయండి. అలాగే దీనిని యోని వాష్‌గా ఉపయోగించండి. 

ఒరేగానో నూనె

ఈస్ట్ ఇన్ఫెక్షన్లన, తరచుగా యోని నుంచి వాసన రావడం.. ఈ రెండు సమస్యలను తగ్గించడానికి ఒరేగానో నూనె సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ నూనెతో స్ప్రే తయారు.. యోని భాగంలో స్ప్రే చేయడం సులువైన పద్దతి. లేదా దీనిలో నీళ్లు కలిపి యోనిని శుభ్రం చేయొచ్చు . 

కొబ్బరి నూనె

ఎన్నో ఏండ్ల నుంచి దీన్ని అన్ని చర్మ సమస్యలకు ఉపయోగిస్తున్నారు. ఈ నూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఈ నూనె యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లతో పాటు యోని ప్రాంతంలో ఈస్ట్, డ్రగ్ రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. ఈ నూనెను యోని ప్రాంతంగా అప్లై చేయాలి. 

పుదీనా నూనె

పుదీనా నూనె యోని దుర్వాసను చెక్ పెట్టడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం సుమారు 2 మిల్లీలీటర్ల నీటిలో 5-200 చుక్కల నూనెను  మిక్స్ చేసి స్నానం చేసిన తర్వాత యోని ప్రాంతం వెలుపల స్ప్రే చేయాలి.

గమనిక:  ఈ నూనెలను ఉపయోగించే ముందు.. డాక్టర్ ను సంప్రదించండి. అలాగే మీకు దురద, మంట, సెక్స్  సమయంలో నొప్పి మొదలైన వాటికి కారణమయ్యే ఇన్ఫెక్షన్ ఉంటే వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Long Haaram: చీరల మీదకు ఒక్క లాంగ్ హారం ఇలాంటిది ఉంటే చాలు..!
Mangalasutra Bangles: మంగళసూత్రాలకు జతగా మ్యాచింగ్ గాజుల డిజైన్లు