కళ్లలో కూడా హై బీపీ లక్షణాలు.. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా మీ పని అంతే..!

By Mahesh RajamoniFirst Published Aug 18, 2022, 2:04 PM IST
Highlights

మారుతున్న జీవన శైలిలో అధిక రక్తపోటు సర్వసాధారణ సమస్యగా మారిపోయింది. అయితే ఈ సైలెంట్ కిల్లర్ లక్షణాలు కళ్లలో కూడా కనిపిస్తాయన్న సంగతి మీకు తెలుసా..? 
 

సైలెంట్ కిల్లర్ అని పిలువబడే అధిక రక్తపోటు నేడు ఎంతో మందిని పట్టిపీడిస్తోంది. ఈ సమస్యతో బాధపడేవారు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది మీ శరీరంలోని వివిధ అవయవాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. అలాగే ఇది స్ట్రోక్, గుండెపోటు, మూత్రపిండాల వ్యాధుల ప్రమాదాల్ని కూడా పెంచుతుంది.

అధిక రక్తపోటు పెద్ద వ్యాధిగా మారే వరకు ఎలాంటి లక్షణాలను చూపించదు. అయితే హై బీపీ కొన్ని లక్షణాలు కళ్లలో కనిపిస్తాయి. వాటిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. అధిక రక్తపోటును గుర్తించడానికి  నిత్యం బీపీ ని చెక్ చేస్తూ ఉండాలి. అయితే ఈ మీరు అధిక రక్తపోటు బారిన పడ్డారని మీ కళ్లే చెప్తాయి.  కళ్లలో కనిపించే హై బీపీ లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

కళ్లపై ఎర్రటి మచ్చలు

కళ్లలో కనిపించే ఎర్రటి మచ్చలు అధిక రక్తపోటుకు సంకేతం కావచ్చంటున్నారు నిపుణులు.  broken blood vessels వల్ల ఇలా అవుతుంది. మీ కళ్ళు తరచుగా ఎర్రగా ఉంటే.. తప్పకుండా బీపీ చెకప్ ను చేయించుకోవాలి. ఎందుకంటే అధిక రక్తపోటు దృష్టిపై ప్రభావం చూపుతుంది. ఇది రెటినోపతి అని పిలువబడే పరిస్థితికి దారితీస్తుంది. దీనిలో రక్త నాళాల గోడలు గట్టిపడతాయి. అలాగే రక్త ప్రవాహాన్ని నిరోధిస్తాయి. రెటీనా కూడా ఉబ్బుతుంది. రక్త నాళాలు కూడా లీక్ కావచ్చు.

అధిక రక్తపోటు ఇతర లక్షణాలు

  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
  • ఛాతిలో నొప్పి 
  • మూత్రంలో రక్తం 
  • ఛాతి, మెడ లేదా చెవుల్లో నొప్పి
  • తీవ్రమైన తలనొప్పి 
  • రక్తస్రావం 
  • అలసట

అధిక బరువు కూడా ప్రమాదకరం. అందుకే బరువు తగ్గేందుకు రోజూ వ్యాయామం చేయాలి. లేకపోతే ఈ అధిక రక్తపోటు బారిన పడొచ్చు. ఎందుకంటే దీని ప్రమాదం మీకే ఎక్కువగా ఉంటుంది. 

ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, కూరగాయలను, పండ్లను  తక్కువగా తీసుకోవడం వల్ల కూడా హై బీపీ బారిన పడతారు. అలాగే ఆల్కహాల్ ను, కాఫీని, స్మోకింగ్ ను ఎక్కువగా తాగడం వల్ల కూడా అధిక రక్తపోటు బారిన పడతారు.  అంతేకాదు.. తగినంత నిద్ర లేకపోవడం కూడా మిమ్మల్ని ఈ జబ్బు బారిన పడేస్తుంది.

అధిక బీపీని తగ్గించే మార్గాలు

ఉప్పును మోతాదుకు మించి తీసుకోకూడదు. కూరగాయలను, సీజనల్ పండ్లు ఎక్కువగా తింటూ ఉండాలి. ఆల్కహాల్ ను మొత్తమే మానుకోవాలి. శరీర బరువును కూడా అదుపులో ఉంచుకోవాలి. రెగ్యులర్ గా వ్యాయామం చేస్తుండాలి. ముఖ్యంగా స్మోకింగ్ చేయకూడదు. ఈ అలవాట్లు చేసుకుంటే మీ ఆరోగ్యానికి ఏ ప్రమాదం ఉండదు. 


 

click me!