Sri Krishna Janmashtami 2022: శ్రీ కృష్ణుడిని ఇలా పూజించండి.. ప్రతి పనిలో మీరు విజయం సాధిస్తారు..

By Mahesh Rajamoni  |  First Published Aug 18, 2022, 8:33 AM IST

Sri Krishna Janmashtami 2022: కన్నయ్య జన్మదినం సందర్భంగా మీరు ప్రతి పనిలో విజయం సాధించాలంటే.. ఈ రోజున ఆయను నిష్టగా పూజించండి. మీకష్టాలన్నీ తొలగిపోతాయి.
 


Sri Krishna Janmashtami 2022: కన్నయ్య జన్మదినం సందర్భంగా మీరు ప్రతి పనిలో విజయం సాధించాలంటే.. ఈ రోజున ఆయను నిష్టగా పూజించండి. మీకష్టాలన్నీ తొలగిపోతాయి.

భాద్రపద మాసంలో కృష్ణ పక్షం అష్టమి తిథిని శ్రీకృష్ణుని ఆరాధనకు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఎందుకంటే ఈ రోజునే శ్రీ కృష్ణ భగవానుడు భూమిపై జన్మించాడు. అందుకే ప్రతి ఒక్కరూ కన్నయ్య అనుగ్రహం కోసం జన్మాష్టమి నాడు ఉపవాసం  ఉండి నిష్టగా పూజిస్తారు. కృష్ణాష్టమి రోజున రాత్రి 12 గంటలకు కన్నయ్య జన్మిస్తాడు. ఆ తర్వాత కన్నయ్య భక్తులు ఆయనను పూజించి ఉపవాసం ఉంటారు. అంతేకాదు ఈ పవిత్రమైన రోజుకు లోలోకుడికి ఇష్టమైన పలహారాలను కూడా సమర్పిస్తారు. అంతేకాదు ఈ రోజున గోపాలుడిని నిష్టగా పూజిస్తే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. మీరు మీ కోరికను నెరవేర్చుకోవడానికి ఈ రోజున ఉపవాసం  ఉండి నిష్టగా పూజించాలి. ఇంతకీ ఈ రోజున గోపాలుడిని ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

Latest Videos

undefined

జన్మాష్టమి నాడు కన్నయ్య ఆరాధనలో వెండి వేణువును సమర్పించండి. దీనివల్ల మీకు ప్రతివిషయంలో విజయం వరిస్తుందని చాలా మంది నమ్ముతున్నారు.  అలాగే కుటుంబ సభ్యుల మధ్యనున్న విభేదాలు కూడా తొలగిపోతాయి.

శత్రువు నుంచి ఏదైనా పెద్ద సమస్య ఉంటే .. దాని నుంచి బయటపడేందుకు జన్మాష్టమి నాడు "క్లిమ్ కృష్ణే వాసుదేవాయ హరి:పరమాత్మనే ప్రాణాత్ః క్లేశనాశనాయ గోవిందాయ నమో నమః" అని జపించండి. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ఇది శత్రువు  భయాన్ని తగ్గిస్తుంది.

శ్రీకృష్ణుడిని పీతాంబరధారి అని కూడా అంటారు. అంటే పసుపు రంగు దుస్తులు ధరించిన వారు అని అర్థం. ఇలాంటి పరిస్థితిలో కృష్ణ జన్మాష్టమి పూజా ఫలాలను పొందడానికి మీరు ఈ రోజున పసుపురంగు దుస్తులు ధరించి.. లడ్డూలను, పసుపు పండ్లను, పసుపు పూలను, పసుపు మిఠాయిలను సమర్పించండి.

ఏ కారణం చేతనైనా మీ వివాహం ఆలస్యమైతే ఆ కోరికను తీర్చుకోవడానికి 'ఓం క్లిమ్ కృష్ణే వాసుదేవాయ హరి:పరమాత్మనే ప్రాణాత్: క్లేశనశాయ గోవిందాయ నమో నమః క్లీం కృష్ణయ్ గోవిందాయ్ గోపీజన్వల్భయ స్వాహా' అనే మంత్రాన్ని జపించండి. ఈ మంత్రాన్ని జపించడం ద్వారా..  మీకు వివాహ  సంబంధాలు రావడం ప్రారంభమవుతాయని నమ్ముతారు.

click me!