క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే చెడ్డ అలవాట్లు..! వీటిని మానుకోకపోతే మిమ్మల్ని ఎవరూ రక్షించలేరు..!

By Mahesh RajamoniFirst Published Aug 22, 2022, 4:56 PM IST
Highlights

క్యాన్సర్ అంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే దీని బారిన పడితే బతికి బయటపడతామన్న గ్యారంటీ కొంచెం కూడా ఉండదు. అయితే కొన్ని రకాల అలవాట్ల వల్ల క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. 
 

క్యాన్సర్ ఒక ప్రాణాంతక వ్యాధి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. గుండె జబ్బుల తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మరణాలకు క్యాన్సర్ రెండో ప్రధాన కారణంగా ఉంది. అయితే ఈ క్యాన్సర్ లక్షణాలను ముందుగా గుర్తిస్తే.. దీని నుంచి బయటపడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కానీ ఇది చివరి దశలోనే బయటపడుతుంది. అందుకే దీని బారిన పడిన వారు తక్కువ శాతమే ప్రాణాలతో బయటపడుతున్నారు. అయితే క్యాన్సర్ తగ్గినా.. ఇది మళ్లీ సోకే ప్రమాదం ఉంది. అయితే కొన్ని అలవాట్లు క్యాన్సర్ ప్రమాదాన్ని మరింత పెంచుతాయి. క్యాన్సర్ పై అధ్యయనం చేసిన పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే క్యాన్సర్ తో బాధపడుతున్నవ్యక్తులు కొన్ని రకాల అలవాట్లకు దూరంగా ఉండాలి. లేదంటే వారికి మరణం తప్పదని అధ్యయనం తెలియజేస్తుంది. క్యాన్సర్ రోగికి ఏయే అలవాట్లు ప్రమాదమో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ధూమపానం

 సిగరెట్లలో ఉండే రసాయనాలు డిఎన్ఎను దెబ్బతీస్తాయి. అయితే  ఈ DNA డ్యామేజీని రిపేర్ చేయడం కణాలకు కష్టంగా మారుతుంది. ముఖ్యంగా ఇది క్యాన్సర్ నుంచి రక్షించడానికి సహాయపడే DNA భాగాలను కూడా దెబ్బతీస్తుంది. ఇది భవిష్యత్తులో క్యాన్సర్ కు దారితీస్తుంది. ధూమపానం క్యాన్సర్ ను పెంచడమే కాదు..  ఇది అనేక క్యాన్సర్ లకు దారితీస్తుంది. దీనివల్ల గొంతు, నోరు, అన్నవాహిక, పెద్దప్రేగు, కడుపు, పురీషనాళం, క్లోమం, కాలేయం, శ్వాసనాళం, ఫారింక్స్, మూత్రాశయం, మూత్రపిండాలు గర్భాశయ క్యాన్సర్లకు దారితీస్తుంది.

 మద్యం 

మితిమీరి రోజూ మద్యం తాగడం వల్ల కాలెయం దెబ్బతింటుంది. అంతేకాదు కాలెయ వాపు, కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఆల్కహాల్ ను ఎక్కువగా తాగడం వల్ల పురీషనాళ , పెద్దప్రేగు  క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. ఆల్కహాల్ ను మానేయడం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకున్నవారవుతారు. ఇప్పటికే క్యాన్సర్ తో బాధపడుతున్న వ్యక్తులు అధికంగా మద్యం తాగితే వారి పరిస్థితి మరింత దిగజారుతుంది. 

స్థూలకాయం

అధిక బరువు ఒక రకమైన క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. అంతేకాదు తగ్గిపోయిన క్యాన్సర్ కూడా మళ్లీ వచ్చే అవకాశాన్ని అధిక బరువు పెంచుతుంది.  బరువు ఎక్కువగా ఉండటం వల్ల హార్మోన్ ఇన్సులిన్ స్థాయిని పెంచుతుంది. ఇది కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుంది. కొవ్వు కణజాలం ఈస్ట్రోజెన్ అని పిలువబడే హార్మోన్ ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఇది రొమ్ము క్యాన్సర్ రావడానికి దారితీస్తుంది. 

పరిశోధకుల అభిప్రాయం ప్రకారం..  క్యాన్సర్ తో సంబంధం ఉన్న ప్రమాద కారకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. ఈ మధ్య కాలంలో క్యాన్సర్ కారణంగా మరణాల సంఖ్య విపరీతంగా పెరిగుతోంది. ఈ క్యాన్సర్ గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తే.. భవిష్యత్తులో క్యాన్సర్ మరణాల సంఖ్యను తగ్గించొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

click me!