మగవారికంటే ఆడవాళ్లకే మోకాళ్ల నొప్పుల సమస్య ఎక్కువ.. ఎందుకంటే..?

Published : Aug 20, 2022, 10:58 AM ISTUpdated : Aug 20, 2022, 10:59 AM IST
మగవారికంటే ఆడవాళ్లకే మోకాళ్ల నొప్పుల సమస్య ఎక్కువ.. ఎందుకంటే..?

సారాంశం

ఈ రోజుల్లో చిన్న వయసు వారు సైతం మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ మోకాళ్ల నొప్పులు మగవారికంటే ఆడవారికే ఎక్కువగా వస్తున్నాయట. ఎందుకంటే..  

పురుషులతో పోల్చితే ఆడవారే మోకాళ్ల నొప్పులతో ఎక్కువగా ఇబ్బంది పడుతన్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఆధునిక జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు. కండరాలు, కీళ్ల నొప్పుల సమస్యలు చాలా ఇబ్బంది పెడతాయి. కానీ చాలా మంది దీన్ని తేలిగ్గా తీసిపారేస్తారు. కానీ ఈ నొప్పి ఫ్యూచర్ లో ప్రమాదకరంగా మారుతుంది. అసలు ఆడవారికే మోకాలి నొప్పులు ఎందుకు ఎక్కువగా వస్తాయి.. దీన్ని ఎలా నివారించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

  • మోకాళి నొప్పికి గల కారణాలలో ఒకటి స్త్రీల శరీర కూర్పు. వీరి కీళ్ళు ఎక్కువ కదలికను కలిగి ఉంటాయి. అంతేకాదు వీరి tendons కూడా చాలా మృదువుగా ఉంటాయి. మగవారితో పోల్చితే ఆడవారే ఎక్కువగా నడుస్తారు. అందుకే మహిళల్లోనే మోకాళి నొప్పి ఎక్కువగా వస్తుంది. 
  • ఈస్ట్రోజెన్ అనే స్త్రీ హార్మోన్ మోకాళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కానీ ఈస్ట్రోజెన్ హార్మోన్ పీరియడ్స్ సమయంలో, రుతువిరతి తరువాత బాగా తగ్గుతుంది. ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గడం వల్ల మోకాలి కీళ్లకు మద్దతునిచ్చే ప్యాడెడ్ మృదులాస్థి ప్రభావితం అవుతుంది. దీంతో నొప్పులు వస్తాయి. 
  • పురుషులతో పోల్చితే ఆడవారే ఊబకాయం బారిన ఎక్కువగా పడుతుంటారు. మీ శరీర బరువంతా మీ మోకాళ్లపైనే పడిపోతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా.. మీరు బరువు పెరిగే కొద్దీ మీ మోకాళ్లపై ఒత్తిడి మరింత పెరుగుతుంది. మీరు ఉండాల్సిన బరువు కంటే ఐదు కిలోలు ఎక్కువగా ఉన్నా .. మీ మోకాళ్లపై 25 కిలోల ఎక్కువ పీడనం పడుతుంది. 
  • సాధారణంగా ఆడవారు ఎలాంటి నొప్పిని కూడా బయటపెట్టరు. అదే తగ్గుతుందిలే అని లైట్ తీసుకుంటారు. దీనివల్ల కూడా మోకాలి నొప్పులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మోకాళ్లలో నిరంతరం నొప్పి, వాపు లేదా వాటిని వంచడంలో ఏదైనా సమస్య ఉంటే.. వెంటనే డాక్టర్ ను సంప్రదించండి. లేదంటే మోకాలికి తీవ్రమైన నష్టం జరగొచ్చు. 
  •  మోకాళ్లకు ఏదైనా గాయమైతే వెంటనే చికిత్స తీసుకోండి. ఎందుకంటే దీనికి సకాలంలో చికిత్స తీసుకోకపోతే భవిష్యత్తులో ఈ నొప్పి మరింత పెరిగే అవకాశం ఉంది. 
  • మోకాలి స్నాయువు (knee ligament) విస్తరించడం వల్ల కూడా మోకాలి నొప్పులు వస్తాయి. 
  • వ్యాయామం ఎక్కువగా చేయడం వల్ల మోకాళ్ల మోకాళ్ల నొప్పులు వస్తాయి. గంటల తరబడి వ్యాయామం చేయడం,  పరిగెత్తడం వల్ల మోకాళ్లపై ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. 
  • మోకాళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్య బరువును మెయింటైన్ చేయాలి. ఎందుకంటే అదనపు శరీర బరువు మోకాళ్లపై ఒత్తిడిని పెంచుతుంది. 

వ్యాయామం ఎక్కువగా చేయకూడదు:  ఈత, సైక్లింగ్ వంటివి మోకాళ్ల మృదులాస్థిని రక్షించడంలో ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే కొన్ని రకాల వ్యాయామాలు మోకాళ్లకు హానీ కలిగిస్తాయి. జుంబా వంటి కొన్ని యోగాసనాలు (సూర్య నమస్కారం, పద్మాసనం), దూకడం, డ్యాన్స్ చేయడం, వేగంగా ముందుకు, వెనుకకు డైనమిక్ వంటి వ్యాయామాలు మోకాలి నొప్పిని ఎక్కువ చేస్తాయి. 

PREV
click me!

Recommended Stories

Fruits: రాత్రిపూట పండ్లు తినొచ్చా? వేటిని అస్సలు తినకూడదు..?
Chanakya Niti: పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్నారా.? ఇలాంటి మ‌హిళ‌ల‌కు దూరంగా ఉండ‌డ‌మే మంచిది