
Silver Anklets:ఆడపిల్ల పుడితే చాలు ఆమెకోసం మొదటగా ఏదైనా కొనాలనుకునే ఆ లీస్ట్ వెండి పట్టీలే ఫస్ట్ ప్లేస్ లో ఉంటాయి. అవి పెట్టుకుని చిన్నారులు అలా అలా నడుస్తుంటే.. ఆ గజ్జెలు ఘల్లు ఘల్లు మంటుంటే..ఇంట్లో వచ్చే ఆ కళే వేరు. అందుకే చిన్నపిల్లలకు అప్పుడప్పుడే నడుస్తుంటే.. గజ్జెలు ఎక్కువగా ఉండే వెండీ పట్టీలను పెట్టి మురిసిపోతుంటారు. అయినా భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో వెండి పట్టీలను ధరించడం ఒక భాగంగా మారింది. అయితే ఈ పట్టీలు ఎందుకు పెట్టుకుంటారని అడిగితే మీరేం సమాధానం చెప్తారు.. కాళ్ల అందం కోసమనేనా.. కానీ ఈ వెండి పట్టీలు కాళ్లకు అందాన్నే కాదు వారి ఆరోగ్యాన్ని కాపాడటానికి కూడా ఉపయోగడతాయని మీకు తెలుసా. అవును వీటిని ధరించడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
కాళ్ల నొప్పులను తగ్గిస్తాయి: కాళ్లలో తచుగా వచ్చే నొప్పులను, తిమ్మిరి, వణుకు వంటి సమస్యలన్నింటినీ పట్టీలతో చెక్ పెట్టొచ్చు. అవును వెండి పట్టీలు పెట్టుకున్న వారికి కాళ్ల నొప్పులు, తిమ్మిర్లు వంటి సమస్యలు చాలా తక్కువగా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఆ నొప్పులను తగ్గించే గుణం వెండికి ఉంటుంది. అంతేకాదు అవి పెట్టుకున్న వారికి సానుకూల శక్తిని కూడా పెంచుతాయట.
కొంతమంది స్త్రీలు జననేంద్రియ, గర్భాశయ సమస్యలతో బాధపడుతుంటారు. ఈ సమస్యలకు హార్మోన్ల హెచ్చుతగ్గులు కూడా కారణం కావొచ్చు. కాగా వెండి ఆభరణాలు చర్మానికి తాగిలితే హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయట. అంతేకాదు నెలసరి ఇర్రెగ్యులర్ గా అయ్యే అవకాశమే ఉండదు. అంతేకాదు ఊబకాయం సమస్యను తగ్గించడంలో కూడా వెండి ఎంతో సహాయపడుతుంది. అనేక ఇతర అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉంచుతుంది.
మడమవాపు: చాలా మంది స్త్రీలలో ఎక్కువగా కనిపించే సమస్య పాదం మడమ వాపు రావడం. ఈ సమస్య వల్ల మడమ చాలా నొప్పిగా ఉంటుంది. దాంతో వారు వారి పనులను సరిగ్గా చేసుకోలేరు. ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందాలంటే వెండి పట్టీలను ధరిస్తే చక్కటి ఫలితం ఉంటుంది. ఇవి పెట్టుకోవడం వల్ల మడమ దగ్గర బ్లడ్ సర్క్యూలేషన్ బాగా జరుగుతుంది. దాంతో మడమ వాపు, నొప్పి తొందరగా తగ్గుతాయి.
రోగ నిరోధక శక్తి: ఇమ్యూనిటీ పవర్ పోషకవిలువలున్న ఆహారం, వ్యాయామం చేయడం ద్వారా మాత్రమే పెరుగుతుందనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే వెండి ఆభరణాల ద్వారా కూడా మన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది కాబట్టి. వెండిలో ఉండే లోహగుణం.. మనలో ఇమ్యూనిటీ పవర్ పెరిగేలా చేస్తాయి. అందుకే ఇవి కేవలం ఆభరణాలే కాదు మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించే అస్త్రాలు కూడా.
మన శరీరంపై ఉండే ఆభరణాలు మన శరీర శక్తిని కొంచెమైనా వృధా కానీయ్యదు. అంతేకాదు మన శరీర శక్తిని ఇంకా పెంచుతుంది. అందుకే వెండి పట్టీలు ధరించిన ఆడవారు చాలా షార్ప్ గా చురుగ్గా ఉంటారట. అంతేకాదు వెండి పట్టీలు పెట్టుకునే వారిలో దేవుడి భక్తి ఎక్కువగా ఉంటుందని కొందరు విశ్వసిస్తుంటారు.