ఉదయం పళ్ళు తోముకునే ముందు నీళ్ళు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి, జీర్ణశక్తి పెరుగుతుంది మరియు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. నోటి దుర్వాసన తగ్గి దంత సమస్యలు రాకుండా కాపాడుతుంది.
సాధారణంగా మనలో ప్రతి ఒక్కరూ ఉదయం లేచిన తర్వాత ఇంట్లో పనులు అయిపోగొట్టి ఆ తర్వాత బ్రష్ చేసుకుని ఏదైనా తింటాం. తాగుతాం. అయితే చాలా మంది ఉదయం నిద్రలేవగానే పరిగడుపున గ్లాస్, రెండు గ్లాసుల నీళ్లను తాగుతుంటారు. ఇలా మీరు బ్రష్ చేయకుండా నీళ్లను తాగితే ఏమౌతుందని ఎప్పుడైనా ఆలోచించారా?
ప్రతి రోజూ బ్రష్ చేసుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. పళ్లను తోముకుంటే మన నోరు పరిశుభ్రంగా ఉంటుంది. ఒక్క మార్నింగ్ మాత్రమే కాదు.. రాత్రిపూట కూడా బ్రష్ చేసుకోవాలంటారు డాక్టర్లు. ఎందుకంటే రోజుకు రెండు సార్లు పళ్లను తోముకోవడం వల్ల మీరు ఎన్నో రోగాలకు దూరంగా ఉంటారు. అయితే మనలో చాలా మంది పళ్లు తోముకోవడానికి ముందే.. అంటే పరిగడుపున నీళ్లను తాగుతుంటారు. నిజానికి ఇది చాలా మంచి అలవాటని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తాజా అధ్యయనాల ప్రకారం.. పళ్లు తోముకోవడానికి ముందు మీరు ఒక గ్లాస్ నీళ్లను తాగితే మీ శరీరంపై సానుకూల ప్రభావం పడుతుంది.
undefined
ఉదయం లేవగానే చాలా మంది ఇంటి పనులను చేసేసి ఆ తర్వాత పళ్లు తోముకుని టీ లేదా కాఫీని తాగుతుంటారు. చాలా మంది రోజువారి లైఫ్ ఇలాగే ఉంటుంది. కానీ కొంతమంది మాత్రం పళ్లు తోముకునే ముందే టీ లేదా కాఫీని తాగి రోజును స్టార్ట్ చేస్తుంటారు. కానీ ఇది మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇలా మీరు పళ్లు తోమకుండా టీ, కాఫీలు తాగడం, తినడం వల్ల మీ దంతాల్లోని ఎనామిల్ దెబ్బతింటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఎట్టి పరిస్థితిలోనూ పళ్లు తోముకోకుండా కాఫీ, టీ లతో పాటుగా ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు. కానీ మీరు ఎంచక్కా గ్లాస్ లేదా రెండు గ్లాసులు నీటిని మాత్రం తాగొచ్చు. దీనివల్ల మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు.
ఉదయాన్నే పళ్లు తోముకోవడానికి ముందు మీరు ఎలాంటి ఆహారాన్ని కానీ, ఏ పానీయాలను కానీ తినకూడదనేది నిజం. కానీ పళ్లు తోముకునే ముందు నీళ్లను తాగితే మాత్రం ఆరోగ్యానికి మంచి జరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీని వల్ల మీకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఉదయం లేవగానే పరిగడుపున నీళ్లను తాగితే శరీరం హెల్తీగా ఉంటుంది. మీకు తెలుసా? పళ్లు తోముకోవడానికి ముందు నీళ్లను తాగితే మీ శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి. వాటర్ వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. అంతేకాదు ఈ అలవాటు వల్ల కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు కూడా తొలగిపోతాయని చెప్తారు.
మార్నింగ్ పళ్లు తోముకునే ముందు నీళ్లను తాగితే మీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఖాళీ కడుపుతో నీళ్లను తాగితే మీ చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. దీనివల్ల మీ చర్మం గ్లో అవుతుంది. అందుకే పళ్లు తోముకోకున్నా మీరు పుష్కలంగా నీళ్లను తాగొచ్చంటారు ఆరోగ్య నిపుణులు.
చాలా మందికి మలబద్దకం, ఊబకాయం, మలబద్ధకం, అధిక రక్తపోటు, డయాబెటీస్ వంటి సమస్యలు ఉన్నాయి. అయితే వీళ్లు ఉదయాన్నే పళ్లు తోముకోవడానికి ముందు గోరువెచ్చని నీటిని తాగితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఇది మీ నోటిని పరిశుభ్రంగా ఉంచుతుంది.
పళ్లను తోముకోకుండానే నీళ్లను తాగితే మీ నోట్లోని బ్యాక్టీరియా పేరుకుపోయే అవకాశం ఉండదు. అలాగే మీ పళ్లలో బ్యాక్టీరియా పేరుకుపోకుండా ఉంటుంది. ఈ అలవాటు మిమ్మల్ని దంత క్షయానికి దూరంగా ఉంచుతుంది.
కొంతమంది నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వారు నలుగురిలో మాట్లాడటానికి కూడా సిగ్గుపడుతుంటారు. ఈ రకమైన నోటి దుర్వాసన సమస్యతో బాధపడుతున్న వారు పళ్లు తోముకోవడానికి ముందు నీళ్లను తాగితే ప్రయోజకరంగా ఉంటుంది. దీనివల్ల నోటి దుర్వాసన చాలా వరకు తగ్గుతుంది.
కొంతమందికి నోరు ఎప్పుడూ పొడిబారుతుంటుంది. నోట్లో లాలాజల స్రావం లేకపోవడమే ఇందుకు కారణం. కానీ నోరు పొడిబారడం హాలిటోసిస్ కు దారితీస్తుంది. ఈ సమస్య ఉన్నవారు పళ్లు తోముకోకుండా ఉదయం నిద్రలేవగానే ఒక గ్లాసు వేడినీళ్లు తాగితే నోటి దుర్వాసన పూర్తిగా పోతుంది.
కొన్ని అలవాట్లు మనల్ని హాస్పటల్ కు దూరంగా ఉంచడానికి సహాయపడతాయి. ఇందుకోసం మీరు ఉదయం లేవగానే అంటే పళ్లు తోముకోవడానికి ముందే ఒక గ్లాస్ నీళ్లను తాగాలి. అలాగే వాకింగ్, జాగింగ్, వ్యాయామం, యోగా వంటివి చేయాలి. ఈ అలవాట్లు మీ శరీరాన్ని ఆరోగ్యంగా, ఫిట్ గా, చురుగ్గా ఉంచడానికి సహాయపడతాయి.
పళ్లు తోముకోకుండా నీళ్లు తాగాలనిపించకపోతే ముందు ఆయిల్ పుల్లింగ్ చేసి ఆ తర్వాత నీళ్లను తాగండి. ఈ ఆయిల్ పుల్లింగ్ మీకు దంతాల సున్నితత్వం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే నోట్లోని చెడు బ్యాక్టీరియా పూర్తిగా తొలగిపోయి నోట్లో నుంచి దుర్వాసన రావడం తగ్గుతుంది. అలాగే మీ దంతాల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఒక టీస్పూన్ కొబ్బరి నూనెను నోట్లో వేసుకుని దంతాలన్నింటికీ రుద్దండి. కానీ వెంటనే ఉమ్మి వేయకండి.