పిల్లల విషయంలో ఆ కాన్సెప్ట్ చాలా ప్రమాదకరం

Published : Aug 11, 2018, 02:21 PM ISTUpdated : Sep 09, 2018, 12:49 PM IST
పిల్లల విషయంలో ఆ కాన్సెప్ట్ చాలా ప్రమాదకరం

సారాంశం

ఇది సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. 

ప్రేమ పెళ్లి అయినా, పెద్దలు కుదర్చిన వివాహమైనా.. ఈ మధ్యకాలంలో విడిపోవడానికి పెద్దగా సమయం తీసుకోవడం లేదు నేటి తరం యువత. తద్వారా వారి పిల్లలు.. సింగిల్ పేరెంట్ వద్దే పెరగాల్సి వస్తోంది. తల్లి లేదా తండ్రి..ఇద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే పిల్లలకు ప్రేమను అందిస్తున్నారు. ఈ విధానంపై మద్రాసు హైకోర్టు సంచలన కామెంట్ చేసింది.

సింగిల్ పేరెంట్ కాన్సెప్ట్ చాలా ప్రమాదకరమనదని న్యాయస్థానం పేర్కొంది. పిల్లలకు తల్లి, తండ్రి ఇద్దరి ప్రేమ చాలా అవసరమని న్యాయస్థానం తెలిపింది. కానీ సింగిల్‌ పేరెంటింగ్‌తో వారు ఒకరి ఆప్యాయతకు దూరమవుతున్నారని తెలిపారు. ఇది సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 16,2015న పిల్లలపై అఘాత్యాలకు పాల్పడే నిందితులను పోక్సో చట్టం కింద శిక్షించాలని కోర్టు ఇచ్చిన తీర్పును మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ పట్టించుకోవడం లేదని గిరిజా రాఘవన్‌ అనే వ్యక్తి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 

ఈ పిటిషన్‌ విచారించిన న్యాయమూర్తి చిన్నపిల్లలపై అఘాయిత్యాలు పెరగడానికి మహిళా, శిశు సంక్షేమశాఖల విభజన జరగక పోవడమే కారణమన్నారు. ఈ శాఖను మహిళా అభివృద్ధి, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖలుగా విభజించేలా కేంద్రప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇప్పించాలని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌కు సూచించారు. ఇక పిల్లలపై జరిగే అఘాత్యాలన్నీ పోక్సో చట్టం కిందకు వస్తాయని తెలిసేలా అన్ని రాష్ట్రాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కేంద్రప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర మంత్రిత్వ శాఖ నిర్భయ నిధులను రాష్ట్రాలకు కేటాయించడంపై ఓ గైడ్‌లైన్‌ కూడా రూపోందించాలన్నారు.

PREV
click me!

Recommended Stories

Tea and Coffee: చిన్న పిల్లలు టీ, కాఫీలు తాగితే ఏమౌతుంది? డాక్టర్లు ఏమంటున్నారంటే...
Best School: మీ పిల్లలకు ఏ స్కూల్ బెస్ట్? CBSE, ICSE, స్టేట్ సిలబస్ లో ఏది మంచిది?