Bangles : అసలు చేతులకు గాజులు ఎందుకు వేసుకోవాలి? వేసుకోకపోతే ఏమౌతుంది?

Published : Feb 17, 2022, 09:56 AM IST
Bangles : అసలు చేతులకు గాజులు ఎందుకు వేసుకోవాలి? వేసుకోకపోతే ఏమౌతుంది?

సారాంశం

Bangles: ఎన్నో ఏండ్ల నుంచి ఆడవారు చేతులకు గాజులు వేసుకోవాలనే ఆచారం కొనసాగుతూ వస్తోంది. అసలు ఈ గాజులను ఆడవారు ఖచ్చితంగా వేసుకోవాలనే రూల్ సాంప్రదాయంగా వస్తున్నదా? లేకపోతే ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఉందా..?   

Bangles: ఆడవారు చేతులకు గాజులు వేసుకోవాలన్న ఆచారం అనాథిగా కొనసాగుతూనే ఉంది. ఆడవారు అందంగా ముస్తాబవ్వడంతో పాటుగా చేతులకు నిండుగా గాజులను వేసుకోవడం సాంప్రదాయంగా మారింది.  ఒకరకంగా చెప్పాలంటే ఆడవారికి ఇష్టమైన ఆభరణాల్లో గాజులు కూడా ఒకటి. అందుకే పెళ్లైనా ప్రతి స్త్రీ చేతులకు నిండుగా గాజులను వేసుకుంటారు. ఈ గాజులే స్త్రీ సౌభాగ్యాన్ని సూచిస్తాయి.

కానీ ప్రస్తుత ఫ్యాషన్ యుగంలో చేతులకు గాజులను వేసుకోవడమనేది నామోషీగా ఫీలవుతున్నారు. ఏడో పల్లె టూర్లల్లోనే, సిటీల్లో ఉండే కొందరు ఆడవారు మాత్రమే ఖచ్చితంగా గాజులను వేసుకుంటున్నారు. ఇక ఆఫీసులకు వెళ్లే ఆడవారు మాత్రం ఒక చేతికి వాచ్, మరో చేతికి ఒక గాజును మాత్రమే వేసుకుంటున్నారు. మరికొందరు ఆడవారైతే కేవలం పెళ్లిళ్లు, పండగలు, ఫంక్షన్లకు మాత్రమే గాజులను వేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 

అయితే అనథి కాలం నుంచి ఆడవారు చేతులకు గాజులను కేవలం సాంప్రదాయంగానే వస్తోందా? లేక ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఉందా అనే విషయాలపై ఎన్నో పరిశోధనలు జరిగాయి. ఈ పరిశోధనలో గాజులపై ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెలువడ్డాయి. ఆడవారు చేతులకు గాజులు వేసుకోవడం వల్ల వారి ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని పలు పరిశోధనల్లో తేలింది. ఈ గాజుల వల్ల శరీరంలో రక్త ప్రసరణ (Blood circulation)మెరుగ్గా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గాజులు వేసుకున్న మణికట్టు భాగంలో  Blood circulation వేగం పెరుగుతుందట. దీనికి కారణం మణికట్టు భాగంలో రాపిడికి గురికావడమే. అంతేకాదు చేతులు అటూ ఇటూ కదలడం వల్ల గాజులు వెనక్కీ ముందుకు కదలడం వల్ల blood vessels కు మంచి మసాజ్ అవుతుంది. దాంతో రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుందని సైంటిస్టులు చెబుతున్నారు.

మీకు తెలుసా.. గాజులు వేసుకున్న ఆడవారిలో అలసట చాలా తక్కువగా వస్తుందట. అంతేకాదు వీటివల్ల శరీరంలో శక్తి పెరుగుతుంది. తద్వారా ఒత్తిడిని, అలసటను, నొప్పులను భరించే శక్తి అందుతుంది. ముఖ్యంగా గర్భిణులు చేతినిండా గాజులు వేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే గర్భిణులకు ఐదు నెలలు నిండిన తర్వాత బిడ్డ బరువు పెరగడం మొదలవుతంది. ఆ సమయంలో గర్భిణులు అలసటకు గురవుతారు. ఆ అలసటను తగ్గించడంలో గాజులు ఎంతో సహాయపడతాయని కొందరు నమ్ముతున్నారు. కాగా గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అయ్యే వరకు గాజులను వేసుకోవడం వల్ల డెలివరీ టైం వచ్చే నొప్పులను సైతం తట్టుకోగలరని నిపుణులు వెల్లడిస్తున్నారు.

మట్టి గాజులను వేసుకోవడం వల్ల శరీరంలో వేడి తొలగిపోతుంది. మట్టి గాజులకు వేడిని తగ్గించే గుణం ఉంటుంది. అందుకే వీటిని తప్పనిసరిగా వేసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. మహిళల్లో వచ్చే హార్మోన్ల అసమతుల్యతను కూడా ఈ గాజులను నివారించగలవు. గాజులు అందానికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అందుకే వీటిని చిన్నతనంగా, నామోషీగా ఫీలవ్వకుండా వేసుకోండి. ఆరోగ్యంగా ఉండండి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Parijatham plant: కుండీలోనే పారిజాతం మొక్కను ఇలా సులువుగా పెంచేయండి
కళ్లు జిగేల్‌మనేలా పచ్చల గాజులు