Hair Growth Tips: వెంట్రుకలు రాలిపోతున్నాయా..? అయితే ఇవి తినండి..!

By Mahesh RajamoniFirst Published Jan 12, 2022, 9:52 AM IST
Highlights

Hair Growth Tips: జుట్టు పొడుగ్గా, పట్టుకుచ్చులా మెరిసిపోవాలంటే కేశ సంరక్షణ ఎంతో అవసరం. అందులోనూ మీరు ఎంత బలమైన, పోషక విలువలున్న ఆహారం తీసుకుంటే మీ కేశాలు అంత నాజుగ్గా.. పొడవుగా.. దట్టంగా తయారవుతాయి. అందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

Hair Growth Tips: జుట్టు పొడుగ్గా, పట్టుకుచ్చులా మెరిసిపోవాలంటే కేశ సంరక్షణ ఎంతో అవసరం. అందులోనూ మీరు ఎంత బలమైన, పోషక విలువలున్న ఆహారం తీసుకుంటే మీ కేశాలు అంత నాజుగ్గా.. పొడవుగా.. దట్టంగా తయారవుతాయి. అందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

Hair Growth Tips:నేటి ఆధునిక కాలంలో పొడవైన.. దట్టమైన.. నిగనిగలాడే జుట్టు ఉండటం గగణమైపోయింది. అందులోనూ పొడవైన జుట్టు ఉండాలని ఏ అమ్మాయికి కోరికుండదు చెప్పండి. అందుకే మార్కెట్ లోకి కొత్తగా ఏ ప్రొడక్ట్ వచ్చినా వాటిని ట్రై చేస్తుంటారు. అయినా ఫలితం మాత్రం నిల్ అనే చెప్పాలి. ఈ సంగతి పక్కన పెడితే.. జుట్టు పెరుగుదల, నిగారింపు, ఊడిపోకుండా ఉండటం అనేవి మనం తీసుకునే food పైనే ఆధారపడి ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వెంట్రుకలు రాలకుండా ఉండాలంటే మాత్రం కొన్ని రకాల ఆహార పదార్థాలను తింటే మంచి ఫలితం ఉంటుందని తెలుపుతున్నారు. 

పెరుగు.. ఆరోగ్యానికే కాదు.. కురుల నిగారింపుకు కూడా పెరుగు ఎంతగానో మేలు చేస్తుంది. కురులు ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమయ్యే ప్రోటీన్లు పెరుగులో మెండుగా లభిస్తాయి. అలాగే దీనిలో ఉండే విటమిన్ బి5 వెంట్రుకలు పెరగడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ పెరుగు మాడుకు Blood supply మెరుగుపరిచి వెంట్రుకలు రాలకుండా చేస్తుంది.

చేపలు..  జుట్టు పెరగడానికి ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు ఎంతో అవసరం. అయితే వీటిని మన శరీరం సొంతంగా తయారుచేయలేదు. so ఈ ఆమ్లాలు లభించే సార్ డైన్, సాల్మన్, మాకెరల్ వంటి చేపలను తినాలి. వీటిని తినడం వల్ల మీరు అనేక రోగాల భారీ నుంచి తప్పించుకోవడమే కాదు.. జుట్టు బలంగా, ఒత్తుగా , నిగనిగలాడుతుంది. 

జామపండ్లు.. జామ పండ్లు ఆరోగ్యానికే కాదు .. కేశ సంరక్షణకు కూడా మేలు చేస్తాయి. దీనిలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఈ పండ్లను తినడం వల్ల మీ జుట్టు విరిగిపోకుండా, చిట్లకుండా కాపాడుతుంది. అందుకే మీ ఆహారంలో ఏది ఉన్నా లేకున్నా జామ పండ్లు ఉండేలా చూసుకోండి.

పాలకూర.. ఆకుకూరల్లో పోషకాలు మెండుగా ఉంటాయి. అందులో పాలకూరలో పోషక విలువలు పెద్ద మొత్తంలో లభిస్తాయన్న సంగతి మనకు ఎరుకే. ఈ పాల కూరలో బీటా కెరోటిన్, విటమిన్ సి, ఫోలేట్, ఐరన్ వంటివి పుష్కలంగా లభిస్తాయి. సో పాలకూరను తినడం వల్ల శరీరం ఆరోగ్యం  ఉంటుంది. అలాగే వెంట్రుకలు గడ్డిలా మారకుండా, చిట్లిపోకుండా, పెళుసుబారకుండా చేయడంలో ముందుంటుంది. 

చిలకడదుంపలు.. చిలకడ దుంపలను తినడం వల్ల జుట్టు నిగనిగ మెరిసిపోవడంతో పాటుగా పొడిబారకుండా ఉంటుంది. దీనిలో ఉండే బీటా కెరొటిన్ మన శరీరం విటమిన్ ఎ గా మార్చి కేశ సంరక్షణకు ఉపయోగిస్తుంది. దీనితో పాటుగా మామిడిపండ్లు, క్యారెట్, గుమ్మడి ద్వారా కూడా కేశాలు నిగనిగలాడుతాయి. 

గుడ్లు, చికెన్.. చికెన్ లో వెంట్రుకలు పెరగడానికి అవసరమయ్యే ప్రొటీన్ లభిస్తుంది. అలాగే గుడ్లలో ఉండే బయోటిన్ కేశాలు రాలకుండా చేసి వాటి పెరుగుదలకు ఉపయోగపడుతుంది. so గుడ్లను, చికెన్ ను తింటే జుట్టు రాలే సమస్య నుంచి బయటపడొచ్చు.  

click me!