sankranthi 2022: పనస పూలతో సంక్రాంతి స్పెషల్ స్వీట్.. నోట్లో వేస్తే అలా కరిగిపోతాయంతే..

By Mahesh RajamoniFirst Published Jan 11, 2022, 4:17 PM IST
Highlights

sankranthi 2022: పండగలు.. పబ్బాలు అంటూ తేడా లేకుండా స్వీట్లను ఇష్టంగా తినేవారు చాలా మందే ఉన్నారు. అందులోనూ Relatives ఇంటికి వెళినా కూడా Sweets ను తీసుకుని మరీ వెళ్లేవాళ్లు లేకపోలేదు.  అందులోనూ సంక్రాంతి వస్తుంది.. మరి ఈ పండక్కి ఏం స్వీట్లు Prepare చేస్తున్నారు..?  సంక్రాంతి స్పెషల్స్ అంటేనే స్వీట్లు.  నోట్లో ఇలా వేస్తే.. అలా కరిగిపోయే స్వీట్లను ఇష్టపడని వారుండరు. అందుకే సున్నండలు, రవ్వ లడ్డూలు, నువ్వుల పట్టీ, బెల్లం పట్టీలు చేసుకుని లాగించేస్తుంటారు. ఎప్పటిలా చేసిన స్వీట్లే చేయకుండా ఈ సారి కొంచెం వెరైటీగా.. ఎంతో రుచి కరంగా ఉండే స్వీట్లను తయారు చేసి ఆరగించండి. 

sankranthi 2022:

పనస పూలు..

కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి ఒక కప్పు, మైదా పిండి ఒక కప్పు, చక్కెర ఒక కప్పు, నీళ్లు అరకప్పు, ఉప్పు తగినంత, ఒక పెద్ద చెంచా వెన్న, నూనె సరిపడినంత.

తయారీ విధానం: ఒక గిన్నె తీసుకుని అందులో గోధుమ పిండి, మైధా పిండి, ఉప్పు, వంట సోడా వేసి బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత అందులో నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా చపాతి పిండిలా Softగా తయారుచేసి పెట్టుకోవాలి. ఈ పిండిని చిన్నచిన్న బాల్స్ లా (పూరీ ముద్దల్లా) రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని Egg shape వచ్చేలా తాల్చాలి. ఇక దానిపై చాకుతో Vertical గా గీతలు పెట్టాలి. ఆ గీతలు పెట్టేటప్పుడు కొనలు తెగిపోకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఇకపోతే ఆ గీతలు పెట్టిన తర్వాత రెండు చివర్లను Spring లాగా చుట్టాలి. ఇక ఆ తర్వాత వేడి వేడి నూనెలో వాటిని వేసి బాగా వేయించాలి.  అలాగే మరొక పొయ్యిపై పాకం రెడీ చేసుకోవాలి. ఒక కప్పు చక్కెర తీసుకుంటే.. అరకప్పు నీళ్లు తీసుకుని ఒక గిన్నెలో పెట్టి పాకం రెడీ చేసుకోవాలి. అది చేతికి జిగటగా అంటే వరకు వేడి చేసి దించాలి. దీంట్లో వేయించిన పనస తొనలను నానబెట్టాలి. అంతే ఎంతో రుచిగా ఉండే పనస పూలు రెడీ అయినట్టే. 

గోరుమిటీలు..

కావాల్సిన పదార్థాలు : ఒక కప్పు మైదా పిండి, ఉప్మా రవ్వ ఒక కప్పు, పంచదార ఒక కప్పు, నూనె సరిపడా, నెయ్యి రెండు చెంచాలు, ఇలాచీలు అరచెంచా, ఉప్పు సరిపడా తీసుకోవాలి.

తయారీ విధానం:  ఒక గిన్నెలో రెండు పెద్ద చెంచాల నెయ్యి వేసుకుని అందులో మైదా పిండి, రవ్వ, ఉప్పు వేసి బాగా Mix చేసుకోవాలి. అది ఉండలుగా ఉండకుండా చూసుకోవాలి. ఆతర్వాత ఈ మిశ్రమంలో సరిపడా నీళ్లు పోసుకుని చపాతీ పిండిలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఆ పిండిని ముద్దలుగా చేసుకోవాలి. ఒక్కో ముద్దను తీసుకుని దాన్ని బొటన వేళి గోరుతో యూ షేప్ లో చిన్న చిన్నగా వచ్చేటట్టు నొక్కాలి.  అన్ని పిండిముద్దలను అలాగే రెడీ చేసి వాటిని మసిలే నూనెలో వేయించాలి. గోల్డెన్ కలర్ రాగానే బయటకు తీయాలి. ఇక పోతే పాకం కోసం స్టవ్ పై ఒక గిన్నె పెట్టి అందులో కావాల్సినన్ని నీళ్లు పోసుకుని అందులో యాలకుల పొడిన, చక్కెరను వేయాలి. ఈ మిశ్రమం చేతికి చిక్కగా అంటితే దించాలి. ఇందుకు ముందు వేయించిన గోరుమిటీలను ఈ పాకంలో నానెబెడితే.. నోరూరించే గోరుమిటీలు తయారైనట్టే.. 

click me!