జుట్టు విషయంలో వీటిని అస్సలు నమ్మకండి..

By Mahesh RajamoniFirst Published Mar 21, 2023, 10:59 AM IST
Highlights

హెయిర్ కేర్ చాలా ముఖ్యం. అయితే చాలా మంది జుట్టు సంరక్షణ విషయంలో లేని పోని విషయాలను నమ్ముతుంటారు. వీటివల్లే జుట్టు బాగా దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. 
 

వ్యక్తిగత పరిశుభ్రతతో పాటుగా జుట్టు విషయంలో కూడా చాలా మంది జాగ్రత్తగా ఉంటున్నారు. నిజానికి జుట్టు సంరక్షణ బాగుంటేనే జుట్టు ఆరోగ్యంగా, అందంగా పెరుగుతుంది. జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా, పొడుగ్గా పెరిగేందుకు ఎన్నో చిట్కాలు ఉన్నాయి. అయినప్పటికీ కొన్ని జుట్టు సంరక్షణ చిట్కాలు మనకు అంత మంచివి కాకపోవచ్చంటున్నారు నిపుణులు. నిజానికి జుట్టు విషయంలో కొన్ని విషయాలను అస్సలు నమ్మకూడదని నిపుణులు అంటున్నారు. వాటివల్లే జుట్టు డ్యామేజ్ ఎక్కువవుతుందట. ఇంతకీ జుట్టు విషయంలో ఎలాంటి విషయాలను నమ్మకూడదంటే.. 

అపోహ: తరచూ హెయిర్ కట్ చేస్తే జుట్టు బాగా పెరుగుతుందా?

నిజం: జుట్టు చివర్ల కంటే మూలాల నుంచే పెరుగుతుంది. చివర్లను కత్తిరించడం వల్ల జుట్టు వేగంగా ఏం పెరగదు. కానీ చివర్లను కట్ చేయడం వల్ల రెండుగా చీలిన వెంట్రుకలు తొలగిపోతాయి. జుట్టు చివర్లను కట్ చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా కనిపిస్తుంది. 

అపోహ: తరచూ బ్రష్ చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది

నిజం: అతిగా బ్రష్ చేయడం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. ముఖ్యంగా దీనివల్ల విచ్ఛిన్నమవుతుంది. జుట్టు చివర్లు చీలిపోతాయి. దీనివల్ల జుట్టు పెరగడం ఆగిపోతుంది. బ్రష్ లేదా జుట్టును అతిగా దువ్వకూడదు. 

అపోహ: రోజూ జుట్టును కడగడం

నిజం: జుట్టును అతిగా కడగడం వల్ల నెత్తిమీద సహజ నూనెలు తగ్గిపోతాయి. దీనివల్ల జుట్టు పొడిబారుతుంది. అలాగే జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. అయితే మీరు మీ జుట్టును ఎన్ని రోజులకు ఒకసారి కడగాలి అనేది మీ జుట్టు రకం, జీవనశైలిని బట్టి నిర్ణయించబడుతుంది.

అపోహ: పొడి నెత్తి చుండ్రుకు కారణమవుతుంది

నిజం: చుండ్రు ఈస్ట్ లాంటి ఫంగస్, ఒత్తిడి, కొన్ని చర్మ వ్యాధులతో సహా ఎన్నో కారణాల వల్ల వస్తుంది. యాంటీ-డాండ్రఫ్ షాంపూలు ఈ లక్షణాల నుంచి ఉపశమనం పొందడానికి సహాయపడతాయి. కానీ ఈ చుండ్రుకు అసలు కారణమేంటో తెలుసుకోవాలి.

అపోహ: షాంపూను ఎక్కువ పెడితే జుట్టు శుభ్రంగా ఉంటుంది 

నిజం: షాంపూనె ఎక్కువ పెడితేనే జుట్టు శుభ్రంగా ఉంటుందనేది ఒక అపోహే. ఎందుకంటే షాంపూను ఎక్కువ పెడితే జుట్టులోని సహజ నూనెలు తొలగిపోతాయి. దీనివల్ల జుట్టు పొడిబారుతుంది. వెంట్రుకలు దెబ్బతింటాయి. 

అపోహ: హీట్ ప్రొటెక్టర్ అప్లై చేస్తే హీట్ స్టైలింగ్ వల్ల జుట్టుకు ఎలాంటి హాని జరగదు

నిజం: హీట్ ప్రొటెక్టర్లు హీట్ స్టైలింగ్ నష్టాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. కానీ అవి దానిని పూర్తిగా తగ్గించవు. అందుకే తక్కువ హీట్ నుు ఉపయోగించండి. అలాగే హీట్ స్టైలింగ్ ను పరిమితం చేయండి.

click me!