తమ్ముడిని చంపి.. మర్మాంగం కోసి తినేసిన అక్క

By ramya N  |  First Published Apr 9, 2019, 10:02 AM IST

తోడబుట్టిన తమ్ముడిని అతి కిరాతకంగా హత్య చేసి.. ఆ తర్వాత అతని మర్మాంగాన్ని కోసం తినేసింది ఓ అక్క. ఈ అతి దారుణ సంఘటన బ్రెజిల్ లో చోటుచేసుకుంది. 
 


తోడబుట్టిన తమ్ముడిని అతి కిరాతకంగా హత్య చేసి.. ఆ తర్వాత అతని మర్మాంగాన్ని కోసం తినేసింది ఓ అక్క. ఈ అతి దారుణ సంఘటన బ్రెజిల్ లో చోటుచేసుకుంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే...బ్రెజిల్ లో నివసిస్తున్న దంపతులకు 18ఏళ్ల కుమార్తె, ఐదేళ్ల కొడుకు ఉన్నారు. కాగా.. ఇటీవల తల్లి  మార్కెట్‌కు వెళ్తూ తన ఐదేళ్ల పిల్లోడిని 18 ఏళ్ల కూతురు కరీనాకు అప్పగించింది. కాగా.. ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని అదునుగా చేసుకున్న కరీనా... తమ్ముడిని చంపేందుకు ప్లాన్ చేసింది.

Latest Videos

గేమ్ ఆడదాం అని మాయమాటలు చెప్పి.. తమ్ముడిని తన గదిలోకి తీసుకెళ్లి దిండితో ఊపిరాడకుండా చేసి హతమార్చింది. అనంతరం అతని మర్మాంగాన్ని కోసి తినేసింది. ఇలా చేయడం ఆ దేశంలో ఆచారమంటూ యువతి చెప్పినట్టు తెలుస్తోంది. 

తరువాత తమ్ముడి శవాన్ని కింద పెట్టి చుట్టూ కొవ్వొత్తులను వెలిగించి తాను కూడా అక్కడే కూర్చొంది. తల్లి తలుపు తట్టినా తీయకపోవడంతో సందేహం వచ్చి బంధువులు ఇంటి తలుపును పగలకొట్టి లోపలికొచ్చారు. అక్కడి దృశ్యాన్ని చూసి వారంతా షాక్ అయ్యారు. యువతి అక్కడి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించగా.. ఆమెను పోలీసులకు అప్పగించారు. 

ఆమె సెల్‌ఫోన్, మెమొరికార్డును తగలబెట్టినట్టు పోలీసులు చెబుతున్నారు. ఇంట్లో డ్రగ్స్ కూడా దొరికాయని.. అనుమానంగా కనిపించిన వస్తువులను ఫారెన్సిక్ ల్యాబ్‌కు పంపించినట్టు పోలీసులు చెప్పారు. డ్రగ్స్ మత్తులోనే యువతి ఇలా చేసిందా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

click me!