బరువు తగ్గించే ‘అవిసె’

By ramya NFirst Published Feb 11, 2019, 2:22 PM IST
Highlights

బరువు తగ్గేందుకు చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఎంతటి డైట్ మొయింటెన్ చేసినా.. చాలా మంది బరువు తగ్గడంలో మాత్రం విఫలమౌతుంటారు.

బరువు తగ్గేందుకు చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఎంతటి డైట్ మొయింటెన్ చేసినా.. చాలా మంది బరువు తగ్గడంలో మాత్రం విఫలమౌతుంటారు. అయితే.. అవిసె గింజలను తీసుకుంటే మాత్రం కచ్చితంగా బరువు తగ్గవచ్చని చెబుతున్నారు నిపుణులు.

అవిసె గింజలను రోజూ తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాదు.. జీర్ణ సమస్యలు కూడా మటుమాయం అయిపోతాయి. అవిసె గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. దీనివల్ల అధిక బరువు తగ్గుతారు. అంతేకాదు.. శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

డయాబెటిస్ ని కూడా కంట్రోల్ ఉంచగల శక్తి అవిసె గింజల్లో ఉంది. వీటిని రోజూ అరగుప్పెడు తిన్నా ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. వీటిని నేరుగా తినడానికి కష్టంగా అనిపిస్తే.. పిండిలాగా చేసుకొని దానిలో బెల్లం కలిపి.. లడ్డూలాగా చేసుకొని రోజుకొకటి తింటే సరిపోతుందంటున్నారు నిపుణులు. 

click me!