బొప్పాయితో తగ్గండి బరువు ఇలా..

By ramya neerukonda  |  First Published Jan 29, 2019, 2:42 PM IST

 బొప్పాయిలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కేలరీలు తక్కువగా ఉంటాయి. ఆకలిని కూడా నియంత్రిస్తుంది. 


బొప్పాయి పండు.. తినడానికి చాలా రుచిగా ఉంటుంది. అంతేనా.. ముఖారవిందాన్ని పెంచుతుంది. ఈ విషయాలు మనకు తెలుసు. తాజాగా దీని గురించి మీకు తెలియని మరో విషయం ఏమిటో తెలుసా..? బొప్పాయి తింటే బరువు కూడా సులభంగ తగ్గొచ్చు అంటున్నారు. అసలు బొప్పాయి తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో.. మనం ఇప్పుడు చూద్దాం..

బొప్పాయి తినడం వల్ల జీర్ణ శక్తి పెరగుతుంది. మలబద్దకాన్ని బొప్పాయి తగ్గిస్తుంది. అంతేకాదు.. బొప్పాయిలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కేలరీలు తక్కువగా ఉంటాయి. ఆకలిని కూడా నియంత్రిస్తుంది. తద్వారా బొప్పాయి తినడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. దీంతో బరువు సులభంగా తగ్గవచ్చు.

Latest Videos

దీనిలో విటమిన్ ఏ, విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. వీటి కారణంగా రోగనిరోధక వ్యవస్థ సరిగా పనిచేస్తుంది. ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. 

కేవలం ఆరోగ్యమే కాదు.. అందాన్ని కూడా బొప్పాయి పెంచుతుంది. చిన్న బొప్పాయి ముక్కని ముఖానికి రుద్దుకొని.. 5నిమిషాల తర్వాత నీటితో కడిగితే.. ముఖం కాంతివంతంగా మారుతుంది. 

click me!