వైన్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని, అవి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయని వారు చెబుతున్నారు.
విపరీతంగా మద్యం సేవిస్తే బరువు పెరుగుతారని తెలుసు. కానీ.. వైన్ తీసుకుంటే మాత్రం బరువు తగ్గుతారని చెబుతున్నారు నిపుణులు. అంతేకాదు.. నిత్యం పరిమిత మోతాదులో వైన్ తాగితే గుండె జబ్బులు రాకుండా ఉంటాయని ఓ పరిశోధనలో తేలింది
వైన్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని, అవి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయని వారు చెబుతున్నారు. కనుక రోజూ తగిన మోతాదులో వైన్ తాగితే ఆరోగ్యకర లాభాలు ఉంటాయని కూడా వైద్యులు చెబుతుంటారు. అలాగే వైన్ తాగడం వల్ల బరువు తగ్గవచ్చని కూడా వారు అంటుంటారు. అయితే అసలు ఇందులో నిజమెంత ? అంటే.. ఈ విషయాన్ని తేల్చడానికే హార్వర్డ్ యూనివర్సిటీ సైంటిస్టులు పరిశోధనలు చేశారు.
వారు మధ్య వయస్సు ఉన్న 19,220 మంది మహిళలను 12.9 సంవత్సరాల పాటు పరిశీలించారు. వారిలో కొందరు రెడ్ వైన్ తాగేవారు ఉండగా, కొందరు వైట్ వైన్ తాగేవారు, కొందరు ఆల్కహాల్ తీసుకోని వారు ఉన్నారు. ఈ క్రమంలో చివరికి తేలిందేమిటంటే... రెడ్ వైన్ తాగిన వారు బరువు పెరగ్గా, వైట్ వైన్ తాగిన వారు బరువు తగ్గినట్లు గుర్తించారు.
ఇక ఆల్కహాల్ తీసుకోని వారు బరువు పెరిగే అవకాశం 43 శాతం వరకు ఉంటుందని తేల్చగా, వైన్ తాగిన వారు బరువు పెరిగే అవకాశం 33 శాతం వరకు ఉంటుందని నిర్దారించారు. వైట్ వైన్ తాగితే బరువు తగ్గవచ్చని.. రెడ్ వైన్ తాగితే బరువు పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే.. మితంగా తాగితేనే ఇవి వర్కౌట్ అవుతుందని హెచ్చరిస్తున్నారు.