Fathers Day: ఫాదర్స్ డే మొదటిసారి ఎక్కడ జరుపుకున్నారు.. ఎందుకు జరుపుకుంటారు! 

Published : Jun 14, 2022, 12:55 PM IST
Fathers Day: ఫాదర్స్ డే మొదటిసారి ఎక్కడ జరుపుకున్నారు.. ఎందుకు జరుపుకుంటారు! 

సారాంశం

Fathers Day: సాధారణంగా ప్రతి సంవత్సరం ఎన్నో రకాల ప్రత్యేకమైన రోజులు మనం మన కుటుంబ సభ్యులతో, బంధువులతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటాము. వివిధ రకాల పండుగలతో పాటు ఫ్రెండ్షిప్ డే, డాటర్స్ డే, మదర్స్ డే, ఫాదర్స్ డే అంటూ ఇలా ఎన్నో రకాల వేడుకలను సెలబ్రేట్ చేసుకుంటారు. 

Fathers Day: సాధారణంగా ప్రతి సంవత్సరం ఎన్నో రకాల ప్రత్యేకమైన రోజులు మనం మన కుటుంబ సభ్యులతో, బంధువులతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటాము. వివిధ రకాల పండుగలతో పాటు ఫ్రెండ్షిప్ డే, డాటర్స్ డే, మదర్స్ డే, ఫాదర్స్ డే అంటూ ఇలా ఎన్నో రకాల వేడుకలను సెలబ్రేట్ చేసుకుంటారు. 

ఇకపోతే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు గుర్తుగా ప్రతి ఏడాది ఫాదర్స్ డే మదర్స్ డే పెద్దఎత్తున జరుపుకుంటాము. అయితే ఫాదర్స్ డే మొదటిసారిగా ఎక్కడ జరుపుకున్నారు?ఫాదర్స్ డే జరుపుకోవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే...

ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి పాత్ర ఎంతో అద్భుతమైనది. పిల్లల పట్ల తండ్రి చూపించే ప్రేమానురాగాలకు వెలకట్టలేము. తన కోరికలు అన్నింటిని పిల్లల కోసం త్యాగం చేసే ఏకైక వ్యక్తి తండ్రి అని మాత్రమే చెప్పాలి.కుటుంబం కోసం తన పిల్లల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమిస్తూ తన జీవితాన్ని త్యాగం చేసిన తండ్రికి ఎంతో ఘనంగా మనం సెలబ్రేట్ చేసుకునే రోజే ఫాదర్స్ డే.

ప్రతి సంవత్సరం మన తండ్రికి కృతజ్ఞతలు తెలుపుకోవడం కోసం ప్రత్యేకంగా ఒక రోజున సెలబ్రేట్ చేసుకుంటాము. ఆరోజునే ఫాదర్స్ డే అంటారు. అయితే ఫాదర్స్ డే ఒక్కో దేశంలో ఒక్కో రోజు జరుపుకుంటారు. చాలా దేశాలలో, ఫాదర్స్ డే జూన్ మూడవ ఆదివారం నాడు జరుపుకోగా, పోర్చుగల్‌లోని స్పెయిన్‌లో, ఆగస్టు 8 న తైవాన్‌లో, డిసెంబర్ 5 న థాయ్‌లాండ్‌లో జరుగుతుంది. 

ఇక ఈ ఏడాది భారతదేశంలో జూన్ 19 వ తేదీ ఫాదర్స్ డే జరుపుకోనున్నారు. ఫాదర్స్ డే రోజు పిల్లలు ఎక్కడున్నా తండ్రి చెంతకు చేరుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలియచేయడమే కాకుండా తన కిష్టమైన విందు భోజనాలను ఏర్పాటు చేస్తూ తన తండ్రికి విలువైన కానుకలు ఇస్తూ పెద్ద ఎత్తున ఈ వేడుకను జరుపుకుంటారు.కేవలం తండ్రి మన పై చూపించిన ప్రేమకు గుర్తుగా ప్రతి ఏడాది ఒకరోజు ఆయనకు ఈ విధంగా సెలబ్రేట్ చేయడమే ఫాదర్స్ డే.

ఇక ఈ ఫాదర్స్ డే మొదటిసారి ఎక్కడ జరుపుకున్నారు అనే విషయానికి వస్తే..సోనోరా స్మార్ట్ డాడ్ అనే మహిళ ప్రత్యేక దినోత్సవాన్ని జరుపుకోవడంప్రారంభించింది అనే నమ్మకం ఏర్పడింది. అయితే తల్లితో పాటు సమానంగా బిడ్డ కోసం ఎంతో శ్రమించి తండ్రికి కూడా ఫాదర్స్ డే జరుపుకోవాలి అనేది ఆమె ఉద్దేశం. 

జూన్ 20, 1910 న, వాషింగ్టన్ సిటీ మేయర్ ఈ రోజును ఫాదర్స్ డేగా ప్రకటించారు. అయితే మే 1, 1972 న, అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ఫాదర్స్ డేను జాతీయ సెలవు దినంగా ప్రకటించారు. అయితే మొట్టమొదటిసారి అధికారికంగా ఫాదర్స్ డే ను జూన్ 18, 1972 న జరుపుకున్నారు. ఇలా అప్పటి నుంచి ప్రతి ఏడాది జూన్ మూడవ ఆదివారం పెద్ద ఎత్తున ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

PREV
click me!

Recommended Stories

తక్కువ ధరకే వజ్రాల చెవిపోగులు, చూసేయండి
ఈ నెలలో మనదేశంలో మంచు కురిసే ప్రాంతాలు ఇవే