Coffee Sleepiness: కాఫీ తాగితే కొంతమందికి ఎక్కువ నిద్ర వచ్చేస్తుంది, ఎందుకంటే..

Published : Mar 11, 2026, 06:56 PM IST
Drinking coffee makes some people sleepier because

సారాంశం

Coffee Sleepiness: చాలా మంది నిద్ర మత్తు వదిలించుకోవడానికి కాఫీ తాగుతూ ఉంటారు. కానీ కొందరిలో మాత్రం నిద్ర మత్తు వదలకుండా మరింత నిద్ర పట్టేస్తుంది. ఇలా కొంతమందికి కాఫీ వల్ల ఎందుకంత నిద్ర వస్తుంది? దీనికి కారణమేంటో తెలుసుకోండి.

ఉదయాన్నే టీ, కాఫీలతోనే రోజును మొదలుపెడతారు. అలా తాగితే ఫ్రెష్ గా అనిపిస్తుంది. చురుకుదనం వస్తుంది. కానీ కొంతమందికి మాత్రం కాఫీ తాగితే అలెర్ట్ అవ్వడానికి బదులు మళ్లీ నిద్రలోకి జారుకుంటారు. ఇలా అందరికీ జరగదు. కొంతమందికే ఇలా కాఫీ  శక్తిని ఇవ్వకుండా కొందరిలో ఇది నిద్రకు కారణమవుతుంది. దానికి కొన్ని ప్రత్యేక కారణాలున్నాయి.

అసలు మనకు నిద్ర ఎలా వస్తుంది 

టీ లేదా కాఫీ తాగగానే ముందుగా అందులోని కెఫీన్ మన బ్రెయిన్‌పై పనిచేయడం మొదలవుతుంది. మన మెదడులో 'అడెనోసిన్' (Adenosine) అనే ఒక రసాయనం రోజంతా నెమ్మదిగా పేరుకుపోతుంది. ఇది ఎక్కువయ్యే కొద్దీ మనకు నిద్ర వస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. మెదడు పనితీరు నెమ్మదించి, విశ్రాంతిని కోరుకుంటుంది. మనం కాఫీ తాగినప్పుడు, అందులోని కెఫీన్ ఈ అడెనోసిన్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది. అందుకే మనకు వెంటనే శక్తి వచ్చినట్టు, నిద్ర మాయమైనట్టు అనిపిస్తుంది. కానీ అందరికీ అలా జరగదు. 

కెఫీన్ పవర్ తాత్కాలికమే

అయితే కెఫీన్ ప్రభావం కాసేపు మాత్రమే ఉంటుంది. ఇది మన శరీరంలో సాధారణంగా 4 నుంచి 6 గంటల వరకు యాక్టివ్‌గా ఉంటుంది. ఈ సమయంలో, అడెనోసిన్ పేరుకుపోవడం ఆగదు. కెఫీన్ పవర్ తగ్గిన వెంటనే అప్పటిదాకా పేరుకుపోయిన అడెనోసిన్ అంతా ఒక్కసారిగా విడుదలవుతుంది. దీంతో కొందరు ఉన్నట్టుండి నీరసంగా మారిపోతారు.  నిద్రలోకి జారుకుంటారు. దీన్నే 'కెఫీన్ క్రాష్' అని పిలుస్తారు.

రోజూ కాఫీ ఎక్కువ తాగేవాళ్లకు ఒక కప్పు కాఫీ పెద్దగా కిక్ ఇవ్వదు. అదే ఎనర్జీ కోసం ఇంకా ఎక్కువ కాఫీ తాగాల్సి వస్తుంది. కెఫీన్ లెవెల్స్ తగ్గినప్పుడు, అడెనోసిన్ సిగ్నల్స్ మరింత బలంగా పనిచేసి, అలసటకు కారణమవుతాయి.

జన్యువులూ కారణమే

అందరి శరీరం కెఫీన్‌ను ఒకేలా జీర్ణం చేసుకోదు. మన జన్యువులను బట్టి ఇది మారుతుంది. కెఫీన్ జీవక్రియకు సంబంధించిన జీన్‌ను CYP1A2 అంటారు. ఈ జీన్ కొన్ని రకాలుగా ఉన్నవారిలో కెఫీన్ చాలా వేగంగా జీర్ణమవుతుంది. ఇలాంటి వాళ్లకు ఒక కప్పు కాఫీ పెద్దగా ఉత్సాహాన్ని ఇవ్వదు, పైగా అనుకున్నదానికంటే ముందే నీరసం వస్తుంది. దీనికి విరుద్ధంగా, నెమ్మదిగా జీర్ణం చేసుకునే వాళ్లు ఎక్కువసేపు ఉత్సాహంగా ఉంటారు.

నిద్ర రావడానికి ఒక్క కెఫీనే కారణం కాదు. కాఫీలో చక్కెర ఎక్కువగా వేసుకుని తాగితే, రక్తంలో షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగి, అంతే వేగంగా పడిపోతాయి. ఇది కూడా నీరసానికి దారితీస్తుంది. కాఫీ ఎక్కువగా తాగడం వల్ల మూత్రం ఎక్కువసార్లు వస్తుంది. దీంతో డీహైడ్రేషన్ సమస్య రావచ్చు. డీహైడ్రేషన్ కూడా అలసటకు ఒక ముఖ్య కారణం. అలాగే, ముందు రోజు సరిగ్గా నిద్రపోకపోయినా కాఫీ ప్రభావం తగ్గిపోతుంది. శరీరం అప్పటికే తీవ్రమైన నిద్రలేమితో ఉంటే, కెఫీన్ తాత్కాలికంగా ఉపశమనం ఇచ్చినా, తర్వాత అలసట రెట్టింపు అవుతుంది.

ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఫ్రెష్‌గా ఉండేందుకు కాఫీ తాగుతారు. కానీ దాని ప్రభావం అందరిపైనా ఒకేలా ఉండదు. అడెనోసిన్, కెఫీన్ టాలరెన్స్, మన అలవాట్లు వంటివి శరీరం స్పందించే తీరును ప్రభావితం చేస్తాయి. కాబట్టి, కాఫీ తాగినప్పుడు మీకు నిద్ర వస్తే, అది చాలా సాధారణమైన విషయమేనని అర్థం చేసుకోండి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Green Chillies: పచ్చిమిర్చి ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా చేయండి!
Avoid Fruits Before Sleep: రాత్రిపూట ఈ పళ్లు తింటున్నారా? అయితే మీరు రిస్క్‌లోఉన్నట్లే