తల్లికి లేదు.. కానీ తండ్రి నుంచి బిడ్డకు హెచ్ఐవీ

By ramya neerukonda  |  First Published Oct 2, 2018, 3:04 PM IST

పుట్టినప్పుడు బాబు ఆరోగ్యంగానే ఉన్నాడు. బాబు తల్లికి కూడా హెచ్ఐవీలేదు. అయితే.. తండ్రి కారణంగానే బాబు ఈ జబ్బునపడినట్లు గుర్తించారు.


తల్లికి హెచ్ఐవీ ఉంటే..ఆమె కడుపులోని బిడ్డకు కూడా హెచ్ఐవీ సోకే ప్రమాదం ఉందన్న సంగతి మనకు తెలిసిందే. అయితే.. ఇప్పుడు వైద్యపరంగా మనం అభివృద్ధి చెందాం కాబట్టి.. తల్లికి హెచ్ఐవీ ఉన్నా.. బిడ్డకు రాకుండా కాపాడగలుగుతున్నారు. అయితే.. తల్లికి హెచ్ఐవీ లేకపోయినా.. తండ్రి కారణంగా ఓ నాలుగేళ్ల పిల్లాడు హెచ్ఐవీ బారినపడ్డాడు. ఈ సంఘటన లండన్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే..  ఇటీవల ఓ నాలుగేళ్ల పిల్లాడు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరగా.. వైద్య పరీక్షల అనంతరం ఆ బాబుకి ఎయిడ్స్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. విచిత్రం ఏమిటంటే.. పుట్టినప్పుడు బాబు ఆరోగ్యంగానే ఉన్నాడు. బాబు తల్లికి కూడా హెచ్ఐవీలేదు. అయితే.. తండ్రి కారణంగానే బాబు ఈ జబ్బునపడినట్లు గుర్తించారు.

Latest Videos

పిల్లాడికి, అతని తండ్రికి కొన్ని పరీక్షలు నిర్వహించగా.. బాబు పుట్టిన కొద్ది కాలానికే ఈ వ్యాధి బారిన పడినట్లు  గుర్తించారు. సర్వసాధారణంగా రక్తమార్పిడి, కలుషిత సిరంజిల వల్ల పెద్దల నుంచి చిన్న పిల్లలకు  హెచ్‌ఐవీ సంక్రమిస్తుంది. ఈ కేసులో తండ్రికి ఒకప్పుడు పొంగు వ్యాధి సోకడం, పొక్కుల్లా వ్యాపించడం, ఇతర పరిస్థితుల కారణంగా అనారోగ్యం దాపురించింది. దాని ఫలితంగా శరీర భాగాల్లో ఏర్పడిన స్రావం అంటుకొని, బాలుడు హెచ్‌ఐవీ బాధితుడయ్యాడని పరిశోధకులు తేల్చారు. వివిధ స్థితిగతుల్లో తల్లిదండ్రుల దేహం నుంచి వెలువడే ద్రవ పదార్థాలు అనూహ్య రీతిన పసివారికి సోకి వ్యాధికారకాలుగా మారతాయని అమెరికాకు చెందిన ప్రొఫెసర్‌ థామస్‌ హోప్‌ అన్నారు. నిజానికి ఎయిడ్స్‌ ప్రాణాంతకమేమీ కాదు, దీర్ఘకాలిక చర్యలతో ఆ వ్యాధిని నియంత్రించవచ్చు.

అయితే పసిబిడ్డకు తండ్రి నుంచే ఆ తరహా విపత్కర స్థితి ఎదురుకావడాన్ని వైద్యపరంగా మరింత పరిశోధించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

click me!