ఇలా చేస్తే మీరు నిత్యయవ్వనంగా ఉండటం గ్యారంటీ..!

By Mahesh RajamoniFirst Published Mar 19, 2023, 1:45 PM IST
Highlights

యాంటీ ఏజింగ్ ప్రొడక్ట్స్ మీ వయస్సు సంకేతాలను దాచేస్తాయేమో.. కానీ వాటిని మాత్రం ఆపలేవు. వృద్ధాప్యాన్ని ఆపాలంటే మార్కెట్ ప్రొడక్ట్స్ ను వాటడం కాదు కొన్ని జీవన శైలి మార్పులు చేసుకోవాలంటున్నారు నిపుణులు. 

వయసు అనేది ఒక సంఖ్య మాత్రమే. వయస్సు పెరగడాన్ని ఎవ్వరం ఆపలేం. కానీ ఎవరూ కూడా వృద్ధాప్యంగా కనిపించాలనుకోరు. అయినప్పటికీ మొటిమలు, ముడతలు, ఎముకలు బలహీనపడటం, ముఖంపై నల్లని మచ్చలు వంటివి చాలా మందిని వయసుకు ముందే వృద్ధాప్యం వైపు నెట్టేస్తుంటాయి. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి లోపించడం మెదడు కంటే వయసు పెరుగుతోందని అర్థం చేసుకోవాలి. వయసుకంటే ముందుగా ఈ సమస్యలు రావడానికి మన జీవన శైలి అలవాట్లే కారణమంటున్నారు నిపుణులు. అందుకే మీరు యవ్వనంగా ఉండాలంటే ఈ జీవన  శైలి చిట్కాలను ఫాలో అవ్వండి.

నిపుణులు ఏమంటున్నారంటే..

ఆకుకూరలు, మొలకెత్తిన ధాన్యాలు, గ్రీన్ టీ, టమోటాలు, ఒమేగా -3 కొవ్వు ఆమ్ల ఆహారాలను తినడం వల్ల చర్మం, ఆరోగ్యం రెండూ ఆరోగ్యంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఫాస్ట్ ఫుడ్ వల్ల పొట్ట చెడిపోవడమే కాకుండా కిడ్నీలు, కాలేయం కూడా దెబ్బతింటాయి. హృదయ సంబంధ వ్యాధులు, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి సమస్యలను కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. దీన్ని నివారించాలంటే హెల్తీ ఫుడ్ ను మాత్రమే తీసుకోవాలి. దీంతో మీరు 50 ఏండ్లు దాటినా ఆరోగ్యంగా, దృఢంగా, యవ్వనంగా ఉంటారు. ఇందుకోసం ఏం  చేయాలంటే

ఆహారంలో కొవ్వును నియంత్రించండి

శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవాలంటే హెల్తీ డైట్ ను మాత్రమే తీసుకోవాలి. కొవ్వు కూడా అవసరం. కానీ దీన్ని ఎక్కువగా తీసుకోకూడదు. అలాగే ఆలివ్ ఆయిల్, నట్స్ ను కొవ్వు కోసం నిర్ణీత మోతాదులోనే వాడాలి. ఇది శరీరానికి ప్రోటీన్, ఫైబర్ లోపాన్ని తీర్చడానికి, ముఖంపై మెరుపు, అధిక రక్తపోటు, బరువు తగ్గడానికి కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. 

కొల్లాజెన్ 

వయసు పెరిగే కొద్దీ శరీరంలోని కండరాలతో పాటు అవయవాలు కూడా సడలిపోతాయి. వాటిలో ఒకటి కొల్లాజెన్. ఇది ఒక రకమైన ప్రోటీన్. వయసు పెరిగే కొద్దీ దీని ఉత్పత్తి తగ్గుతుంది. దీని వల్ల చర్మం ఫ్లెక్సిబుల్ గా మారడం, ముఖంలోని మెరుపు మాయమవడం వంటి సమస్యలు వస్తాయి. దీన్ని కాపాడుకోవాలంటే బ్రోకలీ, స్ట్రాబెర్రీ, బ్లాక్ బెర్రీస్ మొదలైన వాటిని తినండి. మాంసాహారానికి బదులుగా చేపలను తినండి. వీటిని తినేవారికి ముఖంపై ముడతలు త్వరగా రావు.

తయారుగా ఉన్న ఆహారాన్ని నివారించాలి

ప్రస్తుతం చాలా మంది ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ లను చేసేస్తున్నారు. తయారుగా ఉన్న ఆహారం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఎందుకంటే తయారు చేసిన వెంటనే ఆహారాన్ని తినాలి. లేకపోతే పోషకాలు నశిస్తాయి. కూరగాయలలో ఉండే ప్రోటీన్లు, విటమిన్లు ప్రభావవంతంగా ఉండవు. అందుకే ఇంట్లో తయారుచేసిన ఆహారాన్నే తినాలి. ఇది శరీరానికి మేలు చేస్తుంది. ఆహారం శరీరంపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది.

విటమిన్ సి 

విటమిన్ సి మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుందన్న సంగతి అందరికీ తెలుసు. యాంటీఆక్సిడెంట్ గా పనిచేసే విటమిన్ సి వృద్ధాప్యాన్ని నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కంటిచూపు, జ్ఞాపకశక్తి వ్యాధులు, కోతలు, కాలిన గాయాలను ఇది తొందరగా మాన్పుతుంది. ఇందుకోసం నిమ్మ, చింతపండు, జామ, నారింజ సిట్రస్ పండ్లను తీసుకోండి. 

click me!