
హెయిర్ స్టైలింగ్ యంత్రాలు, రసాయన చికిత్సలు, పేలవమైన జుట్టు సంరక్షణ వంటి వివిధ కారణాల వల్ల జుట్టు బాగా రాలుతుంది. అంతేకాదు, కాలుష్యం, యూవీ రేడియేషన్, హాట్ వాటర్ వంటి కారకాలు కూడా హెయిర్ ఫాల్ కు దారితీస్తాయి. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో జుట్టు రాలడాన్ని ఆపి జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..
సరైన షాంపూ
సరైన షాంపూను ఉపయోగించి కూడా జుట్టు రాలడాన్ని ఆపొచ్చు. ఈ షాంపూలు మీ జుట్టు మూలాలను దెబ్బతీయకుండా మీ నెత్తిని శుభ్రపరుస్తాయి. అంతేకాదు మీ నెత్తిమీద ఉండే సహజ నూనెను కూడా రక్షిస్తుంది. ఇది మీ నెత్తిమీద ఉండే ధూళి, బ్యాక్టీరియా, చనిపోయిన కణాలను తొలగిస్తంది. ఈ షాంపూలు మీ జుట్టు ఒత్తుగా పెరిగేందుకు సహాయపడతుంది. మీరు ఉపయోగించే షాంపూలో క్లెన్సర్ పారాబెన్లు, సల్ఫేట్లు ఉండకూడదు.
కండిషనర్
మీ జుట్టును కండిషనింగ్ చేయడం మర్చిపోకూడదు. కానీ మీరు ఉపయోగించే కండీషనర్ మంచిది అయ్యి ఉండాలి. ఉదాహరణకు పెరుగు మార్కెట్లో లభించే అద్భుతమైన సహజ కండిషనర్. ముఖ్యంగా మీరు స్వంతంగా కండీషనర్ తయారు చేయాలనుకుంటే పెరుగుకు తేనెను కలపండి. ఇది మీ జుట్టుకు, నెత్తికి మంచి పోషణను అందిస్తుంది. చుండ్రు, దురద సమస్యలను పోగొడుతుంది. అంతేకాక ఇది జుట్టు రాలడాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.
నెత్తి ఆరోగ్యం
మీ నెత్తి ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. మీ నెత్తిమీద చుండ్రు ఉన్నా, డ్రై గా ఉన్నా, దురద పెట్టినా జుట్టు విపరీతంగా రాలుతుంది. అందుకే మీ నెత్తి ఆరోగ్యంగా ఉండేలా చూసుకోండి. మంచి హెయిర్ ఆయిల్ తో నెత్తిని మసాజ్ చేయండి. ఇది రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది మీ జుట్టును బలంగా ఉంచుతుంది. వారానికి రెండుసార్లు కొబ్బరి లేదా బాదం నూనెతో మసాజ్ చేస్తే మీ జుట్టు ఒత్తుగా మారుతుంది.
సమతుల్య ఆహారం
ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహారం తిన్నా జుట్టు రాలుతుంది. మీరు సమతుల్య ఆహారాన్ని తింటే మీ జుట్టు తిరిగి ఒత్తుగా మారుతుంది. శరీరంలో పోషకాల లోపం కూడా హెయిర్ ఫాల్ కు దారితీస్తుంది. అందుకే మంచి పోషకాహారం తీసుకోండి. గుడ్లు, బెర్రీలు, బచ్చలికూర, కొవ్వు చేపలు, కాయలు, చిలగడదుంపలు, సోయాబీన్స్, మాంసాలు, ఇతర ఆహారాల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ, జింక్, విటమిన్ బి, ఇనుము, బయోటిన్, ప్రోటీన్, ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ జుట్టుకు లోపలి నుంచి పోషణను అందిస్తాయి.
ప్రతి ఆరు నెలలకు ఒకసారి హెయిర్ కట్
మీ జుట్టు త్వరగా పెరగడానికి హెయిర్ కట్ కూడా ఉపయోగపడుతుంది. హెయిర్ ట్రిమ్మింగ్ మీ జుట్టు డెడ్ ఎండ్లను తొలగిస్తుంది. తరచుగా జుట్టు చివర్లను కట్ చేస్తే మీ జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుుంది. అయితే సన్నని జుట్టుకు తరచుగా ట్రిమ్స్ అవసరం కావొచ్చు.